ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

థాయ్ లాండ్ , శ్రీలంక పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన

Posted On: 03 APR 2025 6:47AM by PIB Hyderabad

థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేతోంగ్‌తార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు ఆ దేశంలో అధికారిక పర్యటనతో పాటు ఆరో బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొనేందుకు ఈ రోజు బయలుదేరుతున్నాను.

గడచిన దశాబ్దంగా బంగళాఖాత తీర ప్రాంతంలో అభివృద్ధి, అనుసంధానం, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించే ముఖ్యమైన వేదికగా బిమ్స్‌టెక్ ఆవిర్భవించింది. భారత్‌లోని ఈశాన్య భూభాగం బిమ్స్‌టెక్ ప్రధాన కేంద్రంగా ఉంది. మన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు బిమ్స్‌టెక్ సభ్యదేశాల నాయకులతో సమావేశమవడానికి నేను ఎదురుచూస్తున్నాను.

నా అధికారిక పర్యటనలో మన శతాబ్ధాల నాటి చారిత్రక సంబంధాలను బలోపేతం చేసేలా థాయ్‌లాండ్ ప్రధానమంత్రి షినవత్రతో పాటు ఆ దేశ నాయకులతో చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ చర్చలు రెండు దేశాల ఉమ్మడి సంస్కృతి, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక ఆలోచనలనే బలమైన పునాదుల ఆధారంగా జరుగుతాయి.

ఏప్రిల్ 4 నుంచి 6 వరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌లాండ్ నుంచి శ్రీలంక చేరుకుంటాను. గతేడాది డిసెంబర్‌లో భారత్‌లో శ్రీలంక అధ్యక్షుడు దిశనాయక విజయవంతంగా సాగించిన పర్యటన అనంతరం ఇది జరుగుతోంది. ‘‘ఉమ్మడి భవిష్యత్తు కోసం భాగస్వామ్యాలకు ప్రోత్సాహం’’ అనే సంయుక్త లక్ష్య ప్రగతిని సమీక్షిస్తాం. అలాగే మా ఉమ్మడి ఆశయాలను సాధించడానికి అవసరమైన సూచనలు చేస్తాం.

గతమనే పునాదుల ఆధారంగా సాగిస్తున్న ఈ పర్యటనలు మన ప్రజలకు, దేశానికి ప్రయోజనం చేకూర్చేలా సన్నిహిత సంబంధాలను మెరుగుపరుస్తాయని విశ్వసిస్తున్నాను.

 

***


(Release ID: 2118215) Visitor Counter : 11