రాష్ట్రపతి సచివాలయం
శ్రీరామ నవమి సందర్భంగా భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
05 APR 2025 7:01PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి తన సందేశంలో ఇలా పేర్కొన్నారు.. “రామ నవమి శుభ సందర్భంగా, దేశ పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ పవిత్ర పండుగను మర్యాద పురుషోత్తమ భగవాన్ శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటాం. భగవాన్ శ్రీరాముని జీవిత ప్రయాణం సత్యం, ధర్మం, నీతి మార్గాన్ని అనుసరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ పండుగ మానవాళికి అంకితభావం, నిబద్ధతతో సేవ చేయాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ పవిత్ర పండుగ ప్రజలను త్యాగం, నిస్వార్థ ప్రేమ, మాటకు కట్టుబడి ఉండేందుకు ప్రేరణనిస్తుంది.
ఈ పవిత్ర సందర్భంలో, భగవాన్ శ్రీరాముని ఆదర్శాల స్ఫూర్తిగా మనం మొత్తం మానవాళి శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం”.
రాష్ట్రపతి సందేశాన్ని చూడటానికి దయచేసి ఇక్కడ క్లిక్
చేయండి-
(Release ID: 2119737)
Visitor Counter : 20