హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నక్సలిజాన్ని 2026 మార్చి 31 లోపు దేశంలో నుంచి నిర్మూలిస్తాం


భద్రత దళాలు 31 మంది నక్సలైట్లను హతమార్చడం
భారత్‌ను నక్సలైట్ల ఉనికి లేకుండా చేయడంలో దక్కిన
ఒక పెద్ద విజయం: కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా

ఈ ఆపరేషన్లో పెద్ద ఎత్తున ఆయుధాలను,
పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకొన్నారు

నక్సలిజాన్ని రూపుమాపే ప్రయత్నంలో,
ఇద్దరు సాహసిక జవాన్లను మనం ఇవాళ కోల్పోయాం..
ఈ వీరులకు దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు: కేంద్ర హోం మంత్రి

Posted On: 09 FEB 2025 4:40PM by PIB Hyderabad

భద్రత దళాలు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 31 మంది నక్సలైట్లను హతమార్చారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఇది మన దేశాన్ని నక్సలైట్లే ఉండని దేశంగా మార్చడంలో భద్రత దళాలకు లభించిన ఒక ప్రధాన విజయమని ఆయన అభివర్ణించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర హోం మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, భారత్‌ను నక్సలైట్లే ఉండని దేశంగా మార్చడంలో ఒక పెద్ద విజయాన్ని భద్రత దళాలు సాధించాయి, ఈ సైనికచర్యలో 31 మంది నక్సలైట్లు మట్టికరిచారు. భద్రత దళాలు ఆయుధాల్ని, పేలుడు సామగ్రిని పెద్ద ఎత్తున స్వాధీనపర్చుకొన్నాయని మంత్రి తెలిపారు.

మానవతకు శత్రువులా ఉన్న నక్సలిజాన్ని రూపుమాపడంలో ఈ రోజు ఇద్దరు సాహసిక సైనికులను మనం కోల్పోయామని కేంద్ర మంత్రి అన్నారు. ఈ వీరులకు దేశ ప్రజలు సదా రుణపడి ఉంటారని ఆయన అన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు శ్రీ అమిత్ షా భావోద్వేగ భరిత సంతాపాన్ని వ్యక్తంచేశారు. 2026 మార్చి 31 కల్లా దేశంలో నుంచి నక్సలిజాన్ని పారదోలి, నక్సలిజం కారణంగా దేశంలో మరే పౌరుడు, పౌరురాలు వారి ప్రాణాల్ని పోగొట్టుకోకుండా చూస్తామని కూడా ఆయన పునరుద్ఘాటించారు.


(Release ID: 2101201) Visitor Counter : 24