ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పవిత్ర ప్రకాశ్ పురబ్ సందర్భంగా శ్రీ గురు తేగ్ బహదూర్‌కు ప్రధాని నివాళి

Posted On: 18 APR 2025 12:26PM by PIB Hyderabad

పవిత్ర ప్రకాశ్ పురబ్ సందర్భంగా శ్రీ గురు తేగ్ బహదూర్ కు ప్రధానమంత్రి నేడు నివాళి అర్పించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటంలో అచంచలంగా నిలిచిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీవితం ధైర్యానికీ కరుణామయ సేవకూ ప్రతిరూపమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

 

“శ్రీ గురు తేగ్ బహదూర్ జీ పవిత్ర ప్రకాశ్ పురబ్ సందర్భంగా- ఆధ్యాత్మికంగా దేశానికి మార్గదర్శకులుగా నిలిచిన తేజోమూర్తుల్లో ఒకరైన ఆయనకు వినయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. ధైర్యమూ కారుణ్యంతో కూడిన సేవకూ ఆయన జీవితం ప్రతీక. అన్యాయంపై ఆయన పోరాటం అచంచలమైనది. ఆయన స్వప్నించిన సమాజాన్ని సాకారం చేసే దిశగా, తన బోధనలు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.”


(Release ID: 2122813)