ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ రమాకాంత్ రథ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
16 MAR 2025 2:53PM by PIB Hyderabad
ప్రముఖ కవి, పండితుడు శ్రీ రమాకాంత్ రథ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. శ్రీ రమాకాంత్ రథ్ జీ రచనలు, ప్రత్యేకించి ఆయన కవితలు సమాజంలో అన్ని వర్గాలకు చెందిన వారి ఆదరణను పొందాయని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘శ్రీ రమాకాంత్ రథ్ జీ ఒక ప్రభావవంతమైన పరిపాలకుడిగా, పండితునిగా తనకంటూ ఒక భిన్నమైన గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆయన రచనలు, ప్రత్యేకించి కవితలు, సమాజంలో అన్ని వర్గాలకు చెందిన వారి ఆదరణను పొందాయి. ఆయన ఇక లేరని తెలిసి బాధ కలిగింది. ఈ దు:ఖ ఘడియలో ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)’’ అని పేర్కొంది.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2111750)
आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada