ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలకు తన సామాజిక మాధ్యమాల బాధ్యతను ఇచ్చిన ప్రధాని

Posted On: 08 MAR 2025 11:26AM by PIB Hyderabad

మహిళా శక్తికివిజయానికి స్ఫూర్తిదాయకంగా సామాజిక మాధ్యమాల్లో తన ఖాతాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేస్తోన్న మహిళలకు అప్పగించారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ కథలనులోతైన పరిజ్ఞానాన్ని ప్రధాని సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి సగర్వంగా పంచుకుంటారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఖాతా నుంచి మహిళలు ఈ విధంగా పోస్ట్ చేశారు.
“ 
అంతరిక్ష సాంకేతికతఅణు సాంకేతికతమహిళా సాధికారత..

మా పేరు ఎలినా మిశ్రా -అణు శాస్త్రవేత్తశిల్వి సోనీ -అంతరిక్ష శాస్త్రవేత్తమహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ప్రధాని ఖాతాలకు సారథ్యం వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది.
భారత్ ‌శాస్త్ర సాంకేతికతకు అత్యంత అనుకూలమైన ప్రాంతంఅందువల్ల మరింత మంది మహిళలు ఇటువైపు రావాలని మేం పిలుపునిస్తున్నాంఇదే మా సందేశం.``

 

***


(Release ID: 2109338) Visitor Counter : 47