ప్రధాన మంత్రి కార్యాలయం
మార్చి 1న జరిగే ‘వ్యవసాయం, గ్రామీణ సంక్షేమం’ అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్లో పాల్గొనున్న ప్రధాని
ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యాన్ని ఆచరణీయ ఫలితాలుగా మార్చేందుకు అవసరమైన సహకారాన్ని ఈ వెబినార్ ప్రోత్సహిస్తుంది
Posted On:
28 FEB 2025 7:32PM by PIB Hyderabad
మార్చి 1, మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభమయ్యే ‘వ్యవసాయం, గ్రామీణ సంక్షేమం’ అనే అంశంపై బడ్జెట్ అనంతరం నిర్వహించే వెబినార్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన అంశాలను సమర్థంగా అమలు చేసే వ్యూహాలపై చర్చించడానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకచోట చేర్చడమే ఈ వెబినార్ లక్ష్యం. వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ సంక్షేమంపై ప్రధాన దృష్టి సారిస్తూ జరిగే ఈ కార్యక్రమం, బడ్జెట్ లక్ష్యాలను ఆచరణాత్మక ఫలితాలుగా మార్చేందుకు అవసరమైన సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ దిశగా చేపట్టే ప్రయత్నాలను సమన్వయం చేస్తూ, ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రైవేటు రంగంలోని నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు, విషయ నిపుణులు ఈ వెబినార్లో పాల్గొంటారు.
***
(Release ID: 2107285)
Visitor Counter : 16
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil