ప్రధాన మంత్రి కార్యాలయం
పాళీ భాషలో త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయిలాండ్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ
प्रविष्टि तिथि:
03 APR 2025 5:43PM by PIB Hyderabad
పాళీలో ఉన్న త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయ్ లాండ్ ప్రధానమంత్రి శ్రీమతి పేతోంగ్‌తార్న్ షినవత్రకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పాళీ అందమైన భాష అని, అది బుద్ధ భగవానుడి బోధనల సారాంశాన్ని కలిగివుందని ఆయన ప్రశంసించారు.
“ఒక విశేషమైన అనుభూతి! పాళీ భాషలో త్రిపీటకాల ప్రతిని నాకు అందించినందుకు థాయిలాండ్ ప్రధానమంత్రి పేతోంగ్‌తార్న్ షినవత్రకు హృదయపూర్వక కృతజ్ఞతలు. పాళీ నిజంగా అందమైన భాష. బుద్ధ భగవానుని ఉపదేశాల సారాన్ని తనలో కలిగి ఉంది. మీ అందరికీ తెలిసిందే. గత సంవత్సరం మా ప్రభుత్వం పాళీ భాషకు ప్రాచీన భాష హోదాగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ నిర్ణయాన్ని అభినందించారు. ఇది ఈ భాషపై పరిశోధనకు, అధ్యయనానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు.
@ingshin”
(रिलीज़ आईडी: 2118645)
आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam