ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్- కారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 21 NOV 2024 1:00AM by PIB Hyderabad

గౌరవనీయులారా,
భారత్-కారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సును నా మిత్రులు అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీప్రధాని శ్రీ డికాన్ మిచెల్‌లతో కలసి నిర్వహిస్తుండడం నాకెంతో సంతోషాన్నిస్తోందికారికోమ్ కుటుంబ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మరీముఖ్యంగా ఈ శిఖరాగ్ర సదస్సును చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

కొన్ని నెలల కిందట, ‘బెరిల్ గాలివాన’ సృష్టించిన విధ్వంసకాండలో కొన్ని దేశాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారుభారీ ఆస్తినష్టం కూడా సంభవించిందిభారతదేశ ప్రజలందరి పక్షాననేను నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.


గౌరవనీయులారా,
అయిదు సంవత్సరాలు గడిచాక మనమిక్కడ సమావేశమయ్యాంఈ అయిదేళ్లలోప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయిమానవ జాతి అనేక ఉద్రిక్త స్థితుల్నిసంకటాల్ని ఎదుర్కొందిఇవి గ్లోబల్ సౌత్ దేశాల్లో ఒకటైన మా వంటి దేశాలపైన ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత పెద్ద స్థాయిలో ప్రతికూల ప్రభావాన్ని కలగజేశాయిఈ కారణంగానేభారత్ ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ కారికోమ్ తో కలిసే పాటుపడుతూ వస్తోంది.

అది కోవిడ్ కావచ్చుప్రాకృతిక విపత్తులు కావచ్చుసామర్థ్యాన్ని పెంచడం కావచ్చులేదా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు.. భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామ్య దేశంగా మీతో భుజం భుజం కలిపి నిలచింది.

గౌరవనీయులారా,
మనం కిందటిసారి సమావేశమైనప్పుడుఅనేక కొత్త కార్యక్రమాలనుసకారాత్మక కార్యక్రమాలను గుర్తించాంఆ కార్యక్రమాలన్నిటిలో పురోగతి పథంలో పయనిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నానుమన సహకారాన్ని భవిష్యత్తులో కూడా మరింత బలపరుచుకోవడానికినేను కొన్ని ప్రతిపాదనలను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను.

ఈ ప్రతిపాదనలకు ఏడు అంశాలు ప్రధాన స్తంభాలుగా ఉంటాయిమరి ఆ స్తంభాలు ఏమేమిటి అంటేఅవి.. సీఆర్సీఓ ఇంకా ఎమ్ .. అదే కారికోమ్ (CARICOM).

వీటిలో మొదటిది, ‘సి’ఇది కెపాసిటీ బిల్డింగు (సామర్థ్యాల పెంపు)ను సూచిస్తుందికారికోమ్ సభ్య దేశాల సామర్థ్యాన్ని పెంచడానికి భారత్ ఎల్లప్పుడూ తోడ్పాటును అందించిందిదీనికోసం ఉపకార వేతనాలుశిక్షణసాంకేతిక సహాయాన్నందించడం అనే మార్గాలను ఎంచుకొందిఈ రోజు నేనురాబోయే అయిదు సంవత్సరాల కాలంలో ఐటీఈసీ స్కాలర్‌షిప్‌ల విషయంలో 1,000 స్లాట్లను పెంచాలని ప్రతిపాదిస్తున్నాను.

యువతలో సాంకేతిక శిక్షణనూనైపుణ్యాభివృద్ధినీ ప్రోత్సహించడానికి ఒక సాంకేతిక అభివృద్ధి కేంద్రాన్ని బెలీజ్‌లో మనం ఏర్పాటు చేశాంకారికోమ్ దేశాలన్నిటికీ ఉపయోగపడేటట్లుగా దీని పరిధిని విస్తరించుదాం.

కారికోమ్ రీజియన్‌కు ఒక ఫోరెన్సిక్ సెంటరును ఏర్పాటు చేసేందుకు కూడా కృషిచేద్దాంప్రభుత్వోద్యోగుల సామర్థ్యాన్ని పెంచుతూపోయేందుకుభారత్‌లో మేం ‘‘ఐ-జీఓటీ కర్మయోగి పోర్టల్’’ను తీసుకువచ్చాం.

ఈ పోర్టల్ టెక్నాలజీపరిపాలనన్యాయ శాస్త్రంవిద్య వంటి రంగాలలో ఆన్‌లైన్ మాధ్యమంలో పాఠ్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిందిఇలాంటి పోర్టల్‌నే కారికోమ్ దేశాల కోసం రూపొందించుకోవచ్చుప్రజాస్వామ్య వ్యవస్థకు జననిగా భారత్ సైతంపార్లమెంట్ సభ్యులకు శిక్షణను ఇవ్వడంలో కారికోమ్ భాగస్వామ్య దేశాలతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది.  
రెండోదైన ‘ఎ’ వ్యవసాయాన్నీఆహార భద్రతనూ సూచిస్తుందివ్యవసాయ రంగానికొచ్చిడ్రోన్లుడిజిటల్ ఫార్మింగ్ఫార్మ్ మెకనైజేషన్భూసార పరీక్ష.. ఇవి భారత్‌లో సాగు రూపురేఖలను మార్చివేశాయినానో ఫర్టిలైజర్స్‌తోపాటు మేం ప్రాకృతిక వ్యవసాయంపైన కూడా శ్రద్ధ తీసుకొంటున్నాంఆహార భద్రతపై స్పృహను పెంచడానికి మేం ‘శ్రీ అన్న’ను ప్రోత్సహిస్తున్నాంభారత్ చొరవ తీసుకొన్నందునేఐక్య రాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ శ్రీ అన్న సంవత్సరంగా ప్రకటించింది.

శ్రీ అన్న ఒక మహా ఆహారం (సూపర్‌ఫూడ్). ఇవి అన్ని రకాలైన వాతావరణంలో అందివస్తాయికారికోమ్ దేశాల విషయంలోఇవి వాతావరణ మార్పుతో పోరాడడానికీఆహార భద్రతను పెంపొందించడానికీ ఒక దీటైన పరిష్కారంగా ఉంటాయిమా ప్రాంతంలో, ‘‘సర్‌గాసమ్ సీవీడ్’’ ఓ పెద్ద చిక్కుసమస్యగా ఉంది.  ఇది హోటల్పర్యాటక పరిశ్రమపైనా ప్రభావాన్ని చూపుతోంది.

భారతదేశంలోమేం ఈ సీవీడ్ నుంచి ఎరువులను ఉత్పత్తి చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశాంఈ టెక్నాలజీ పంట దిగుబడులను పెంచుతూనే ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని అందించగలుగుతుందిభారత్ ఈ అనుభవాలనన్నింటినీ కారికోమ్ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది.

మూడోదైన ‘ఆర్’ పునరుత్పాదక ఇంధనాన్నీవాతావరణ మార్పునూ సూచిస్తుందిపర్యావరణ సంబంధ సవాళ్లు మనకందరికీ ఒక ప్రాథమ్యతా అంశంఈ రంగంలో ప్రపంచ సహకారాన్ని పెంపొందింపచేయడానికిమేం అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్.. ఐఎస్ఏ)నీకొయలిషన్ ఫర్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)నీఎల్ఐఎఫ్ఈ (లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్‌వైరన్‌మెంట్)లతోపాటు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్సును కూడా ప్రారంభించాం.

మీరు అంతర్జాతీయ సౌర కూటమిలో భాగస్తులు అయినందుకు నేను సంతోషిస్తున్నానుఇతర కార్యక్రమాలలో కూడా పాలుపంచుకోవాలంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.  పునరుత్పాదక ఇంధన రంగంలోమేం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాంకారికోమ్ ‌లో ప్రతి దేశంలో కనీసం ఒక ప్రభుత్వ భవనం సౌర విద్యుత్తు సదుపాయాన్ని కలిగి ఉండేటట్లు తోడ్పడాలనేదే మా ప్రతిపాదన.
 

నాలుగోదైన ‘ఐ’ నవకల్పనటెక్నాలజీలతోపాటు వ్యాపారాన్ని కూడా సూచిస్తుందిప్రస్తుతంభారత్‌ టెక్నాలజీఅంకుర సంస్థల కూడలిగా గుర్తింపు తెచ్చుకొందిభారత్‌కున్న విశిష్టత ఏమిటంటే ఇక్కడ అభివ‌ృద్ధిచేస్తున్న టెక్నాలజీ ప్రధాన పరిష్కారాలు మా సమాజంలోని భిన్నత్వంలో నుంచి పెల్లుబుకినవీకాల పరీక్షకు తట్టుకొని నిలబడుతున్నవీఅందువల్లఅవి ప్రపంచంలో ఏ దేశంలో అయినా సఫలం అవుతాయన్న హామీ ఉందన్నమాటభారత్ అనుసరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తో మేం ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగంలో పెనుమార్పులను ప్రవేశపెడుతున్నాం.  

ప్రస్తుతంఇండియాలో ఒకే క్లిక్‌తో ప్రయోజనాలు లక్షల కొద్దీ ప్రజలకు నేరుగా బదిలీ అవుతున్నాయియూఏఈసింగపూర్ఫ్రాన్స్శ్రీ లంకనేపాల్మారిషస్‌ వంటి దేశాలు భారత్‌కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)తో ఇప్పటికే జతపడ్డాయి.

యూపీఐని కారికోమ్ దేశాలలో సైతం స్వీకరించేటట్లుగా మనం కలసి క‌ృషి చేద్దామంటూ నేను ఒక ప్రతిపాదనను మీ ముందుకు తీసుకువస్తున్నానుమేం పౌరులు వారి దస్తావేజులను సురక్షితంగా అట్టిపెట్టుకోవడానికి క్లౌడ్ ఆధారంగా పనిచేసే డిజిలాకర్ (DigiLocker) ప్లాట్‌ఫారాన్ని రూపొందించాం.

ఈ ప్లాట్‌ఫారాన్ని కారికోమ్ దేశాల్లో ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టుగా మనం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందిప్రభుత్వ రంగంలో కొనుగోళ్ల ప్రక్రియను సులభతరంగాపారదర్శకంగా మార్చడానికి మేం గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌ను సిద్ధం చేశాం.


 

వైద్య పరికరాలుకంప్యూటర్ల నుంచి గృహోపకరణాలుపిల్లలు ఆడుకొనే బొమ్మల వరకు అన్నీ ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయిఈ పోర్టల్‌ను కారికోమ్ దేశాలతో పంచుకోవడానికి మేం సంతోషిస్తున్నాంఅయిదు టీలు ట్రేడ్ (వాణిజ్యం), టెక్నాలజీ (సాంకేతికత), టూరిజం (పర్యాటకం), టాలెంట్ (ప్రతిభ), ట్రెడిషన్ (సంప్రదాయం)లను ప్రోత్సహించడానికిఅలాగే అన్ని దేశాల నుంచి ప్రైవేటు రంగాలుసంస్థలను అనుసంధానించేలా ఆన్లైన్ పోర్టల్‌ను మేం రూపొందించగలం.

ఎస్ఎంఈ రంగంలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోందిగతేడాది జరిగిన ఇండియా-కారికోమ్ సమావేశంలో ఎస్ఎంఈ ప్రాజెక్టుల కోసం ఒక మిలియన్ డాలర్ల నిధిని ప్రకటించాందీని అమలును మనం వేగవంతం చేయాలిఅంతరిక్ష సాంకేతికతలో అగ్రదేశాలుగా పరిగణిస్తున్నవాటిలో భారత్ కూడా ఒకటిఅంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకుంటూ కారికోమ్ దేశాల్లో వనరులు గుర్తించడంవాతావరణ అధ్యయనాలువ్యవసాయం తదితర రంగాల్లో మనం కలసి పనిచేయవచ్చు.

గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన జీ -20 సదస్సులో పర్యావరణంవాతావరణ పరిశీలన కోసం జీ-20 ఉపగ్రహాన్ని ప్రకటించాందాన్ని 2027 నాటికి ప్రయోగిస్తాందీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలతో ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలతో పంచుకుంటాం.

ఐదోదైన ‘సి’ క్రికెట్సంప్రదాయాన్ని సూచిస్తుందిమన దేశాలను అనుసంధానించే ప్రధానమైన అంశం క్రికెట్అది 1983 ప్రపంచ కప్ ఫైనల్ అయినాలేదా ఐపీఎల్ అయినావెస్ట్ ఇండియన్ క్రికెటర్లంటే భారతీయులకు ప్రత్యేక అభిమానం ఉంది.

ఈ ఏడాది మీ ప్రాంతంలో జరిగిన టీ-20 ప్రపంచకప్ భారత క్రికెట్ అభిమానులను కరీబియన్‌కు తీసుకువచ్చిందిఆ ప్రపంచకప్‌ను భారత్ గెలిచిందని ఈ మాట నేను చెప్పడం లేదుక్రికెట్ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటుమహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ప్రతి కారికోమ్ దేశం నుంచి 11 మంది చొప్పున యువ మహిళా క్రికెటర్లను భారత్‌లో తీర్చిదిద్దుతాం.

అంతర్జాతీయ వేదికలపై మన ఉమ్మడి సంప్రదాయ వారసత్వాన్ని ప్రదర్శించేందుకువచ్చే ఏడాది నుంచి కారికోమ్ దేశాల్లో భారతీయ సంస్కృతీ దినోత్సవాలను మనం నిర్వహించవచ్చుబాలీవుడ్‌కున్న ప్రజాదరణ దృష్ట్యా కారికోమ్ దేశాలతో కలసి చిత్రోత్సవాలను నిర్వహించవచ్చు.

ఆరోదైన ‘ఒ’ సముద్ర ఆర్థిక వ్యవస్థసముద్ర రవాణా భద్రతను సూచిస్తుందిభారత్ దృష్టిలో మీరు చిన్న ద్వీప దేశాలు కాదు.. పెద్ద మహాసముద్ర దేశాలు.

ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు గాను ప్రజారవాణాసరకు రవాణాకు ఉపయోగించే ఫెర్రీలను సరఫరా చేస్తామని నేను ప్రతిపాదిస్తున్నానుసముద్ర డొమైన్ మ్యాపింగ్హైడ్రోగ్రఫీపై మనం కలసి పనిచేయవచ్చుతమ సముద్ర రవాణా భద్రతా వ్యూహాన్ని గతేడాది కారికోమ్ విడుదల చేసింది.

ఈ వ్యూహం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాసముద్ర దోపిడీలుఅక్రమ చేపల వేటమానవ అక్రమ రవాణా తదితర సమస్యలను ప్రస్తావించిందిఅలాగే ఆర్థిక సహకారంలో ఇంకా వినియోగించని సామర్థ్యాన్ని కూడా ప్రముఖంగా తెలియజేస్తోందిఈ అన్ని అంశాల్లోనూ మీతో సహకారం పెంపొందించుకొనేందుకు భారత్ ఎదురుచూస్తోంది.

ఏడోదైన ‘ఎం’ఔషధాలుఆరోగ్య రంగాన్ని సూచిస్తుందికారికోమ్ దేశాల ఆరోగ్య భద్రత భారత్‌కు అత్యంత ప్రధానమైన అంశం.

సామాన్యుడికి నాణ్యమైనసరసమైన ధరల్లో ఆరోగ్యసేవలను అందించేందుకు జన ఔషధి కేంద్రాలను భారత్ ప్రారంభించిందిఅన్ని కారికోమ్ దేశాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నేను ప్రతిపాదిస్తున్నానుభారత్కారికోమ్ దేశాల ఫార్మకోపియాలను పరస్పరం గుర్తించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మనం ఈ ప్రయత్నాలను చేపట్టవచ్చు.

కారికోమ్ దేశాల్లో డ్రగ్ టెస్టింగ్ ల్యాబులను స్థాపించడానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాంకారికోమ్ దేశాల్లో క్యాన్సర్ఇతర దీర్ఘకాల వ్యాధులు ప్రధాన సమస్యగా పరిణమించాయివీటిని ఎదుర్కోవడానికి భారత్‌లో తయారుచేసిన సిద్ధార్థ్ టూ క్యాన్సర్ థెరపీ యంత్రాన్ని మేం అందిస్తాం.

మారుమూల ప్రాంతాల్లో సత్వరమే చికిత్సను అందించేందుకు మేం ‘భీష్మ’ మొబైల్ ఆసుపత్రులను అభివృద్ధి చేశాంనిమిషాల వ్యవధిలో ఏర్పాటు చేసే ఈ ఆసుపత్రిలో అన్ని రకాల గాయాలకు తక్షణం చికిత్స అందించవచ్చుకారికోమ్ స్నేహితులకు ఈ మొబైల్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.

మానవతా దృక్పథంతో వికలాంగులకు కృత్రియ అవయవాలు అందించేందుకు కారికోమ్ దేశాల్లో జైపూర్ ఫుట్ క్యాంపులను ప్రతి ఏడాది నిర్వహించేందుకు ప్రతిపాదిస్తున్నానుడయాలసిస్ యూనిట్లుసీ అంబులెన్సులను అందించేందుకు సైతం మేం ప్రతిపాదిస్తున్నాం.

మధుమేహంరక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను ఎదుర్కొనేందుకు యోగా సమర్థవంతంగా పనిచేస్తుందిమనసుశరీరాన్ని సమన్వయం చేయడంపై దృష్టి సారించిన ఈ పద్ధతిని యావత్ మానవాళికి భారతీయ నాగరికత బహుమతిగా అందించింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015లో ఐక్యరాజ్యసమితి గుర్తించిందిచిన్నతనం నుంచే దీన్ని అనుసరించడాన్ని ప్రోత్సహించేందుకు పాఠశాల స్థాయిలోనే దీన్ని తప్పనిసరి చేయాలిభారత్ నుంచి యోగా ఉపాధ్యాయులనుశిక్షకులను కారికోమ్ దేశాలకు పంపించేందుకు ప్రతిపాదిస్తున్నాంఅదనంగాకారికోమ్ దేశాల్లో యోగా థెరపీభారతీయ సంప్రదాయ ఔషధాలను వినియోగించేందుకు మనం కలసి పనిచేయవచ్చు.

గౌరవనీయులారా,

కారికోమ్ కు సంబంధించిన ఏడు ప్రధాన అంశాల్లో ఉమ్మడిగా ఉన్న ఒక అంశం ఏంటంటే అవన్నీ మీ ప్రాధాన్యాలుఅవసరాలపై ఆధారపడి ఉన్నాయిఇదే మన సహకారానికి ప్రాథమిక సూత్రంఈ అంశాలపై మీ అభిప్రాయాలను వినేందుకు నేను ఎదురు చూస్తున్నాను.

ధన్యవాదాలు.

సూచనఇది ప్రధాన మంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి ఇంచుమించుగా చేసిన తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2106430) Visitor Counter : 25