సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఏఏఏఐ లాభదాయక ప్రకటన వ్యయ హ్యాకథాన్

Posted On: 25 FEB 2025 6:30PM by PIB Hyderabad

పరిచయం

వేవ్స్ ‘క్రియేట్ ఇండియా’ పోటీ తొలి సీజన్ లో భాగంగా లాభదాయక ప్రకటన వ్యయ హ్యాకథాన్ నిర్వహిస్తున్నారుఆ రంగంలో నిపుణులందరినీ ఒక్కచోటికి చేర్చి ముందస్తు విశ్లేషణల ద్వారా ప్రకటన వ్యయాన్ని లాభదాయకం చేయడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే అద్భుత కార్యక్రమమిదిభారత ప్రకటన సంస్థల సంఘం (ఏఏఏఐ)తో కలిసి సమాచారప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్.. కీలక సవాళ్ల పరిష్కారానికినైపుణ్య భాగస్వామ్యానికిప్రకటన రంగంలో వృద్ధిని ప్రేరేపించడానికి వేదికగా నిలవనుందిఒక అంతర్జాతీయ సంస్థ సహా ఇప్పటివరకు 35 సంస్థలు నమోదు చేసుకున్న ఈ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోంది.

image.png

మొత్తం మీడియావినోద రంగాలను ఏకీకృతం చేసే విశిష్ట కూడలిగాఅనుసంధాన వేదికగా ప్రపంచ దృశ్యశ్రవ్య వినోద సదస్సు (వేవ్స్తొలి ఎడిషన్ నిలవబోతోందిప్రపంచవ్యాప్త మీడియావినోద రంగాన్ని భారత్ వైపు మళ్లించి.. ఇక్కడి మీడియావినోద రంగంతోనూ దేశంలోని కళాకారులతోనూ అనుసంధానించే ముఖ్య అంతర్జాతీయ కార్యక్రమమిది.

ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ జియో వరల్డ్ గార్డెన్స్ లో మే నుంచి వరకు ఈ సదస్సు జరగనుందిసమాచార ప్రసారంటీవీ కార్యక్రమాలువీజీసీ-ఎక్స్ఆర్డిజిటల్ మీడియాఆవిష్కరణసినిమాలువేవ్స్ అనే నాలుగు అంశాలు కార్యక్రమానికి నాలుగు ముఖ్య ప్రాతిపదికలుగా ఉన్నాయిఈ రంగానికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖులుసృజనకారులుసాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి చేర్చి భారత వినోద పరిశ్రమ భవితను వేవ్స్ ఘనంగా చాటబోతోంది.

 

ఏఏఏఐ ప్రకటన వ్యయ క్రమబద్ధీకరణ హ్యాకథాన్ అన్నది సమాచార ప్రసారంటీవీ కార్యక్రమాలు అన్న అంశంలో భాగంఇది దేశ విదేశాలకు చెందిన ప్రకటనలుమార్కెటింగ్ రంగాల్లో యువ నిపుణులను ఒక్కచోటికి చేర్చి ప్రకటనలను లాభదాయకం చేయడంలో వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తుందిప్రకటనకర్తలు డేటా సైన్స్మెషీన్ లెర్నింగ్గణాంక మోడలింగ్ సాయంతో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికిపెట్టుబడులపై గరిష్టంగా రాబడులు పొందడానికిమార్కెటింగ్ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రమాణాలు

ఏఏఏఐ లాభదాయక ప్రకటన వ్యయ హ్యాకథాన్ నిపుణులకు సృజనాత్మక ప్రకటన వ్యూహాలను రూపొందించే అవకాశాన్ని కల్పిస్తుంది.

image.png

  • డేటా సైన్స్మెషీన్ లెర్నింగ్గణాంక విభాగంసాఫ్ట్ వేర్మార్కెటింగ్ప్రకటన నైపుణ్యాల మిశ్రమంగా వ్యక్తిగతంగా లేదా బృందాలుగా (గరిష్టంగా ముగ్గురు సభ్యులతోపాల్గొనవచ్చు.

  • ప్రకటన సంస్థలు (పూర్తిస్థాయి సేవలుమీడియాడిజిటల్లేదా మార్కెటింగ్ విభాగాల్లో ఏడాది అనుభవమున్న నిపుణులు పాల్గొనవచ్చు.

  • నిర్ణీత బడ్జెట్ లో ట్రిమ్ మాస్టర్ మార్కెటింగ్ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఓ వ్యూహాన్ని రూపొందించడం.

  • కార్యక్రమంలో పాల్గొనేవారు తమ సొల్యూషన్ ను పవర్ పాయింట్ ద్వారా ప్రదర్శించాల్సి ఉంటుంది.

ట్రిమ్ మాస్టర్ బ్రాండ్ వ్యూహాన్ని రూపొందించడం

ఇందులో పాల్గొనాలనుకుంటున్న వారు ‘ట్రిమ్ మాస్టర్ పురుషుల సౌందర్య సాధనమైన ఈ బ్రాండ్ కోసం వ్యూహాన్ని రూపొందించడం’ ద్వారా జనంలోకి తీసుకెళ్లే మార్కెటింగ్ చర్యలను పెంపొందించడం అనే అంశాన్ని ఉపయోగించుకోవచ్చు.

 

నేపథ్యం: ట్రిమ్ మాస్టర్ అన్నది నేరుగా వినియోగదారులకే విక్రయించే ప్రముఖ బ్రాండ్పురుషుల అలంకరణసౌందర్య ఉత్పత్తులు దీని ప్రత్యేకతవారి ప్రధాన ఉత్పత్తి ప్రెసిషన్ ట్రిమ్ మాస్టర్ కు వినియోగదారుల్లో ఆదరణ లభించిందిమంచి ఉత్పత్తివినియోగదారులు పెరుగుతున్నప్పటికీ తన బ్రాండ్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో ట్రిమ్ మాస్టర్ సవాళ్లను ఎదుర్కొంటోంది.

ప్రస్తుత పరిస్థితి: జనాలకు బ్రాండ్ గురించిన సమాచారం అంతగా లేకపోవడంతో బ్రాండ్ పేరుతో వెతకడం లేదని ట్రిమ్ మాస్టర్ పరిశోధనలో తెలిసిందిప్రస్తుతం ప్రజల్లో బ్రాండ్ గురించిన సమాచారంపై దీని స్కోరు 52. ఇది మంచి స్కోరే అయినప్పటికీఇంకా మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉందిమార్కెటులో పోటీ పెరుగుతున్న దృష్ట్యాప్రజలు బ్రాండ్ పేరుతో శోధించడాన్ని పెంచి.. తద్వారా మొత్తంగా బ్రాండ్ గుర్తింపును పెంపొందించుకోవాలనిబ్రాండ్ ను ఇంకా జనంలోకి తీసుకెళ్లాలని ట్రిమ్ మాస్టర్ భావిస్తోంది.

సవాళ్లు: బ్రాండును జనంలోకి తీసుకెళ్లే లాభదాయక మార్కెటింగ్ చర్యల్లో ట్రిమ్ మాస్టర్ మార్కెటింగ్ బృందం ముఖ్యంగా సవాళ్లను ఎదుర్కొంటోంది.

 

image.png

లక్ష్యం: జనంలో తన బ్రాండుకు ఉన్న గుర్తింపు స్కోరును వివిధ మార్గాల్లో లాభదాయక ప్రకటన వ్యయ వ్యూహం ద్వారా 52 నుంచి 75కు పెంచుకోవాలని ట్రిమ్ మాస్టర్ లక్ష్యంగా పెట్టుకుందితద్వారా వినియోగదారుల్లో బ్రాండ్ పట్ల ఆదరణలో స్పష్టమైన పెరుగుదలనుపెట్టుబడులపై స్పష్టమైన రాబడులను సాధించాలని భావిస్తోందిబడ్జెట్ రూ2,00,00,000/- (రెండు కోట్లు). 

వీటిపై దృష్టిపెట్టండి:

image.png

 

మూల్యాంకన ప్రమాణాలు

కింద పేర్కొన్న కీలక ప్రమాణాలను ఆధారం చేసుకుని బ్రాండ్ వ్యూహాలను మదింపు చేస్తారు:

image.png

బహుమతులు

విజేతలుగా నిలిచిన వ్యక్తులుజట్లకు కింది ప్రయోజనాలు లభిస్తాయి:

  • అగ్రస్థానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులుజట్లు తమ సొల్యూషన్లను వేవ్స్ కార్యక్రమం (వివరాలు ప్రకటించాల్సి ఉందిప్రదర్శించే అవకాశం పొందుతారుప్రయాణ ఖర్చులను వారికి తిరిగి చెల్లిస్తారు.

  • అసాధారణ ప్రదర్శనలకు అద్భుతమైన బహుమతులు.

  • అగ్రస్థానంలో నిలిచిన ముగ్గురు వ్యక్తులు/బృందాలకు దేశంలో జరిగే అడ్వర్టైజింగ్ ఫెస్టివల్స్సదస్సుల్లో పాల్గొనడం కోసం రిజిస్ట్రేషన్ వ్యయాన్ని ఏఏఏఐ భరిస్తుంది.

ముగింపు

వేవ్స్ క్రియేట్ ఇండియా పోటీలో భాగంగా నిర్వహిస్తున్న ఏఏఏఐ ప్రకటన వ్యయ క్రమబద్ధీకరణ హ్యాకథాన్ సృజనాత్మక వ్యూహాల రూపకల్పన కోసం నిపుణులను ఆహ్వానించి ప్రకటన వ్యయాన్ని లాభదాయకంగా మార్చడంతోపాటు ట్రిమ్ మాస్టర్ బ్రాండ్ ను మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందిఅబ్బురపరిచే బహుమతులతోపాటు వేవ్స్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ విశిష్ట కార్యక్రమం ప్రకటన రంగం భవిష్యత్తును తీర్చిదిద్దేలా విశేషంగా ప్రభావితం చేయనుంది.

References

పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

***


(Release ID: 2106401) Visitor Counter : 61