సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబయిలో మే 1 నుంచి జరగనున్న ప్రపంచ దృశ్య, శ్రవణ, వినోద సదస్సు నేపథ్యంలో అంతర్జాతీయ సమాజాన్ని ఆహ్వానిస్తున్న భారత ప్రభుత్వం.. కీలక అంతర్జాతీయ మీడియా సమావేశంలో విస్తృతంగా పాల్గొనాలని అభ్యర్థన

విస్తృతమవుతున్న మీడియా, వినోద రంగంలో సమన్వయ విధానం కోసం అంతర్జాతీయ వేదికగా వేవ్స్ ప్రయోజనాలను 100 మందికి పైగా రాయబారులు, హైకమిషనర్లకు వివరించనున్న ఆతిథ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్. జయశంకర్, శ్రీ అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్..

న్యూఢిల్లీలో మార్చి 13న కార్యక్రమం

వేవ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా సమన్వయాన్ని పెంపొందించడమే లక్ష్యం.. మీడియా, వినోద రంగాల్లో అన్ని దేశాలకు గల అవకాశాలు, ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం ఈ సమవేశంలో ముఖ్య ఎజెండా

Posted On: 12 MAR 2025 4:09PM by PIB Hyderabad

ప్రపంచ దృశ్యశ్రవణవినోద సదస్సు (వేవ్స్నేపథ్యంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని ఆహ్వానిస్తోందిమార్చి 13న న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో సాయంత్రం 4.30 గంటలకు ఈ మేరకు సమావేశాన్ని నిర్వహించనుందిమే 2న ముంబయిలో ప్రారంభం కానున్న మొదటి వేవ్స్ పై ప్రకటన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న సమాచారప్రసార మంత్రిత్వ శాఖ.. ఈ కీలకమైన అంతర్జాతీయ మీడియా సమావేశంలో పాల్గొనాల్సిందిగా వివిధ ప్రభుత్వాలను అభ్యర్థిస్తోందిమీడియావినోద రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఇదొక కీలకమైన ముందడుగు.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్జయశంకర్కేంద్ర సమాచారప్రసారరైల్వేఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్కేంద్ర సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ తోపాటు ఆతిథ్య రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశంలో పాల్గొంటారుశరవేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియావినోద రంగంలో ఏకీకృత అంతర్జాతీయ వేదికగా వేవ్స్ సమర్థంగా నిలిచే తీరును వారు వివరిస్తారుఈ కార్యక్రమానికి 100 మందికి పైగా రాయబారులుహై కమిషనర్లు హాజరవుతుండగా.. మీడియావినోద రంగంలో సమన్వయ విధానం కోసం ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు.  

ప్రపంచ మీడియా రంగంతో ముఖాముఖి

 2025 మే న ముంబయి‌లో జరగనున్న ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్మెంట్ సదస్సు 2025‌లో భాగంగా నిర్వహించనున్న ప్రపంచ మీడియా రంగ సమావేశం.. అంతర్జాతీయ సహకారంసాంకేతిక ఆవిష్కరణలునైతిక పద్ధతులపై దృష్టి సారించనుంది.  ఆడియో-విజువల్ఎంటర్‌టైన్మెంట్‌ రంగాల భవిష్యత్తును రూపొందించే లక్ష్యంతో నిర్మాణాత్మకడైనమిక్ సంభాషణలో పాల్గొనడానికి ప్రపంచ దేశాల నాయకులువిధానకర్తలుపరిశ్రమ భాగస్వాములుమీడియా నిపుణులుకళాకారులను ఏకతాటిపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చర్చించే కీలకాంశాలు

మీడియావినోద రంగం న్యాయబద్ధమైనపారదర్శకమైన వృద్ధి పొందేలా చూసేందుకు దేశాల మధ్య బహిరంగ చర్చలుసహకారాన్ని ప్రోత్సహించడం ఈ చర్చల ప్రధాన లక్ష్యంవివిధ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే వ్యూహాలపై చర్చలు దృష్టి సారించనున్నాయిసాధారణ సవాళ్ళను పరిష్కరించేందుకుఅవకాశాలను అందిపుచ్చుకునేందుకు జ్ఞానాన్ని పంచుకోవటంభాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకునేందుుకు ఒక వేదికగా పనిచేయనున్నాయిమీడియావినోద రంగంలో బహిరంగనిష్పాక్షిక వాణిజ్య పద్ధతుల ప్రాముఖ్యతను కూడా ఈ చర్చల ప్రధానంగా దృష్టి సారించనున్నాయిభాగస్వాములందరికి వనరులు సమానంగా అందుబాటులో ఉండేలావృద్ధి సాధించేలా చూసుకోనున్నాయిగ్లోబల్ సామరస్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో మీడియావినోద రంగంలో అన్ని దేశాలకు ఉన్న సమస్యలుఅవకాశాలపై చర్చ ఈ ప్రపంచ మీడియా రంగ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉంది.
వేవ్స్ 2025

వేవ్స్ అనేది పూర్తి మీడియావినోద రంగాన్ని (ఎం&రంగాన్ని ఏకతాటిపైకి తెచ్చే ఒక ప్రధాన ప్రపంచ స్థాయి కార్యక్రమంఇది 2025 మే నుంచి వరకు మహారాష్ట్రలోని ముంబయి‌లో జరగనుందిఇది భారత ఎం-ఈ పరిశ్రమలను ప్రపంచ మార్కెట్‌తోప్రపంచ మార్కెట్‌ను దేశీయ పరిశ్రమలతో అనుసంధానించటం..వృద్ధిసహకారంఆవిష్కరణలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుందిమీడియావినోద పరిశ్రమకు ఒక ప్రపంచ స్థాయి సదస్సుగా మారాలని వేవ్స్ లక్ష్యంగా పెట్టుకుందికంటెంట్ క్రియేషన్మేధో సంపత్తిసాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా తన స్థానాన్ని పెంచుకుంటూ భారత్‌ సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ వేదిక సిద్ధంగా ఉందిప్రసారాలుపత్రికా రంగంటీవీరేడియోసినిమాయానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్సౌండ్ అండ్ మ్యూజిక్ప్రకటనలుడిజిటల్ మీడియాసామాజిక మాధ్యమాలుజనరేటివ్ ఏఐఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ‌(ఎక్స్‌ఆర్వంటి రంగాలపై ఈ సదస్సు దృష్టి సారించనుంది.
ఈ విజన్ ఆధారంగా సహకారంసృజనాత్మకతను ప్రోత్సహించడానికి అనేక డైనమిక్ ప్లాట్‌ఫామ్‌లను వేవ్స్ 2025 కలిగి ఉందివేవ్స్ బజార్ వ్యాపార భాగస్వామ్యాలుకంటెంట్ సేకరణకు ఒక మార్కెట్‌ను అందించనుందిఏడాది పొడవునా ప్రపంచ స్థాయి కంటెంట్ వాణిజ్యం కోసం మొట్టమొదటి ఈ-బజార్‌ను కూడా ప్రారంభించనున్నారుఆవిష్కరణనిధుల సమకూర్చుకోవటాన్ని ప్రోత్సహించడానికి లైవ్ పిచింగ్ సెషన్ల ద్వారా ఎం అండ్ ఈ అంకురాలను పెట్టుబడిదారులుమెంటార్లతో వేవ్-ఎక్స్‌లేటర్ అనుసంధానిస్తుందిక్రియేటోస్పియర్ మాస్టర్ క్లాస్‌లువర్క్ షాప్‌లుగేమింగ్ ఎరీనా లాంటి అద్భుతమైన అనుభవాలను వేవ్స్ అందించనుందివేవ్స్ సీఐసీ అవార్డులతో ముగిసే క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్‌ల గ్రాండ్ ఫైనళ్లను కూడా కొత్త అనుభూతిని ఇవ్వనుందిఈ కార్యక్రమాలు వేవ్స్ 2025‌ను ప్రపంచ ఎం-ఈ పరిశ్రమకు ఏకీకృతసమన్వయ విధానంలో నడిపించే విషయంలో భారీ మార్పులు తీసుకొచ్చే వేదికగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

 

***


(Release ID: 2111137) Visitor Counter : 36