ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహా కుంభమేళాపై లోక్ సభలో ప్రధాని ప్రసంగం

Posted On: 18 MAR 2025 1:05PM by PIB Hyderabad

అధ్యక్షా,

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాపై నేనిప్పుడు మాట్లాడబోతున్నానుఈ గౌరవ సభ ద్వారా లక్షలాది మంది దేశ ప్రజలకు నమస్కరిస్తున్నాను. వారి సహకారంతోనే మహా కుంభమేళా విజయవంతమైందిఈ బృహత్ కార్యక్రమం విజయవంతం కావడంలో అనేక మంది వ్యక్తులు కీలక పాత్ర పోషించారుప్రభుత్వంసమాజంప్రత్యేకంగా ఈ కార్యక్రమానికే అంకితమై సేవలందించిన కార్మికులందరికీ నా అభినందనలుదేశ వ్యాప్తంగా ఉన్న భక్తులకుఉత్తరప్రదేశ్ ప్రజలకుప్రత్యేకించి ప్రయాగరాజ్ వాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అధ్యక్షా,

అసాధారణ కృషి వల్లే పవిత్ర గంగానది భూమికి దిగివచ్చిందని మనందరికీ తెలుసుఈ మహా కుంభమేళాను వైభవోపేతంగా నిర్వహించడంలోనూ అలాంటి విశేషమైన కృషినే మనం చూశాంఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ‘సబ్ కా ప్రయాస్’ ఎంత ముఖ్యమైనదో నేను ప్రముఖం ప్రస్తావించానుమహా కుంభమేళా ద్వారా భారత్ తన విశాలతను ప్రపంచానికి చాటిందిఇది ‘సబ్ కా ప్రయాస్’ నిజమైన ఆదర్శంఈ మహా కుంభమేళా ప్రజల పండుగఅశేష ప్రజానీకపు భక్తినిబద్ధతలే దీనికి స్ఫూర్తి.

అధ్యక్షా,

మహా కుంభమేళాలో మన జాతీయ చేతన అద్భుత స్థాయిలో మేల్కొన్నదిఈ జాతీయ చైతన్యమే మన దేశాన్ని కొత్త సంకల్పం దిశగా నడిపించివాటిని సాకారం చేసుకునేలా మనకు ప్రేరణ కలిగిస్తుందిమన సమష్టి శక్తిపై కొంతమందికి ఉన్న సందేహాలుఆందోళనలకు కూడా మహా కుంభమేళా తగిన సమాధానాన్నిచ్చింది.

అధ్యక్షా,

రాబోయే వెయ్యేళ్ల కోసం దేశం ఎలా స్వయంసన్నద్ధత సాధిస్తోందో గతేడాది అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా వీక్షించాంమరో ఏడాదిలోనే మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించడం ఈ విశ్వాసాన్ని మరింతగా బలోపేతం చేసింది సమష్టి చైతన్యం అపారమైన దేశ సమర్థతను ప్రతిబింబిస్తుందిభవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే మహత్తర ఘటనలు చరిత్ర నిండా ఉన్నాయిసరికొత్తగా దిశానిర్దేశం చేసినప్రజానీకాన్ని మేల్కొల్పిన అలాంటి సంఘటనలు మన దేశంలోనూ ఉన్నాయిభక్తి ఉద్యమ సమయంలో ఆధ్యాత్మిక జాగృతి దేశవ్యాప్తమయ్యిందివందేళ్ల కన్నా ముందే స్వామి వివేకానందుడు షికాగోలో చేసిన ప్రసంగంలో భారత ఆధ్యాత్మిక చైతన్యం ప్రతిధ్వనించిందిభారతీయుల్లో దృఢతరమైన ఆత్మగౌరవ భావాలను పెంపొందించిందిఅదే విధంగా మన స్వాతంత్ర్య పోరాటంలోనూ అటువంటి చారిత్రక ఘట్టాలు అనేకం ఉన్నాయి – 1857 తిరుగుబాటువీర భగత్ సింగ్ త్యాగంనేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘ఢిల్లీ చలో’ పిలుపుమహాత్మా గాంధీ దండి యాత్ర వంటి అనేక ఉదాహరణలున్నాయిఈ ఘట్టాలన్నీ దేశంలో స్ఫూర్తిని రగిలించిస్వాతంత్ర్యానికి మార్గం సుగమం చేశాయిప్రయాగరాజ్ మహా కుంభమేళాను అటువంటి మరో మహత్తర ఘట్టంగా నేను భావిస్తున్నానుదేశ జాగరూకతా స్ఫూర్తి అందులో ప్రతిబింబించింది.

 

అధ్యక్షా,

భారత్ లో దాదాపు నెలన్నర రోజుల పాటు మహా కుంభమేళా ఉత్సాహాన్నిస్ఫూర్తిని మనం ఆస్వాదించాంప్రగాఢమైన విశ్వాసంతో లక్షలాదిగా భక్తులు ఒక్క చోట చేరారువ్యయప్రయాసలనుకష్టనష్టాలను పట్టించుకోలేదుఈ అచంచలమైన భక్తి మనకున్న గొప్ప బలాలలో ఒకటిఅయితేఈ ఆనందోత్సాహాలు ఒక్క భారత్ కే పరిమితం కాలేదుగతవారం నేను మారిషస్ కు వెళ్లానుమహా కుంభమేళా సమయంలో ప్రయాగరాజ్‌ త్రివేణీ సంగమం నుంచి సేకరించిన పవిత్ర గంగా జలాన్ని నేను అక్కడికి తీసుకెళ్లానుమారిషస్‌ లోని గంగా సరస్సు వద్ద ఈ పవిత్ర జలాన్ని సమర్పించిన సమయంలో భక్తివిశ్వాసంఉత్సాహం నిండిన అద్భుతమైన వాతావరణం అక్కడ ఏర్పడింది భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, విలువలను ప్రపంచం అందిపుచ్చుకునిఅత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తోందని దీని ద్వారా మరోసారి స్పష్టమైంది.

అధ్యక్షా,

మన సాంస్కృతిక విలువలు ఒక తరం నుంచి మరో తరానికి ఎప్పటికప్పుడు ప్రసరిస్తున్న తీరును కూడా మనం గమనించవచ్చునేటి మన యువతను చూడండి — మహా కుంభమేళాఇతర సాంప్రదాయక పండుగలతో వారు ఎంతలా తాదాత్మ్యం చెందుతున్నారోభారత యువతరం దేశ వారసత్వంవిశ్వాసంసంస్కృతులను సగర్వంగాభక్తిశ్రద్ధలతో అందిపుచ్చుకుంటోంది.

అధ్యక్షా,

సమాజం తన వారసత్వాన్ని సగర్వంగా స్వీకరిస్తే.. మహా కుంభమేళాలో మనం చూసినట్టు వైభవోపేతమైన, స్ఫూర్తిదాయకమైన ఘట్టాలు ఆవిష్కృతమవుతాయిమన సౌబ్రాతృత్వ భావాన్ని ఇది బలోపేతం చేసిఒక దేశంగా గొప్ప లక్ష్యాలను మనం సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందిమన సంప్రదాయాలువిశ్వాసంవారసత్వాలతో విశేషంగా అనుసంధానమవడం నేడు భారత్ కు అమూల్యమైన ఆస్తి.

అధ్యక్షా,

ఈ మహా కుంభమేళా మనకెన్నో విలువైన పాఠాలు నేర్పిందిముఖ్యంగా ఐక్యతామృతాన్ని మనకు అందించిందిదేశంలోని ప్రతి ప్రాంతమూ, నలుమూలల నుంచీ ప్రజలు ప్రయాగరాజ్ లో ఒక్కచోటికి వచ్చారువ్యక్తిగత అహాలను పక్కనపెట్టి నా’ బదులు మన’ అన్న సమష్టి స్ఫూర్తిని ప్రదర్శించారువివిధ రాష్ట్రాల ప్రజలు పవిత్ర త్రివేణీ సంగమంలో భాగమయ్యారు.వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది జాతీయవాద స్ఫూర్తిని బలోపేతం చేస్తే.. మన దేశ ఐక్యత మరింత బలపడుతుందివివిధ భాషల ప్రజలు సంగమ తీరాన ‘హర్ హర్ గంగే’ అని నినదించిన వేళ.. ‘ఏక్ భారత్శ్రేష్ఠ భారత్’ భావన మరింత స్పష్టంగా వ్యక్తమైఐక్యతను బలోపేతం చేస్తుందిపేదా గొప్పా అనే తేడా లేదని మహా కుంభమేళా నిరూపించింది— అపారమైన భారత శక్తిని ఇది ప్రతిబింబించిందిబలమైన ఐక్యతా భావం మనకు స్వభావసిద్ధమైనదని ఇది మరోసారి స్పష్టం చేసిందిమన ఐక్యతా శక్తి చాలా గొప్పదిమనల్ని విభజించేందుకు ప్రయత్నించే కుయుక్తులన్నింటినీ అది అధిగమించగలదుఈ అచంచలమైన చైతన్య స్ఫూర్తే ప్రతీ భారతీయుడికీ రక్షప్రపంచం విచ్ఛిన్నతల ముప్పును ఎదుర్కొంటున్న వేళ.. సోదర భావాన్ని ప్రకటించేలా సాగిన ఈ గొప్ప వేడుక మనకెంతో బలాన్నిస్తుందిభిన్నత్వంలో ఏకత్వమే ఎల్లప్పుడూ భారత్ లక్షణం – ఎప్పుడూ దానినే మనం విశ్వసించాంఆస్వాదించాంప్రయాగరాజ్ మహా కుంభమేళాలో అత్యంత అద్భుతమైన స్థాయిలో దాన్ని మనం గమనించాంభిన్నత్వంలో ఏకత్వమనే ఈ విశిష్ట వారసత్వాన్ని పెంపొందించడంబలోపేతం చేయడం మన బాధ్యత.

అధ్యక్షా,

మహా కుంభమేళా అనేక విధాలుగా మనకు ప్రేరణను అందించిందిఎన్నో చిన్నా పెద్దా నదులకు మన దేశం నిలయంవాటిలో కొన్నిప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయిమహా కుంభమేళా స్ఫూర్తితో నదీ ఉత్సవాల సంప్రదాయాన్ని మరింత విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందిఈ కార్యక్రమాలు నీటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడంలోనదీ స్వచ్ఛతను ప్రోత్సహించడంలో, నదుల సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తించడంలో ఇప్పటి తరానికి దోహదపడతాయి.

అధ్యక్షా,

మహా కుంభమేళా నుంచి పొందిన జ్ఞాన సుధ మన దేశ సంకల్పాలను సాకారం చేసుకునేందుకు బలమైన పునాదిగా ఉపయోగపడుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నానుమరోసారిమహా కుంభమేళా నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుదేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ అభివాదాలు.ఈ గౌరవ సభ తరపున వారందరికీ నా శుభాకాంక్షలు.

 

గమనికప్రధాని ప్రసంగానికి ఇది ఇంచుమించుగా చేసిన అనువాదంమౌలిక ప్రసంగం హిందీలో ఉంది.  

***

 


(Release ID: 2112643) Visitor Counter : 7