సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) 56వ స్నాతకోత్సవం రేపు (2025 మార్చి 4న); పాల్గొననున్న కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్
* న్యూ ఢిల్లీతోపాటు 5 ప్రాంతీయ కేంపస్‌ల విద్యార్థులు 478 మందికి డిప్లొమాలు, శ్రేష్ఠత్వ పురస్కారాల ప్రదానం
Posted On:
03 MAR 2025 12:34PM by PIB Hyderabad
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) 56వ స్నాతకోత్సవం రేపు. అంటే మార్చి 4న. ఈ కార్యక్రమాన్ని ఐఐఎంసీ న్యూ ఢిల్లీలోని మహాత్మా గాంధీ మంచ్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఐఎంసీ చాన్స్‌లర్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి; కేంద్ర రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ రానున్నారు.
స్నాతకోత్సవంలో 2023-24 బ్యాచ్ విద్యార్థులకు డిప్లొమాలు, శ్రేష్ఠత్వ పురస్కారాలు ప్రదానం చేస్తారు
స్నాతకోత్సవం సందర్భంగా 2023-24 బ్యాచ్‌లో 9 కోర్సులకు చెందిన 478 మంది విద్యార్థులకు వారు సాధించిన విజయాలకు గాను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికెట్లను ఇవ్వనున్నారు. ఐఐఎంసీ న్యూ ఢిల్లీ విద్యార్థులతోపాటు ఢెంకనాల్, ఐజోల్, అమరావతి, కోట్టాయమ్, జమ్మూలలోని ఇదే ఇనిస్టిట్యూట్ ప్రాంతీయ కేంపసులకు చెందిన విద్యార్థులకు ఈ కార్యక్రమంలో డిప్లొమాలను ప్రదానం చేస్తారు. విశేష ప్రతిభ కనబరచిన మరో 36 మంది విద్యార్థులకు కూడా వివిధ పతకాలను, నగదు బహుమతులను ఇచ్చి సత్కరించనున్నారు.
విశిష్ట అధ్యాపకులు, సభ్యులు, అతిథులు పాల్గొనే ఈ కార్యక్రమం మీడియా, కమ్యూనికేషన్ ఎడ్యుకేషన్ విభాగాల్లో శ్రేష్ఠత్వాన్ని పెంపొందించడంలో ఐఐఎంసీ నిబద్ధతను చాటిచెప్పనుంది.
మీడియా లీడర్లను తీర్చిదిద్దుతున్న ఐఐఎంసీ
ఐఐఎంసీ భారత్‌లో ప్రధాన ప్రసార మాధ్యమ శిక్షణ సంస్థ. ఈ ఇనిస్టిట్యూట్ ప్రసార మాధ్యమాలు, కమ్యూనికేషన్ విభాగాల్లో కోర్సులను అందిస్తోంది. ఐఐఎంసీని 1965లో ఏర్పాటుచేశారు. దీనిలో హిందీ పత్రికారచన, ఇంగ్లిషు పత్రికారచన, అడ్వర్టయిజింగ్- ప్రజాసంబంధాలు, రేడియో, టెలివిజన్ జర్నలిజమ్, డిజిటల్ ప్రసార మాధ్యమాలు, మలయాళమ్ జర్నలిజమ్, ఉర్దూ జర్నలిజమ్, మరాఠీ జర్నలిజమ్.. వీటిలో పీజీ డిప్లొమా కోర్సులు బోధిస్తున్నారు. ఇవే కాకుండా, కిందటేడాది డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను సంపాదించుకొన్న తరువాత మీడియా బిజినెస్ స్టడీస్‌లోను, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్‌లోను రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాములను కూడా మొదలుపెట్టారు.
****
(Release ID: 2107904)
Visitor Counter : 9
Read this release in:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam