ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 13 FEB 2025 9:36AM by PIB Hyderabad

గురువారం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారుఈ నెల 23న నిర్వహించే మన్ కీ బాత్ గురించి ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలనూసలహాలనూ పంచుకోవాలని పిలుపునిచ్చారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు!

సమాచారాన్నిస్తూస్ఫూర్తిని కలిగిస్తూప్రజలను అనుసంధానిస్తూ – అనేక మందికి రేడియో శాశ్వత సమాచార వేదికగా నిలిచిందివార్తలుసంస్కృతి నుంచి సంగీతంకథాకథనాల దాకా.. సృజనాత్మకతను చాటే శక్తిమంతమైన మాధ్యమమిది.

రేడియో ప్రపంచంతో అనుబంధం ఉన్న వారందరికీ నా అభినందనలుఈ నెల 23న జరిగే #MannKiBaat కోసం ఆలోచనలుఅభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను.

https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-23rd-february-2025” 

***

MJPS/SR


(Release ID: 2102622) Visitor Counter : 40