ప్రధాన మంత్రి కార్యాలయం
షహీద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్‌గురులతోపాటు సుఖ్‌దేవ్‌కు ప్రధానమంత్రి నివాళులు
Posted On:
23 MAR 2025 9:04AM by PIB Hyderabad
షహీద్ దివస్ (అమరవీరుల దినోత్సవం) ఈ రోజు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర మహాయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశం కోసం వారు చేసిన సర్వోన్నత త్యాగాన్ని ఆయన స్మరించుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూ ఆ సందేశంలో..
‘‘భగత్ సింగ్, రాజ్‌గురులతోపాటు సుఖ్‌దేవ్ చేసిన అత్యంత గొప్ప త్యాగాన్ని దేశం ఈ రోజు స్మరించుకుంటోంది. స్వాతంత్య్రంతోపాటు న్యాయం కోసం వారు అత్యంత సాహసవంతంగా చేసిన కృషి మనకందరికీ ఎప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(Release ID: 2114220)
Visitor Counter : 29
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam