ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తైపూసం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2025 1:14PM by PIB Hyderabad

తైపూసం పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“మురుగన్ ఆశీస్సుల బలంతో మనందరికీ శక్తి, సంపద, జ్ఞానం సిద్ధించుగాక! ఈ పవిత్ర సందర్భంలో అందరికీ సంతోషం, చక్కని ఆరోగ్యం, విజయం దక్కాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.  
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా సందేశమిస్తూ:

“అందరికీ తైపూసం పర్వదిన శుభాకాంక్షలు! మురుగన్ కటాక్షం మనందరికీ శక్తినీ, సౌభాగ్యాన్నీ, జ్ఞానాన్నీ కలిగించుగాక! ఈ సందర్భంగా మీ అందరి సంతోషం, ఆరోగ్యం, విజయం కోసం ప్రార్థిస్తున్నాను. ఈ పవిత్ర దినాన అందరి జీవితాల్లోకి శాంతి సౌభాగ్యాలు నడచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా!”  


 

***

MJPS/VJ/SKS


(రిలీజ్ ఐడి: 2101697) సందర్శకుల సూచీ సంఖ్య : : 83