ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రామనవమి నాడు తమిళనాడు వెళుతున్న ప్రధాని

రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ రైలు వంతెనకు ప్రారంభోత్సవం

* తమిళనాడులో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, జాతికి అంకితం: వీటి విలువ రూ. 8,300 కోట్లు
* రామేశ్వరం - తాంబరం (చెన్నై) నూతన రైలు సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని

Posted On: 04 APR 2025 2:35PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఏప్రిల్ 6న తమిళనాడులో పర్యటిస్తారురామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారత్‌లో తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ రైలు వంతెనను ప్రారంభిస్తారుఅనంతరం రైలునౌక ప్రయాణిస్తున్న విధానాన్నీవంతెన పని చేస్తున్న విధానాన్నీ గమనిస్తారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారుతమిళనాడులో రోడ్డురైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిఇప్పటికే పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేస్తారువీటి విలువ సుమారుగా రూ.8,300 కోట్లుఅనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

నూతనంగా నిర్మించిన పంబన్ రైలు వంతెనను ప్రారంభిస్తారుఈ సందర్భంగా రామేశ్వరం-తాంబరం (చెన్నైరైలు సర్వీసును కూడా ప్రారంభిస్తారుఈ రైలు వంతెనకు సాంస్కృతిక ప్రాధాన్యముందిరామాయణం ప్రకారంరామసేతు నిర్మాణం రామేశ్వరానికి సమీపంలోని ధనుష్కోడి వద్దే మొదలుపెట్టారు.

రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలిపే ఈ వంతెన భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెబుతుందిరూ. 550 కోట్ల పైగా వ్యయంతో దీన్ని నిర్మించారుఈ వంతెన సుమారుగా 99 స్పాన్లు, 72.5 మీటర్ల పొడవున్న వర్టికల్ లిఫ్టుతో 2.08 కి.మీపొడవు ఉంటుందిఈ లిఫ్టు 17 మీటర్ల ఎత్తు వరకు పెంచవచ్చుతద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా రైలునౌకా కార్యకలాపాలు సజావుగా జరుగుతాయిపూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీలుహై గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్వెల్డింగ్ చేసిన జాయింట్లతో ఈ వంతెన నిర్మించారుఇది తక్కువ నిర్వహణ వ్యయంతో ఎక్కువ కాలం మన్నుతుందిభవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డబుల్ రైలు ట్రాకులు ఏర్పాటు చేసేలా దీన్ని నిర్మించారుకఠినమైన సముద్ర వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ రైలు వంతెన తుప్పు పట్టకుండా పాలీసిలోక్సేన్ పూత వేశారు.

తమిళనాడులో నిర్మిస్తున్న రైలురోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారుపనులు పూర్తయిన వాటిని జాతికి అంకితమిస్తారువీటి విలువ రూ.8,300 కోట్లకు పైగా ఉంటుందిఎన్‌హెచ్-40లో వలజాపేట-రాణీపేట సెక్షన్‌లో 28 కి.మీ మేర నాలుగు వరుసల్లో విస్తరించనున్న రహదారికి శంకుస్థాపన చేస్తారుఎన్‌హెచ్-332లో విలుప్పురం-పుదుచ్చేరి సెక్షన్లో 29 కి.మీ.ల నాలుగు లేన్ల రహదారిని,  ఎన్‌హెచ్ -32లో 57 కి.మీ.ల పూండియన్‌ కుప్పం-సత్తనాతపురం విభాగాన్నిఎన్‌హెచ్ - 36లో 48 కి.మీ చోళపురం-తంజావూర్ రహదారుల్ని జాతికి అంకితం చేస్తారుఈ జాతీయ రహదారులు ఆధ్యాత్మిక కేంద్రాలుపర్యాటక ప్రాంతాలను కలుపుతాయినగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయివైద్య కళాశాలలుఆసుపత్రులుపోర్టులకు వేగంగా చేరుకునేలా చేస్తాయిఅలాగే వ్యవసాయ ఉత్పత్తులను దగ్గరలోని మార్కెట్లకు సులభంగా రవాణా చేయడంలో రైతులకు దోహదపడతాయిస్థానికంగా నిర్వహించే తోళ్లుచిన్న స్థాయి పరిశ్రమల ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి.

 

***


(Release ID: 2119118) Visitor Counter : 48