ప్రధాన మంత్రి కార్యాలయం
నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మన భూమి మీదున్న అపురూప జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తామన్న నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
Posted On:
03 MAR 2025 8:37AM by PIB Hyderabad
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఈ రోజు. మన భూగ్రహంలో అలరారుతున్న అపురూపమైన జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలన్న నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (#WorldWildlifeDay) సందర్భంగా, మన భూమి మీద అలరారుతున్న అపురూప జీవవైవిధ్యాన్ని ఎంతో జాగ్రత్తగా పరిరక్షించుకోవాలన్న మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం రండి. జీవజాతులలో ప్రతి ఒక్క జీవజాతి ఒక ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది.. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జీవజాతుల మనుగడను సంరక్షిద్దాం.
వన్యప్రాణులను కాపాడడంలో మన దేశం అందిస్తున్న సేవలు సైతం మనకు గర్వకారణంగా నిలుస్తున్నాయి.’’
***
MJPS/SR
(Release ID: 2107663)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam