ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు


· గత దశాబ్దంలో వేగం పుంజుకున్న వారణాసి అభివృద్ధి: ప్రధాని

· మహిళా సాధికారత, ఆత్మ విశ్వాస పెంపు, సమాజ సంక్షేమానికి మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలేల జీవితాలు అంకితం: ప్రధానమంత్రి

· కాశీలోని వేలాది మంది జీవితాల్లో, నగర ముఖచిత్రంలో పరివర్తనకు మూలం బనాస్ డైరీ: శ్రీ మోదీ

· ఆరోగ్య రాజధానిగా కాశీ: ప్రధాని

· నగర మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలపై కాశీ సందర్శకుల ప్రశంసల జల్లు: ప్రధానమంత్రి

· వారసత్వం, అభివృద్ధి అనే రెండు చక్రాలకు సమాన ప్రాధాన్యంతో ప్రగతిపథంపై పరుగులు పెడుతున్న భారత రథం - ఈ దృక్పథానికి కాశీ అత్యద్భుత నమూనా: శ్రీ మోదీ

· అవకాశాలు సహా సామర్థ్యానికి, విజయాలకు ఉత్తరప్రదేశ్ ప్రతీక: ప్రధాని

Posted On: 11 APR 2025 12:56PM by PIB Hyderabad

ఈ రోజు ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ. 3,880 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేశారుఅనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూకాశీ నగరంతో తనకు గల గాఢానుబంధాన్ని గురించిన అనుభూతులను పంచుకున్నారుతన కుటుంబ సభ్యులుప్రాంత ప్రజలు తనకు అందించిన ఆశీస్సులకుతనపై కురిపించే ఆదరాభిమానాలకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారుప్రజలందించే ప్రేమ తనను రుణగ్రస్తుడిని చేసిందనితాను కాశీకికాశీ తనకు చెందుతుందన్నారురేపు హనుమాన్ జన్మోత్సవమని గుర్తు చేస్తూకాశీలోని సంకట మోచన మహారాజ్ ను సందర్శించే గౌరవం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారుహనుమాన్ జన్మోత్సవ పావన సందర్భాన్ని జరుపుకోవడానికి ముందస్తుగా అభివృద్ధిని వేడుక చేసుకునేందుకు కాశీ ప్రజానీకం తరలి రావడం హర్షదాయకమన్నారు.

గత దశాబ్ద కాలంలో వారణాసి అభివృద్ధి వేగం పుంజుకుంది” అని ప్రధాని హర్షం వ్యక్తం చేశారుఈ నగరం ఆధునికతను అలవర్చుకుంటూనే వారసత్వాన్ని కాపాడుకుంటూ వెలుగులీనే భవిష్యత్తుకు సంసిద్ధమవుతోందన్నారుపూర్వాంచల్ ఆర్థిక చిత్రంలో కేంద్రస్థానం దక్కించుకున్న కాశీని ఇక పురాతన నగరంగా కాకప్రగతిశీల నగరంగా గుర్తించవలసిన సమయం ఆసన్నమైందని అన్నారుకాశీ విశ్వేశ్వరుడు పూన్చిన అభివృద్ధి రథాన్ని అధిరోహిస్తున్న కాశీపూర్వాంచల్ ను ఆ బాటపై ముందుకు తీసుకువెళుతోందని వ్యాఖ్యానించారు.    

కాశీపూర్వాంచల్ లోని ప్రాంతాలకు సంబంధించి నేడు ప్రారంభించిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలుప్రారంభోత్సవాల గురించి ప్రస్తావిస్తూమౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా రహదారి అనుసంధానం బలపడుతుందనిప్రతి ఇంటికీ నీటి వసతి కల్పించాలన్న ఆశయం నెరవేరగలదనివిద్యఆరోగ్యంక్రీడా సదుపాయాలు మెరుగవుతాయని చెప్పారుపూర్వాంచల్ ను అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా యువతకుప్రతి ప్రాంతానికికుటుంబానికి మెరుగైన వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారుతాము ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా ప్రతి కాశీ పౌరుడూ లబ్ధి పొందగలడంటూ వారణాసిపూర్వాంచల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు

నేడు జ్యోతిబా ఫూలే జయంతి సందర్భాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని... మహిళా సాధికారతఆత్మ విశ్వాస పెంపుసమాజ సంక్షేమానికి మహాత్మా జ్యోతిబా ఫూలేసావిత్రీబాయి ఫూలేలు తమ జీవితాలను అంకితం చేశారని అన్నారువారి ఆశయాలను కొనసాగించేందుకు తాము చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వివరించారుతమ ప్రభుత్వం ‘సబ్కా సాథ్సబ్కా వికాస్’ అనే సూత్రాన్ని నమ్మి ఆచరిస్తోందని స్పష్టం చేశారుపూర్వాంచల్ లో పశువులను పెంచుతున్న కుటుంబాలను అభినందించిన శ్రీ మోదీఈ పనిలో ఎంతో శ్రమిస్తున్న మహిళలు ఈ ప్రాంతానికే స్ఫూర్తిదాతలుగా ఉన్నారని కొనియాడారుఈ మహిళలపై ఉంచిన విశ్వాసం అద్భుతమైన ఫలాలను ఇచ్చిచరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారుఉత్తరప్రదేశ్ బనాస్ పాల ఉత్పత్తి కేంద్రంతో అనుబంధమున్న పశువుల పెంపకందారులకు బోనస్ సొమ్మును బదిలీ చేసే అంశాన్ని ప్రధాని ప్రస్తావించారురూ. 100 కోట్లకు పైగా బోనస్ రూపంలో పంపిణీ చేసిన సొమ్ముని బహుమతిగా అందించలేదని,  వారి నిబద్ధతకుశ్రమకి గుర్తింపుగా అందజేశామని అన్నారుశ్రమపట్టుదల వెలకట్టలేనివని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  

పూర్వాంచల్ లో నివసించే మహిళలు ఒకప్పుడు ఉపాధి గురించి చింతిస్తేనేడు వారే “లఖ్ పతీ దీదీలు’ గా మారి ప్రగతి మార్గంలో పయనిస్తున్నారన్నారుబనాస్ డైరీ... కాశీలో నివసించే వేలాది మంది కుటుంబాల్లోనగర ముఖచిత్రంలో పరివర్తనకు మూలమని శ్రీ మోదీ అన్నారుశ్రమకు తగిన గుర్తింపునిచ్చిన బనాస్ డైరీకాశీవాసుల ఆశలకుఆశయాలకు రెక్కలు తొడిగిందన్నారుఇటువంటి ప్రగతి ఈ ప్రాంతానికే పరిమితమవలేదనిదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మార్పుని స్పష్టంగా గమనించవచ్చని చెప్పారు. “పాల ఉత్పత్తిలో నేడు భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందిగత దశాబ్దంలోనే పాల ఉత్పత్తిలో 65 శాతం వృద్ధి నమోదైంది” అని చెప్పారులక్షలాది మంది రైతులుపశు పోషకులు గత పదేళ్ళుగా చేసిన కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని కితాబిచ్చారుపాడిపరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందనివాటి అమలుని వేగవంతం చేసిందని చెబుతూపాడి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను అందించి,  రుణ మొత్తాన్నీ పెంచామని,  సదుపాయాలను మెరుగుపరిచామనిపలు రాయితీలు కల్పించామని వివరించారుపశువుల్లో తీవ్ర ఇబ్బందులను కలిగించే ఫుట్ అండ్ మౌత్ వ్యాధి కట్టడికి ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారుపాల సేకరణ క్రమ పద్ధతిలో సాగేందుకు 20,000 పాడి సహకార సమాఖ్యల పునరుద్ధరణ పనులు చేపట్టిన ప్రభుత్వంలక్షలాది మంది కొత్త సభ్యులతో సమాఖ్యల పరిపుష్టికి కృషి చేసిందని చెప్పారుదేశవాళీ పశుజాతుల అభివృద్ధిపై దృష్టి సారించాలన్న ప్రధానిరాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలిమి జాతుల పెంపకం కోసం శాస్త్రీయమైన పద్ధతులు అవలంబించాలని సూచించారుతాము ప్రవేశపెట్టిన పథకాలు పశుపోషకులకు మెరుగైన అవకాశాలుకొత్త మార్కెట్లుకొత్త అభివృద్ధి అవకాశాలను కల్పించేందుకు ఉద్దేశించినవని శ్రీ మోదీ వివరించారుపూర్వాంచల్ ప్రాంతంలో అభివృద్ధి ఆశయాన్ని వ్యాప్తి చేసినందుకు బనాస్ డైరీ కాంప్లెక్సుకు ప్రధాని అభినందనలు తెలియజేశారుడైరీ ఈ ప్రాంతంలో మేలు జాతి గిర్ ఆవులను పాడి రైతులకు అందించిందనివాటి సంఖ్య  క్రమంగా పెరుగుతుండడంతో అవసరమైన గ్రాసాన్ని అందించేందుకు వారణాసిలో ఏర్పాట్లు ప్రారంభించిందని అభినందనలు తెలియజేశారు పూర్వాంచల్ లోని లక్షమందికి పైగా పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తున్న బనాస్ డైరీని ప్రశంసించిన శ్రీ మోదీపాడి రైతుల సాధికారతకువారి జీవనోపాధి మెరుగుదలకు ఈ చర్య దోహదపడుతోందన్నారు.

సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ వయో వందన కార్డులను పంపిణీ చేయడం తనకు దక్కిన విశిష్ట అవకాశమని ప్రధానమంత్రి అన్నారువారి ముఖాల్లో కనిపిస్తున్న సంతృప్తి.. ఈ పథకం విజయవంతం అయిందనడానికి నిదర్శనమని తెలిపారువృద్ధుల ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులకున్న ఆందోళనల గురించి తెలియజేస్తూ.. 10-11 ఏళ్ల క్రితం పూర్వాంచల్‌లో వైద్య సేవలు పొందడానికి ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు. ‘‘ప్రస్తుతం కాశీ ఆరోగ్య రాజధానిగా మారింది’’ అంటూ ఈ ప్రాంతంలో సాధించిన అభివృద్ధి గురించి వివరించారుఅధునాతన సౌకర్యాలున్న ఆసుపత్రులు ఒకప్పుడు ఢిల్లీముంబయి లాంటి నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేవనిఇప్పుడు ప్రజల ఇళ్లకు చేరువలో ఉన్నాయని పేర్కొన్నారుపౌరులకు అవసరమైన సదుపాయాలను వారికి అందుబాటులోకి తీసుకురావడమే అభివృద్ధి సారాంశమని చెప్పారు.

గడచిన దశాబ్దంలో ఆరోగ్యరంగంలో సాధించిన గణనీయమైన పురోగతి గురించి మాట్లాడుతూ ఆసుపత్రుల సంఖ్యను పెంచడమే కాకుండా.. రోగుల గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారుదానిలో భాగంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం పేదలకు వరం లాంటిదనిఇది రోగులకు అవసరమైన చికిత్సను అందించడమే కాకుండా.. వారిలో విశ్వాసాన్ని నింపుతోందని వెల్లడించారుఈ పథకం ద్వారా వారణాసికి చెందిన వేల మందిఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారుదీని ద్వారా అందే వైద్యసహాయంశస్త్ర చికిత్సఉపశమనంతో వారి జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్నారుఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని లక్షలాది కుటుంబాలకు కోట్ల రూపాయలు ఆదా అయినట్లు వెల్లడించారువృద్ధులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తామని తాను ఇచ్చిన హామీ ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకానికి దారి తీసిందని చెప్పారుఇది 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత చికిత్స అందిస్తుందని తెలిపారువారణాసిలో అత్యధికంగా 50,000 వయో వందన కార్డులు పంపిణీ అయ్యాయని తెలిపారుఇది కేవలం సంఖ్య మాత్రమే కాదనిఆరోగ్య సేవలను అందించడంలో అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారుచికిత్స కోసం భూమిని అమ్మడంరుణాలు తీసుకోవడం లేదా నిస్సహాయ స్థితిలో మిగిలిపోకుండా సహాయపడుతోందని తెలియజేశారుఆయుష్మాన్ కార్డుల ద్వారా వారి వైద్య సేవలకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

మౌలిక సదుపాయాలుసౌకర్యాల కల్పనతో కాశీలో సాధించిన గణనీయమైన మార్పుల గురించి ప్రధాని ప్రముఖంగా వివరించారుఇది సందర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోందని తెలిపారుప్రతి రోజూ లక్షల సంఖ్యలో వారణాసిని సందర్శిస్తారనిపవిత్ర గంగానదిలో స్నానమాచరించిబాబా విశ్వనాథుడిని ప్రార్థిస్తారన్నారువారిలో చాలా మంది కాశీలో వచ్చిన మార్పులను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారని తెలిపారుకాశీలో రోడ్లురైల్వేలువిమానాశ్రయం పదేళ్ల క్రితం ఉన్నట్టుగానే ఇప్పుడూ ఉంటే.. ఈ నగరం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారుచిన్న పండగలకు సైతం ట్రాఫిక్ జామ్ అయ్యేదనివేడిదుమ్మును భరిస్తూనే సందర్శకులు మొత్తం నగరం చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారుఫూల్వారియా ఫ్లైఓవర్ నిర్మాణం దూరాన్ని తగ్గించిసమయం ఆదా చేస్తోందనిరోజువారీ ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనాన్ని తీసుకొచ్చిందని అన్నారురింగ్ రోడ్డు ప్రయోజనాలను సైతం ప్రధానమంత్రి తెలిపారుజౌన్‌పూర్ఘాజీపూర్ గ్రామీణ ప్రాంత వాసులకుబల్లియామవుఘాజీపూర్‌ జిల్లాల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకొనేందుకు ప్రయాణ సమయంట్రాఫిక్ రద్దీని తగ్గించిందని తెలిపారు.

ఘాజీపూర్జౌన్‌పూర్మీర్జాపూర్ఆజాంఘడ్ తదితర నగరాలకు త్వరగాసౌకర్యవంతంగా చేరుకొనేలా ఈ ప్రాంతంలో మెరుగైన రవాణా సదుపాయాలువిస్తరించిన రహదారుల గురించి శ్రీ మోదీ వివరించారుగతంలో ట్రాఫిక్ రద్దీతో సతమతమైన ఈ ప్రాంతాలు ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారుగడచిన దశాబ్దంలో వారణాసిచుట్టుపక్కల ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.45,000 కోట్లు పెట్టుబడి పెట్టామని తెలిపారుఈ పెట్టుబడులు.. మౌలిక సదుపాయాలతో పాటు నమ్మకాన్ని కూడా పెంచాయనికాశీతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు లబ్ధి చేకూర్చాయని ఆయన పేర్కొన్నారువేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల విస్తరణను ఆయన ప్రకటించారుప్రస్తుతం జరుగుతున్న లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయ విస్తరణ పనులుఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేలా చేపడుతున్న ఆరు లైన్ల సొరంగ మార్గ నిర్మాణం పనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారుభదోహిఘజియాపూర్జౌన్‌పూర్‌లను అనుసంధానించే వివిధ ప్రాజెక్టులతో పాటు బిఖారీపూర్మందౌడియాలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రారంభాన్ని కూడా గుర్తు చేశారుఈ డిమాండ్లను నెరవేర్చడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారువారణాసి నగరాన్ని సారనాథ్‌తో కలిపేలా కొత్త వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారుఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు సారనాథ్ చేరుకోవాలంటే నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే రానున్న నెలల్లో కాశీకి చేరుకోవడం మరింత సులభమవుతుందనిఅభివృద్ధి ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలను పెంచుతుందని అన్నారుజీవనాధారంఆరోగ్యసేవల నిమిత్తం వారణానికి వచ్చే వారికి ప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతుందన్నారుకాశీలో రోప్‌వే ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభమైన విషయాన్ని కూడా ప్రస్తావించారుతద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సౌకర్యం ఉన్న నగరాల్లో కాశీ కూడా ఒకటిగా నిలుస్తుందని తెలిపారు.

వారణాసిలో చేపడుతున్న అభివృద్ధిమౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్వాంచల్ యువతకు లబ్ధి చేకూరుస్తాయని శ్రీ మోదీ అన్నారుకాశీ యువత క్రీడల్లో రాణించేలా నిరంతర అవకాశాలను కల్పిచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారుయువ అథ్లెట్ల కోసం కాశీలో నిర్మిస్తున్న వివిధ స్టేడియాలుఎక్స్ లెన్స్ కేంద్రాల గురించి తెలియజేశారువారణాసికి చెందిన వందల మంది క్రీడాకారుులు శిక్షణ పొందుతున్న కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి ప్రధాని గుర్తు చేశారుఎంపీ క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఈ మైదానాలపై తమ ప్రతిభను చూపించే అవకాశం దొరికిందని అన్నారు.

అభివృద్ధివారసత్వాన్ని సమతౌల్యం చేస్తూ సాగిస్తున్న భారత్ ప్రయాణం గురించి తెలియజేస్తూ.. దీనికి కాశీని అత్యుత్తమ ఉదాహరణగా పేర్కొన్నారుగంగా ప్రవాహంభారతీయ చైతన్యం గురించి వివరిస్తూ ‘‘దేశ ఆత్మనువైవిధ్యాన్ని అందంగా చూపించే చిత్తరువు కాశీ’’ అని వర్ణించారుకాశీలోని ప్రతి ఇంట్లో ప్రత్యేకమైన సంస్కృతిభారతీయతలోని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని అన్నారుకాశీ-తమిళ సంగమం లాంటి కార్యక్రమాలు దేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారుదేశ వైవిధ్యాన్నంతా ఒకే చోట ప్రదర్శించేలా కాశీలో నిర్మించనున్న ఏక్తామాల్ గురించి వివరించారుఇది వివిధ జిల్లాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది.

ఇటీవల కొన్నేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకొన్న ప్రగతిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూఈ రాష్ట్రం తన ఆర్థిక ముఖచిత్రంతో పాటు తన దృష్టికోణాన్ని కూడా మార్చుకొందన్నారుఉత్తరప్రదేశ్ ఇక అవకాశాల నేల మాత్రమే కాదనిసామర్థ్యాలువిజయాల నిలయంగా కూడా ఈ రాష్ట్రం మారిపోయిందని ఆయన అన్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’కు ప్రపంచమంతటా ఆదరణ లభిస్తోందని ఆయన చెబుతూ.. భారత్‌లో రూపొందుతున్న ఉత్పాదనలు ప్రస్తుతం గ్లోబల్ బ్రాండ్లుగా పేరుతెచ్చుకొంటున్నాయని తెలిపారుఅనేక ఉత్పాదనలు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐట్యాగులను సంపాదించుకొన్న సంగతిని ఉదాహరిస్తూఈ ట్యాగులు ఉత్త లేబుళ్లే కాదు.. ఇవి అంతకు మించినవనీఇవి ఈ నేలకు గుర్తింపు లభించినట్లు సూచించే ధ్రువపత్రాలుగా ప్రధాని అభివర్ణించారుఏదైనా ఒక ఉత్పాదన ఫలానా ప్రాంతంలో ప్రత్యేకంగా తయారైందని జీఐ ట్యాగ్‌లు చెబుతుంటాయనిజీఐ ట్యాగ్ చేరుకొన్న ప్రాంతంలో ఈ ట్యాగులు మరింత ఎక్కువ వాణిజ్యాత్మక విజయానికి బాటలువేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా జీఐ ట్యాగింగులో ఉత్తరప్రదేశ్ నాయకత్వ స్థితిని చేజిక్కించుకుందని శ్రీ మోదీ స్పష్టం చేస్తూరాష్ట్ర కళలకుచేతివృత్తి ఉత్పాదనలకునైపుణ్యాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం రోజురోజుకూ పెరుగుతోందన్నారువారణాసివారణాసి చుట్టుపక్కల ప్రాంతాల్లో తయారవుతున్న 30కి పైగా ఉత్పాదనలకు జీఐ ట్యాగులు లభించాయనిజీఐ ట్యాగులు ఈ ఉత్పాదనలకు పాస్‌పోర్టు లాంటివంటూ చమత్కరించారువారణాసి తబలాషెహనాయిగోడలకు అలంకరించే పెయింటింగులుఠండాయీ (చల్లని పానీయాలు), భర్వాన్ లాల్ మిర్చ్లాల్ పేడాతిరంగా బర్ఫీ వంటి జీఐ గుర్తింపు పొందిన ఈ ప్రాంత ఉత్పాదనలను కొన్నింటిని ఆయన ఉదాహరించారుఈమధ్యే జీఐ ట్యాగులను సంపాదించిన జౌన్‌పుర్ ఇమార్‌తీమథుర సాంఝీ కళబుందేల్‌ఖండ్ కఠియా గోధుమపీలీభీత్ వేణువుప్రయాగ్‌రాజ్ మూంజ్ గడ్డిని ఉపయోగించి అల్లే బుట్టలుగోడకు వేలాడదీసే అలంకరణ వస్తువులుఇతరత్రా ఉత్పాదనలుబరేలీ జర్‌దోజీచిత్రకూట్ కలప ఉత్పాదనలులఖీంపుర్ ఖీరీకి చెందిన థారూ జర్‌దోజీ వగైరా ఉత్పాదనలను కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘ఉత్తరప్రదేశ్ మట్టి పరిమళం ఇప్పుడు సరిహద్దులను దాటిపోయితన వారసత్వాన్ని బహు దూర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తోంద’’ని ఆయన అన్నారు.
కాశీని పరిరక్షించుకోవడం అంటే భారత్ ఆత్మను రక్షించడమే అని ప్రధాని వ్యాఖ్యానించారుకాశీని నిరంతరం శక్తిమంతంగా నిలపడందీని శోభను చెక్కుచెదరనీయకపోవడందీని ప్రాచీన భావనను ఆధునిక గుర్తింపుతో పెనవేయాలనే సామూహిక నిబద్ధతను కనబరచాలని ప్రధానంగా చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నరు శ్రీమతి ఆనందీబెన్ పటేల్ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ సహా ఇతరులు పాల్గొన్నారు.
నేపథ్యం
వారణాసిలో రూ.3,880 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేశారువారణాసిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిముఖ్యంగా రహదారి సంధానాన్ని పెంచుతానన్న తన వాగ్దానానికి అనుగుణంగానే ఈ ప్రాంతంలో వివిధ రహదారి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు... మరికొన్నింటికి శంకుస్థాపనలు కూడా చేశారువీటికి అదనంగావారణాసి రింగ్ రోడ్డుసార్‌నాథ్‌ల మధ్య ఒక రోడ్డు బ్రిడ్జినగరంలోని భిఖారీపుర్మండువాడీహ్ క్రాసింగ్‌పై ఒక ఫ్లయ్ ఓవర్‌లతోపాటు వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎన్‌హెచ్-31లో రూ. 980 కోట్లకు పైచిలుకు వ్యయమయ్యే ఒక హైవే అండర్‌పాస్ రోడ్ న్నెల్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
విద్యుత్తు రంగ మౌలికసదుపాయాల కల్పనకు దన్నుగా నిలిచేలా వారణాసి డివిజన్‌లోని జౌన్‌పుర్చందౌలీగాజీపుర్ ‌జిల్లాలలో రూ.1,045 కోట్లకు పైగా ఖర్చయ్యే రెండు 400 కేవీఒక 220 కేవీ ట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషన్‌లతో పాటు సంబంధిత విద్యుత్తు సరఫరా లైన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారువారణాసిలో చౌకాఘాట్‌లో 220 కేవీ ట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషన్గాజీపుర్‌లో 132 కేవీ ట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషన్‌లతోపాటు వారణాసి నగరంలో రూ.775 కోట్లకు పైచిలుకు వ్యయంతో  విద్యుత్తు పంపిణీ వ్యవస్థ విస్తరణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
భద్రతాసిబ్బందికి మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి పోలీస్ లైన్‌లో ట్రాన్సిట్ హాస్టల్పీఏసీ రాంనగర్ క్యాంపస్‌లో బ్యారక్స్‌ను ప్రధాని ప్రారంభించారుఅనేక పోలీస్ ఠాణాలలో కొత్త పరిపాన భవనాలకుపోలీస్ లైన్‌లో రెసిడెన్షియల్ హాస్టల్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
విద్యా ఫలాలు అందరికీ అందేటట్లు చూడాలన్న తన దృష్టికోణానికి అనుగుణంగా ప్రధానమంత్రి పిండ్‌రాలో ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలబర్‌కీ గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రభుత్వ కళాశాల, 356 గ్రామీణ గ్రంథాలయాలు, 100 ఆంగన్‌వాడీ కేంద్రాలు సహా అనేక పథకాలను ప్రారంభించారుస్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా 77 ప్రాథమిక పాఠశాల భవనాల నవీకరణ పనులతోపాటు వారణాసిలోని చోలాపుర్‌లో కస్తూర్బా గాంధీ పాఠశాలకు కొత్త భవనం నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారునగరంలో క్రీడా మౌలికసదుపాయాలను పెంచే క్రమంలోఉదయ ప్రతాప్ కళాశాలలో ఫ్లడ్‌లైట్లుసందర్శకుల గ్యాలరీతో సింథటిక్ హాకీ టర్ఫ్ నిర్మాణానికీశివ్‌పుర్‌లో  మినీ స్టేడియం నిర్మాణానికీ ఆయన శంకుస్థాపన చేశారు.
గంగానది వద్ద సామ్‌నే ఘాట్శాస్త్రి ఘాట్‌ల పునరభివృద్ధిజల్ జీవన్ మిషన్‌లో భాగంగా రూ.345 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చయ్యే 130 గ్రామీణ తాగునీటి పథకాలువారణాసిలో నగరపాలక వార్డుల్లో మెరుగుదల పనులువారణాసిలోనే వివిధ ప్రాంతాల్లో నేలను చదునుచేసే పనులతోపాటు ప్రతిమల ఏర్పాటు పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.
చేతివృత్తుల వారి కోసం ఎమ్ఎస్ఎమ్ఈ యూనిటీ మాల్మోహన్‌సరాయ్‌లో ట్రాన్స్‌పోర్ట్ నగర్ పథకంలో భాగంగా చేపట్టే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులుడబ్ల్యూటీపీ భేల్‌పుర్‌లో ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉండే సౌర విద్యుత్తు ప్లాంటు, 40 గ్రామ పంచాయతీలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులతోపాటు వారణాసి లో వివిధ పార్కుల సుందరీకరణ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు చేశారు.
తబలాపెయింటింగ్శీతల పానీయాలుతిరంగా బర్ఫీ సహా అనేక ఇతర స్థానిక వస్తువులతోపాటు ఉత్పాదనలకు జీఐ ధ్రువపత్రాలను ప్రధానమంత్రి ప్రదానం చేశారుబనాస్ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న వారికి రూ.105 కోట్లకు పైగా బోనస్‌ను కూడా ప్రధాని బదిలీ చేశారు.‌


(Release ID: 2120979) Visitor Counter : 30