ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
రూ.1332 కోట్లతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిమీ మేర రైల్వే మార్గం డబ్లింగ్ పనులను ఆమోదించిన కేంద్ర కేబినెట్
ప్రయాణాన్ని సులభతరం చేయటంతో పాటు రవాణా ఖర్చును, చమురు దిగుమతులను తగ్గించటమే కాకుండా కార్భన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి.. స్థిరమైన, సమర్థవంతమైన రైల్వే కార్యకలాపాలకు దోహదం
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 గ్రామాలు, 14 లక్షల జనాభాకు పెరగనున్న అనుసంధానం
ప్రతి రోజు 75 వేల మంది, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు 1.5 లక్షల మంది వచ్చే ప్రముఖ తిరుమల వేంకటేశ్వర ఆలయానికి నిలయమైన తిరుపతికి అనుసంధానం పెంచటమే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణం
ప్రాజెక్టు వల్ల సుమారు 35 లక్షల ప్రత్యక్ష పనిదినాలను సృష్టించటం ద్వారా ఉపాధి కల్పన
Posted On:
09 APR 2025 3:06PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సుమారు రూ.1332 కోట్లతో తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిమీల మేర రైల్వే మార్గం డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది.
రెండో లైను వల్ల సామర్థ్యం పెరిగి భారతీయ రైల్వే సేవల్లో విశ్వసనీయతను పెంచుతుంది. రెండు లైన్ల వల్ల ఈ మార్గంలో రైల్వే కార్యకలాపాల సులభతరం కానున్నాయి. అంతేకాకుండా రద్దీ కూడా తగ్గనుంది. దేశంలో రద్దీగా ఉండే మార్గాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ ప్రాజెక్టు అందించనుంది. ఈ ప్రాజెక్టు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారత దార్శనికతను అనుగుణంగా ఉంది. ఇది ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి ద్వారా ఈ ప్రాంత ప్రజలను "ఆత్మనిర్భర్"గా చేయనుంది. అంతేకాకుండా వారి ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
సమీకృత ప్రణాళిక ద్వారా సాధ్యమైన బహుళ-నమూనా అనుసంధానత కోసం పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో ఈ ప్రాజెక్టు ఉంది. ఇది ప్రజా రవాణాతోపాటు వస్తువులు, సేవల విషయంలో అంతరాయం లేని అనుసంధానతను అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మూడు జిల్లాల పరిధిలో ఉండే ఈ ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం ఉన్న భారతీయ రైల్వే నెట్‌వర్క్ సుమారు 113 కిలోమీటర్ల మేర పెరుగనుంది.
తిరుమల వేంకటేశ్వర ఆలయానికి అనుసంధానతో పాటు ఈ ప్రాజెక్టు శ్రీ కాళహస్తి శివాలయం, కాణిపాకం వినాయక ఆలయం, చంద్రగిరి కోట వంటి ఇతర ప్రముఖ ప్రదేశాలను కలుపుతుంది. ఈ రైలు మార్గం దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులు, పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 గ్రామాలు, 14 లక్షల జనాభాకు అనుసంధానత పెరుగుతుంది.
బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, ఇతర ఖనిజాలు మొదలైన సరకు రవాణాకు ఇది ఒక ముఖ్యమైన మార్గం. సామర్థ్యాన్ని పెంచే పనుల ఫలితంగా 4 ఎంటీపీఏ ( ఏడాదికి మిలియన్ టన్నుల్లో) అదనపు సరుకు రవాణా జరుగనుంది. రైల్వేలు పర్యావరణ అనుకూలమైనవి. దీనితో పాటు ఇంధన సమర్థవంతమైన రవాణా విధానం కావడం వల్ల, వాతావరణం పరంగా వివిధ లక్ష్యాలను సాధించడానికి, దేశ రవాణా ఖర్చును తగ్గించడానికి, చమురు దిగుమతిని (4 కోట్ల లీటర్లు) తగ్గించడానికి, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను (20 కోట్ల కిలోలు) తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది కోటి చెట్ల పెంపకానికి సమానం.
***
(Release ID: 2120532)
Visitor Counter : 79
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam