ప్రధాన మంత్రి కార్యాలయం
సమాజానికి కెప్టెన్ విజయకాంత్ చేసిన సేవలను స్మరించుకొన్న ప్రధానమంత్రి
Posted On:
14 APR 2025 11:04PM by PIB Hyderabad
కెప్టెన్ విజయకాంత్‌తో తన స్నేహాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావిస్తూ, సమాజానికి కెప్టెన్ విజయకాంత్ అందించిన సేవలను ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీమతి ప్రేమలతా విజయకాంత్ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘నా ప్రియ మిత్రుడు కెప్టెన్ విజయకాంత్ అసాధారణ వ్యక్తి.
ఆయన, నేను సంవత్సరాల తరబడి ఎంతో ఆత్మీయంగా మెలగుతూ తరచు మాట్లాడుకునేవాళ్లం. అంతేకాదు, మేం కలిసి పనిచేశాం.
సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన మంచి పనులను దృష్టిలో పెట్టుకొని అన్ని తరాల వారు ఆయనను తలుచుకుంటూ ఉంటారు.
@PremallathaDmdk’’
(Release ID: 2122000)
Visitor Counter : 7
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam