సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ గ్లోబల్

సంస్కృతుల మమేకం సంగీత సంగమం

Posted On: 28 FEB 2025 5:02PM by PIB Hyderabad

పరిచయం

ది బ్యాటిల్ ఆఫ్ ది బ్యాండ్స్ ఘన విజయం తర్వాత, వేవ్స్ ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ ది బ్యాండ్స్ గ్లోబల్‌ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని అందిస్తోందియువతరానికి అద్భుతమైనవైవిధ్యమైన సంగీతాన్ని పరిచయం చేసే లక్ష్యంతో ఈ ఉత్సాహకరమైన కార్యక్రమాన్ని రూపొందించారుప్రసార భారతిసారేగామా సహకారంతో వేవ్స్ సీజన్ వన్ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే బ్యాండ్‌లు ఈ అద్భుత వేదిక ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి.

 


 

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ (వేవ్స్) మొదటి ఎడిషన్‌ మొత్తం మీడియావినోద రంగాలను ఏకం చేసే హబ్ అండ్ స్పోక్ ప్లాట్‌ఫామ్‌గా సిద్ధమైందిప్రపంచ మీడియావినోద రంగాల దృష్టిని ఆకర్షించివాటిని భారత మీడియావినోద రంగంతో పాటు దాని ప్రతిభతో అనుసంధానించే లక్ష్యంతో ఈ ప్రీమియర్ గ్లోబల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

మే నుంచి 4వ తేదీ వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సమిట్ జరగనుంది. బ్రాడ్‌కాస్టింగ్ అండ్ ఇన్ఫోటైన్‌మెంట్ఏవీజీసీ ఎక్స్ఆర్డిజిటల్ మీడియా అండ్ ఇన్నోవేషన్ఫిల్మ్స్ అనే నాలుగు మూలస్తంభాలపై దృష్టి సారిస్తూ భారత వినోదరంగ భవిష్యత్తును ప్రదర్శించడానికి వేవ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ రంగానికి చెందిన ప్రముఖులుక్రియేటర్స్సాంకేతిక నిపుణులను ఒక చోటకు చేర్చనుంది.

 

బ్రాడ్‌కాస్టింగ్, ఇన్ఫోటైన్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టిసారించే బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ గ్లోబల్ వేవ్స్ కోసం మొదటి మూలస్తంభంగా నిలుస్తుందిఈ రంగంలో కమ్యూనిటీ భావనఆవిష్కరణలువృద్ధిని ప్రోత్సహిస్తూ సృజనాత్మకతసంగీతాల హద్దులను విస్తరించేలా ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలను రూపొందించారు.

 

అర్హత ప్రమాణాలు
బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ గ్లోబల్‌లో పాల్గొనడానికికింది అర్హత ప్రమాణాలుసమర్పణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి:

 

 

పాల్గొనే ప్రక్రియ

పాల్గొనడం కోసంబ్యాండ్‌లు (గాయకుడితో సహా గరిష్టంగా మంది సభ్యులుసొంతంగా రూపొందించిన సంగీతాన్ని ప్రదర్శించే అసలైన ఆడియో-విజువల్ ప్రదర్శనను దూరదర్శన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలిఇప్పటికే విడుదలైన పాటలు లేదా కూర్పులను ఈ ప్రదర్శనలో ఉపయోగించకూడదు.

 

1.    వీడియో సమర్పణ:

  • ఆధునికసంప్రదాయిక జానపద అంశాలను మిళితం చేస్తూ బ్యాండ్స్ సొంతంగా రూపొందించిన సంగీతాన్ని వీడియో రూపంలో (గరిష్టంగా నిమిషాలు, 300 ఎంబిఎంపి ఫార్మాట్సమర్పించాలి.

  • దూరదర్శన్ అధికార వెబ్‌సైట్‌లో “వేవ్స్ ఇండియా” విభాగం కింద “బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్” ను ఎంచుకునిరిజిస్ట్రేషన్ సూచనలను అనుసరిస్తూ సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

2.   రిజిస్ట్రేషన్:

  • బ్యాండ్ పేరు, నగరంసంప్రదించు సమాచారంబ్యాండ్ సభ్యులుసోషల్ మీడియా లింక్‌లుప్రదర్శన లింక్ వంటి వివరాలను అందించడం ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్‌ పూరించాలి.

3.   నిబంధనలు:

  • మొదట సమర్పించిన చెల్లుబాటయ్యే వీడియోను ఎంపిక కోసం పరిగణిస్తారు.

  • వీడియోలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. అలా లేని వాటిని అనర్హమైనవిగా పరిగణిస్తారు.

  • పాల్గొనేవారు ఈ సమాచారాన్ని సమర్పించడం ద్వారాప్రచార ఉపయోగం కోసం కలిగి ఉండే గోప్యతా హక్కులను వదులుకుంటారు.

పోటీ వివరాలు

సమగ్ర ఎంపిక ప్రక్రియ తర్వాతమొదటి 13 స్థానాల్లో నిలిచిన అంతర్జాతీయ బ్యాండ్‌లను ఈ పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ పోటీలు మార్చి 15 - 20 నుంచి ప్రసారం అవుతాయి. అలాగే ఏప్రిల్ 30కి ముందు ముగుస్తాయిఈ కార్యక్రమంలో ప్రదర్శన ఆధారంగా మొదటి స్థానాల్లో నిలిచిన అంతర్జాతీయ బ్యాండ్‌లను ఎంపిక చేస్తారు.

కార్యక్రమ వివరాలు:

  • నిర్మాణంసారేగామా

  • దర్శకత్వంషో దర్శకత్వంలో అనుభవజ్ఞులైన శ్రుతి అనిందిత వర్మ

  • వ్యాఖ్యాతఅద్భుత ప్రతిభావంతులైన కేతన్ సింగ్

  • న్యాయనిర్ణేతలుప్రఖ్యాత కళాకారులు రాజా హసన్శ్రద్ధా పండిట్

  • మార్గదర్శకులుభారత్‌కు చెందిన టోనీ కక్కర్శ్రుతి పాఠక్రాధిక చోప్రాఅమితాబ్ వర్మ వంటి ప్రముఖ శిక్షకులు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందిస్తూ మార్గదర్శనం చేస్తారు.

ముగింపు

వైవిద్యమైన సంగీత ప్రతిభకుఅంతర్జాతీయ సహకారానికి బాటిల్ ఆఫ్ బ్యాండ్స్ గ్లోబల్ ప్రత్యేకమైన వేదికగా నిలుస్తుందిఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన టాప్ గ్లోబల్ బ్యాండ్‌లు ప్రతిష్ట్మాత్మక వేవ్స్ వేదికగా టాప్ భారతీయ బ్యాండ్‌లతో కలిసి ప్రపంచభారతీయ సంగీతాల గొప్పతనాన్ని ప్రదర్శిస్తాయిసుసంపన్నమైన భారత సంగీత సంప్రదాయాలను కొనసాగిస్తూనే ప్రపంచ సంగీత రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం కోసం:

 

         v.   https://x.com/WAVESummitIndia/

         v.   https://www.saregama.com/

         v.   https://prasarbharati.gov.in/

         v.   https://pib.gov.in/.

         v.   https://pib.gov.in/

 

 

***


(Release ID: 2107279) Visitor Counter : 17