ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండోనేషియా అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 19 NOV 2024 6:09AM by PIB Hyderabad

బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంతో భేటీ అయ్యారుఇండోనేషియా అధ్యక్షుడిగా శ్రీ సుబియాంతో ఇటీవలే ఎన్నికయ్యారుఇద్దరు నేతలూ భేటీ కావడం ఇదే మొదటిసారి.

శ్రీ సుబియాంతో అధికారాన్ని చేపట్టినందుకు ప్రధాని ఆయనకు అభినందనలు తెలిపారు.  ద్వైపాక్షిక సంబంధాలను విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యంప్రాథమిక కార్యాచరణ ప్రణాళిక పరిధిలో బలపరచుకొనే విషయంలో నేతలిద్దరూ వారి నిబద్ధతను పునరుద్ఘాటించారువ్యాపారంపెట్టుబడిరక్షణభద్రతకనెక్టివిటీపర్యటన ఆరోగ్య రంగం తో పాటు ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాల్లోనూ సహకారాన్ని గురించి నేతలు చర్చించారుభారతఇండొనేషియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భాన్ని ఇరువురు నేతలూ గుర్తు చేసుకుంటూతగిన విధంగా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.

భౌగోళిక అంశాలపైప్రాంతీయ అంశాలకు చెందిన ఆలోచనలను పరస్పరం పంచుకున్నారుజి 20 పరంగా తమ మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాలను కూడా చర్చించారుఅభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్)కు ఎదురవుతున్న  సమస్యలకు ప్రాధాన్యాన్నివ్వాల్సిన అవసరం ఉందంటూ ఉభయులూ పిలుపునిచ్చారుఆసియాన్ సహా బహు పార్శ్విక సంస్థలలోనూఅలాగే బహుముఖ రంగాలలోనూ ఇప్పుడు కొనసాగుతున్న సహకారాన్ని కూడా వారు సమీక్షించారు.

 

***


(रिलीज़ आईडी: 2106351) आगंतुक पटल : 36
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada