ప్రధాన మంత్రి కార్యాలయం
థాయ్ రామాయణం ‘రామకియేన్’ మనోహర ప్రదర్శనను చూసిన ప్రధానమంత్రి
Posted On:
03 APR 2025 1:02PM by PIB Hyderabad
భారతదేశానికి, థాయిలాండుకు మధ్య ప్రగాఢమైన సాంస్కృతిక, నాగరికత బంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆయన ఈ రోజు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో థాయి రామాయణం ‘రామకియేన్’ మనోహర ప్రదర్శనను వీక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని:
“సాటి లేని సాంస్కృతిక బంధమిది..
మనోహరమైన థాయ్ రామాయణం ‘రామకియేన్’ ప్రదర్శనను చూశాను. భారతదేశానికి, థాయిలాండుకు మధ్య ఉన్న ఉమ్మడి సాంస్కృతిక, నాగరికత బంధాలను సుందరంగా ప్రతిబింబించిన ఈ ప్రదర్శన చాలా విశిష్ట అనుభూతిని పంచింది.
రామాయణం నిజంగానే ఆసియాలోని అనేక ప్రాంతాల్లో హృదయాలను, సంప్రదాయాలను కలుపుతూవస్తోంది.’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2118211)
Visitor Counter : 20
Read this release in:
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam