ప్రధాన మంత్రి కార్యాలయం
బెల్జియమ్ యువరాణి ఆస్ట్రిడ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
• మూడు వందల మంది సభ్యుల ప్రతినిధి వర్గంతో భారత్‌కు వచ్చిన యువరాణి ఏస్ట్రిడ్ చొరవను ప్రశంసించిన ప్రధాని
• భారత్‌తో బెల్జియమ్ రాజకుటుంబానికి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొన్న ప్రధానమంత్రి
• వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, నవకల్పనలు, రక్షణ, వ్యవసాయం, లైఫ్ సైన్సెస్, అంతరిక్షం, నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం సహా అనేక రంగాలలో పరస్పరం లాభసాటి కాగల కొత్త భాగస్వామ్యాన్ని రెండు దేశాలూ ఏర్పరుచుకోవాలన్న నిబద్ధతను చాటిన ఇద్దరు నేతలు
Posted On:
04 MAR 2025 9:58PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బెల్జియమ్ యువరాణి ఆస్ట్రిడ్‌తో ఈ రోజు సమావేశమయ్యారు. ఆమె ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్‌లో పర్యటిస్తున్న ఒక ఉన్నత స్థాయి బెల్జియమ్ ఎకనామిక్ మిషన్‌కు సారథ్యం వహిస్తున్నారు.
భారతదేశం తరఫున యువరాణి ఆస్ట్రిడ్‌ను ప్రధాని సాదరంగా ఆహ్వానించారు. వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, వ్యాపార ప్రముఖులు సహా 300 మందితో కూడిన ప్రతినిధి వర్గంతో భారత్ ను సందర్శిస్తున్నందుకు ఆయన ప్రశంసించారు.
ఆర్థిక సంబంధాల విషయమై… యువరాణి ఆస్ట్రిడ్ భారత్‌కు రావడం ఇది రెండోసారి. ప్రగతిపథంలో దూసుకుపోతున్న ఈ రెండు దేశాల మధ్య దృఢతర ఆర్థిక సంబంధాలు నెలకొనడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఈ పర్యటన సూచిస్తోంది.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, యువరాణి ఆస్ట్రిడ్ అనేక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ, నవకల్పనలు, కాలుష్యానికి తావు ఉండని తరహా ఇంధనం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ రంగాలతోపాటు, నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం, ఇరు దేశాలూ తమ తమ విద్యారంగ ప్రముఖుల పర్యటనలకు ఏర్పాట్లు చేయాలనే అంశం, సాంస్కృతిక సంబంధాలతోపాటు ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర స్నేహ సంబంధాలు వర్ధిల్లేటట్లు చూసుకోవడం వంటి అనేక విషయాలు ఈ చర్చలలో చోటు చేసుకొన్నాయి.
కొత్తగా తెరమీదకు వస్తున్న, ముఖ్యమైన రంగాలలో సహకారాన్ని అందించుకోవడానికి ఉన్న అవకాశాలను గుర్తించడానికి కలిసి పనిచేయాలని ఇరుపక్షాలూ అంగీకరించాయి. ఇది ఆర్థిక దృఢత్వానికీ, నవకల్పనలకూ అండగా నిలిచే వృద్ధికి ఊతాన్నివ్వడంతోపాటు రెండు దేశాల ప్రజలకూ ప్రయోజనకరంగా ఉండే ద్వైపాక్షిక సహకారాన్ని కూడా విస్తృతం చేస్తుందన్న అంచనా ఉంది.
***
(Release ID: 2108327)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam