ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మాధానం

“వికసిత భార‌త్ సంక‌ల్పాన్ని రాష్ట్రప‌తి ప్ర‌సంగం మ‌రింత బ‌లోపేతం చేసింది”;

“పేద‌ల వాస్త‌వ అభ్యున్న‌తే త‌ప్ప మేమేమీ బూట‌క‌పు నినాదాలివ్వ‌లేదు... స‌మాజంలోని అన్నివ‌ర్గాల ప్ర‌గ‌తి ల‌క్ష్యంగా మా ప్ర‌భుత్వం కృషి చేసింది”

“ప్ర‌జా సంక్షేమం కోసం వ‌న‌రుల స‌ద్వినియోగ‌మే మా ధ్యేయం”

“మ‌ధ్య త‌ర‌గ‌తి మా ప్ర‌భుత్వానికి గ‌ర్వ‌కార‌ణం.. మేం స‌దా వారికి మ‌ద్ద‌తిస్తాం”

“దేశ యువ‌శ‌క్తి మ‌న‌కెంతో గ‌ర్వ‌కార‌ణం... 2014 నుంచి యువ‌త‌పై నిశిత దృష్టితో వారి ఆకాంక్ష‌ల‌కు ప్రాధాన్య‌మిచ్చాం... నేడు ప్ర‌తి రంగంలో యువ‌త రాణిస్తోంది”

“ఆశావ‌హ భార‌త్‌ రూపకల్పనకు కృత్రిమ మేధ సామ‌ర్థ్యాన్ని వినియోగిస్తున్నాం”

“మ‌న రాజ్యాంగ విలువల బలోపేతానికి అకుంఠిత దీక్ష‌తో కృషి చేస్తున్నాం”

“దేశాభివృద్ధి అంటే యావత్‌ ప్రజానీకానికీ సేవ చేయ‌డ‌మే”

“మేం బలమైన.. ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవడంలో రాజ్యాంగ నిబద్ధ‌తే స్ఫూర్తి”

“ఎస్సీ.. ఎస్టీ... ఓబీసీ వ‌ర్గాల‌కు గరిష్ఠ అవకాశాల దిశగా మా ప్రభుత్వం కృషి చేసింది”

“పేద... అణగారిన వర్గాలపై శ్రద్ధతోపాటు ఐక్యతను బలోపేతం చేయ‌డం ఎలాగో మా ప్రభుత్వం చేతల్లో చూపింది”

“సంతృప్త స్

Posted On: 04 FEB 2025 9:13PM by PIB Hyderabad

  పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్‌సభలో సమాధానమిచ్చారుఈ సందర్భంగా నిన్ననేడు చర్చలో పాల్గొన్న గౌరవనీయ ఎంపీలందరికీ ఆయన అభినందనలు తెలిపారుప్రజాస్వామ్య సంప్రదాయంలో అవసరమైన మేర ప్రశంసలుప్రతికూల వ్యాఖ్యలు అత్యంత సహజమని అభివర్ణించారురాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం 14వ సారి లభించడం ప్రజలు తనకిచ్చిన గొప్ప గౌరవమనిదీనిపై వారికి వినమ్రంగా కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారుఅలాగే చర్చలో పాల్గొన్న వారంతా తమ అభిప్రాయాలతో ఈ ప్రక్రియను మరింత అర్థవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

   ప్రస్తుత 21వ శతాబ్దంలో దాదాపు నాలుగో వంతు 2025 నాటికి  పూర్తయిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుఈ నేపథ్యంలో స్వాతంత్ర్యానంతరం 20వ శతాబ్దంలోనూ, 21వ శతాబ్దం తొలి పాతికేళ్లలోనూ దేశం సాధించిన విజయాలను కాలమే తేటతెల్లం చేస్తుందని పేర్కొన్నారురాష్ట్రపతి ప్రసంగంపై వివరణాత్మక అధ్యయనం రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తు దిశగానే కాకుండా వికసిత భారత్‌ స్వప్న సాకారంపై సరికొత్త విశ్వాసం నింపుతుందని ఆయన స్పష్టం చేశారుఆ మేరకు వికసిత భారత్‌ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తూప్రజానీకంలో నవ్యోత్సాహం నింపడంతోపాటు ఎనలేని స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వెలిబుచ్చారు.

   డచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులైనట్లు అనేక అధ్యయనాలు వెల్లడించాయని ప్రధాని గుర్తు చేశారుపేదఅణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితభావంతోఅత్యంత అవగాహనతో ప్రభుత్వం వివిధ పథకాలను సమర్థంగా అమలు చేయడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారువివేచనగల వ్యక్తులువర్తమాన వాస్తవాలపై అవగాహన గలవారు క్షేత్రస్థాయిలో ప్రజల కోసం శ్రమిస్తే మార్పు అనివార్యమనిఅది కళ్లముందు కనిపిస్తుందని ఆయన స్పష్టం చేశారుఈ మేరకు “మా ప్రభుత్వం పేద‌ల వాస్త‌వ అభ్యున్న‌తికి కృషి చేసింది తప్ప ఎన్నడూ బూట‌క‌పు నినాదాలివ్వ‌లేదు” అని శ్రీ మోదీ అన్నారుపేదల వెతలపై సానుభూతితోమధ్యతరగతి ఆకాంక్షలపై అవగాహనతో స‌మాజంలోని అన్నివ‌ర్గాల ప్ర‌గ‌తి ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం శ్రమించిందనిఈ లక్షణాలు లోగడ కొందరిలో మృగ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

   వర్షాకాలంలో పూరిళ్లుపాకలలో నివసించడం ఎంతో దుర్భరమని గుర్తుచేస్తూప్రభుత్వం ఇప్పటిదాకా కోట్ల మంది పేదలను పక్కా ఇళ్ల యజమానులను చేసిందని ప్రధాని పేర్కొన్నారుబహిరంగ విసర్జన దుస్థితి నుంచి మహిళలకు విముక్తి దిశగా 12 కోట్లకుపైగా మరుగుదొడ్లను నిర్మించినట్లు తెలిపారుఅలాగే ‘ఇంటింటికీ నీరు’ పథకం కింది ప్రతి ఇంటికీ కొళాయి నీటి సరఫరాపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించిందని చెప్పారుస్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా దాదాపు 75 శాతం లేదా 16 కోట్లకుపైగా ఇళ్లకు కొళాయి కనెక్షన్‌ లేదని తెలిపారుఅయితేకేవలం గత ఐదేళ్లలో 12 కోట్ల కుటుంబాలకు కొళాయి కనెక్షన్‌ ఇచ్చామనిసంపూర్ణ లక్ష్యం దిశగా ఈ కార్యక్రమం వేగంగా సాగుతున్నదని వెల్లడించారుపేదల కోసం చేపట్టిన కార్యక్రమాలపై రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనను ఉటంకిస్తూసమస్యను గుర్తిస్తే సరిపోదనిశాశ్వత పరిష్కారం దిశగా అత్యంత అంకితభావంతో కృషి చేయడం అవశ్యమని శ్రీ మోదీ స్పష్టం చేశారుఆ మేరకు రాష్ట్రపతి ప్రసంగంలోనే కాకుండా గత 10 సంవత్సరాలుగా సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వ కృషిలో నిబద్ధత ప్రత్యక్షంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు.

   ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసల ప్రయోజనం మాత్రమే లభిస్తోందనే గతకాలపు పరిస్థితిని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేశారుఅయితేప్రజాధనాన్ని వారి సంక్షేమానికి మాత్రమే వినియోగించేలా “ఇటు పొదుపు-అటు ప్రగతి” (బచత్ భీ-వికాస్ భీతారకమంత్రంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారున్‌ధన్‌-ఆధార్-మొబైల్ (జామ్‌త్రయం ద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటివిధానానికి శ్రీకారం చుట్టిప్రజల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం దాదాపు 40 లక్షల కోట్లు జమ చేసిందని ఆయన పేర్కొన్నారుఅంతకుముందు వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 10 కోట్ల మంది అదృశ్య లబ్ధిదారులు ప్రయోజనం పొందేవారని ప్రధాని తెలిపారుఅయితేగత పదేళ్లలో సామాజిక న్యాయానికి భరోసా ఇస్తూ ఆ బెడదను నిర్మూలించిఅర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేశామని తెలిపారుతద్వారా అవినీతిపరుల బారినపడే సొమ్ము 3 లక్షల కోట్ల మేర ఆదా అయిందని చెప్పారుఇక ప్రభుత్వ కొనుగోళ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం విస్తృతంగా ఉపయోగిస్తున్నదని ప్రధాని గుర్తుచేశారుఈ మేరకు ప్రభుత్వ -మార్కెట్‌ ప్లేస్’ (జిఎంపోర్టల్ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారుఇప్పుడీ వేదికను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాడుకుంటున్నాయని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారుసంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఈ పోర్టల్ ద్వారా మరింత చౌకగా కొనుగోళ్లు చేయడం వల్ల ప్రభుత్వానికి 1,15,000 కోట్లు ఆదా అయినట్లు తెలిపారు.

   స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రారంభించినపుడు అందరూ హేళన చేశారనిఅనేకమంది దీన్నొక తప్పు లేదా పాపమన్నట్లు వ్యాఖ్యానించారని శ్రీ మోదీ గుర్తుచేశారుఎన్ని రకాల విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా పరిశుభ్రత కోసం అవిశ్రాంత కృషి కొనసాగిందని తెలిపారుదీంతో ఇటీవలి కాలంలో కార్యాలయాల్లో తొలగించిన తుక్కు విక్రయం ద్వారా ప్రభుత్వం ₹2,300 కోట్లు ఆర్జించిందని ఆయన సగర్వంగా పేర్కొన్నారుమహాత్మా గాంధీ ప్రబోధిత ధర్మకర్తృత్వ సూత్రాన్ని ప్రస్తావిస్తూతాము ప్రజల సంపదకు ధర్మకర్తలం మాత్రమేననిప్రతి పైసా ఆదాతోపాటు సద్వినియోగానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

   ఇంధనంలో ఇథనాల్ మిశ్రమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారుఈ విషయంలో భారత్‌ పరాధీనతను అంగీకరిస్తూమనం ఇప్పటికీ అంతర్జాతీయ వనరులపై ఆధారపడాల్సి వస్తున్నదని చెప్పారుఅయితేఇథనాల్ మిశ్రమ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల పెట్రోల్డీజిల్‌పై ఖర్చు తగ్గి, ₹1 లక్ష కోట్ల ఆదా అయిందని వెల్లడించారుఅంతేకాకుండా రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరిందనిఈ ₹లక్ష కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయని చెప్పారు.

   ప్రస్తుతం తాను పొదుపు గురించి మాట్లాడుతున్నప్పటికీఒకనాడు దేశంలోని వార్తాపత్రికలు రూ.లక్షల కోట్ల కుంభకోణాలపై పతాక శీర్షికలతో కథనాలు ప్రచురించేవని ప్రధాని గుర్తు చేశారుకానీపదేళ్లుగా ‘కుంభకోణం’ అనే మాట ఎన్నడూ వినిపించింది లేదని పేర్కొన్నారుఅంటేదేశానికి లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయనిఈ పొదుపు ప్రజాసేవకు మళ్లిందని వివరించారు.

   మొత్తంమీద ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అయిందని ప్రధాని పేర్కొన్నారుఅయితేఈ నిధులను అద్భుత రాజ భవనాల నిర్మాణం కోసం కాకుండా దేశ పురోగమనానికి పెట్టుబడిగా పెట్టామని శ్రీ మోదీ స్పష్టం చేశారుపదేళ్ల కిందట  మౌలిక సదుపాయాల బడ్జెట్ 1.8 లక్షల కోట్లు కాగాఇప్పుడు ₹11 లక్షల కోట్లకు పెరగడమే ఇందుకు తార్కాణమని చెప్పారువికసిత భారత్‌ రూపుదిద్దుకోవడంలో ఇది ఎంత బలమైన పునాది కాగలదో రాష్ట్రపతి తన ప్రసంగంలో కూడా వివరించారని పేర్కొన్నారుజాతీయ రహదారులురైల్వేలుగ్రామీణ రోడ్లు వంటి రంగాల అభివృద్ధికి ఈ పెట్టుబడులతో బలమైన పునాదులు పడ్డాయని ప్రధానమంత్రి వివరించారు.

భారత్‌లో పారిశుధ్యం-మరుగుదొడ్ల సౌలభ్యంగల కుటుంబాలకు ఏటా సుమారు ₹70,000 దాకా ఆదా చేస్తున్నట్లు ‘యునిసెఫ్‌’ అంచనాలు పేర్కొనడాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్, మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్ర తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలతో సామాన్య కుటుంబాలకు ఒనగూడిన ప్రయోజనాలను విశదీకరించారు.
   ముఖ్యంగా ‘కొళాయి ద్వారా నీరు’ (నల్‌ సే జల్‌) పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్ర నీటి లభ్యత వల్ల ఇతరత్రా వైద్య ఖర్చుల రూపేణా సామాన్య కుటుంబీకులకు ఏటా సగటున ₹40,000 వరకూ ఆదా అయినట్లు తన నివేదికలో పేర్కొన్నదని ప్రధానమంత్రి తెలిపారు. సాధారణ పౌరుల ఖర్చులు తగ్గించడంలో ఇలాంటి అనేక పథకాలు దోహదం చేశాయని చెప్పారు.

   దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులకు ఉచిత ధాన్యం పంపిణీతో పేద కుటుంబాల్లో గణనీయ పొదుపు సాధ్యమైందని శ్రీ మోదీ తెలిపారు. అలాగే ‘ప్రధానమంత్రి సూర్య ఉచిత గృహవిద్యుత్ పథకం’ ద్వారా ఏటా సగటున ₹25,000 నుంచి ₹30,000 వరకు విద్యుత్‌ బిల్లు రూపేణా ఆదా అయిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం తోడ్పాటుతో తమ ఇళ్లపై ఉత్పత్తయిన అదనపు విద్యుత్తు విక్రయం ద్వారా సామాన్య కుటుంబాలకు ఆదాయం కూడా సమకూరుతుందని వివరించారు. ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో సామాన్య కుటుంబాలకు ఖర్చులు తగ్గి, గణనీయ పొదుపు సాధ్యమవుతున్నదని ప్రధాని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ‘ఎల్‌ఈడీ’ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ- తాము అధికారంలోకి రాకముందు వాటి ధర ₹400 దాకా ఉండేదని, ఆ తర్వాత ₹40 స్థాయికి దిగివచ్చిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు పేదల జీవితాలు మరింత కాంతిమంతం అయ్యాయని అభివర్ణించారు. ఈ విధంగా ప్రజలకు ₹20,000 కోట్ల మేర ఆదా అయిందన్నారు. వ్యవసాయం విషయానికొస్తే- భూసార కార్డుల శాస్త్రీయ వినియోగంతో రైతులు కూడా గణనీయ ప్రయోజనం పొందారని, ఎకరాకు సగటును ₹30,000 ఆదా అయిందని వివరించారు.

   మధ్య తరగతికి ఆదాయపు పన్ను భారం తగ్గడాన్ని ప్రస్తావిస్తూ- గత పదేళ్లలో ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించడంవల్ల పొదుపు కూడా పెరిగిందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు 2013-14నాటికి పన్ను మినహాయింపు కేవలం ₹2 లక్షలకు పరిమితం కాగా, నేడు ₹12 లక్షల వార్షికాదాయంపై పూర్తి మినహాయింపు లభిస్తున్నదని వివరించారు. అలాగే 2014, 2017, 2019, 2023 సంవత్సరాల్లో వేతన జీవులకు పన్ను ఉపశమనం దిశగా ప్రభుత్వం తన కృషిని కొనసాగించిందని చెప్పారు. తదనుగుణంగా ఇప్పుడు ప్రామాణిక మినహాయింపు పరిమితిని ₹75,000కు పెంచడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వారికి ₹12.75 లక్షల దాకా ఆదాయంపై ఎలాంటి పన్ను భారం ఉండదని ప్రధాని పేర్కొన్నారు.

   గత ప్రభుత్వాల హయాంలో చర్చలు వాస్తవాలకు దూరంగా వాగాడంబరానికి పరిమితంగా ఉండేవని ప్రధానమంత్రి విమర్శించారు. ఆనాడు దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్తామని ఊదరగొట్టిన నాయకులు చివరకు 20వ శతాబ్దపు అవసరాలను కూడా తీర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. దేశంలో దశాబ్దాల కిందటే వినియోగంలోకి రావాల్సిన అనేక ప్రాజెక్టులు విపరీత జాప్యం ఫలితంగా 40-50 ఏళ్లు ఆలస్యం కావడంపై ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ప్రజలు 2014లో తమకు సేవచేసే అవకాశం ఇచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం యువతపై నిశితంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. యువతరం ఆకాంక్షలకు ప్రాధాన్యమిస్తూ వారికి అనేక అవకాశాలను చేరువ చేసిందని శ్రీ మోదీ అన్నారు. అందుకే వారిప్పుడు తమ ప్రతిభాపాటవాలను సగర్వంగా ప్రదర్శిస్తూ విజయపథంలో సాగుతున్నారని తెలిపారు. అంతరిక్ష, రక్షణ రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం సహా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభం గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహం లక్ష్యంగా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ‘స్టార్టప్ ఇండియా’ వ్యవస్థను సంపూర్ణంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో ₹12 లక్షల దాకా వార్షికాదాయంపై పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించడం ఓ కీలక నిర్ణయమని, దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వెల్లువెత్తిందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. దేశంపై సానుకూల ప్రభావం, దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా అణుశక్తి రంగంలోనూ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.

   కృత్రిమ మేధ (ఎఐ), త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతల ప్రాధాన్యాన్ని ప్రధాని స్పష్టం చేశారు. ముఖ్యంగా గేమింగ్ రంగంలో ప్రభుత్వ కృషిని వివరిస్తూ- ఈ రంగంలో ఇప్పటికే ఎంతో ముందంజ వేసిన నేపథ్యంలో భారత్‌ను ప్రపంచ సృజనాత్మక గేమింగ్‌ రాజధానిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని శ్రీ మోదీ యువతకు పిలుపునిచ్చారు. తన దృష్టిలో ‘ఎఐ’ అంటే కేవలం కృత్రిమ మేధ కాదని, ‘ఆకాంక్షాత్మక భారత్‌’ కూడా అని ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 10,000 అటల్ టింకరింగ్ లేబొరేటరీలను ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ- విద్యార్థులు ఇక్కడ రోబోటిక్స్ లో తమ సృజనాత్మకతను చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో మరో 50,000 లేబొరేటరీల ఏర్పాటుకు ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు. భారత ‘ఎఐ’ మిషన్ ప్రపంచవ్యాప్తంగా ఆశావాహ వాతావరణం సృష్టించడంతోపాటు అంతర్జాతీయ ‘ఎఐ’ వేదికపై భారత్‌ గణనీయ స్థానంలో నిలిచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

   ఈ నేపథ్యంలో ‘డీప్ టెక్’ రంగంలోనూ పెట్టుబడులను ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ 21వ శతాబ్దం సాంకేతిక పరిజ్ఞానాధారితం కాబట్టి, ప్రగతిపథంలో వేగం పుంజుకోవాలంటే ‘డీప్ టెక్’ రంగంలో త్వరగా ముందంజ వేయడం అత్యావశ్యకమని స్పష్టం చేశారు. దేశ యువతరం భవిష్యత్తు లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుండగా, కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికల వేళ నిరుద్యోగ భత్యం వంటి హామీలు ఇస్తున్నాయని ఆరోపించారు. చివరకు ఆ హామీలను నెరవేర్చకుండా యువతను మోసగిస్తూ వారి భవితకు ముప్పుగా మారాయని విమర్శించారు.

   ఈ నేపథ్యంలో హర్యానాలో ఇటీవలి పరిణామాలను ప్రధాని ప్రస్తావించారు. ఎలాంటి ఖర్చులు దళారీల బెడద లేకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని యువతకు తామిచ్చిన హామీని గుర్తుచేశారు. తదనుగుణంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడగానే ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని, తమ నిబద్ధతకు ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. హర్యానాలో వరుసగా మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించడంపై హర్షం వెలిబుచ్చుతూ, ఇది రాష్ట్ర చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.  అదేవిధంగా మహారాష్ట్రలోనూ  చారిత్రక ఫలితాలు రావడాన్ని ప్రధాని ప్రస్తావించారు. అధికార పార్టీ అత్యధిక శాసనసభ స్థానాలను గెలుచుకున్నదని, ఇది ప్రజల ఆశీర్వాద ఫలితమేనని పేర్కొన్నారు.

   రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగం ఈ అంశాన్ని విస్తృతంగా ప్రస్తావించిందని ప్రధాని ఉటంకించారు. రాజ్యాంగ నిర్దేశాలకు కట్టుబాటుతోపాటు దాని స్ఫూర్తిని కొనసాగించడం అవశ్యమని, దీన్ని తాము ఆచరించి చూపామని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలను గవర్నర్లు తమ ప్రసంగంలో ప్రస్తావించే రీతిలోనే రాష్ట్రపతి కూడా గత సంవత్సర ప్రభుత్వ కార్యకలాపాలను వివరించడం ఒక సంప్రదాయమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్యాంగ స్వర్ణోత్సవం (50వ వార్షికోత్సవం) సందర్భంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యాల వాస్తవ స్ఫూర్తిని చాటుతూ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. అందులో భాగంగా గత 50 ఏళ్లుగా శాసనసభల్లో గవర్నర్ల ప్రసంగాలన్నింటినీ ఓ పుస్తకంగా రూపొందించాలని తాను కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అది నేడు అన్ని గ్రంథాలయాలలో అందుబాటులో ఉందని వెల్లడించారు. ఈ ప్రసంగాల ప్రచురణను ఆనాటి తమ ప్రభుత్వ యంత్రాంగం గర్వకారణంగా భావించిందని పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడం, దానికి అనుగుణంగా నడచుకోవడం, అంకిత భావం ప్రదర్శించడంలోని ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టం చేశారు.

   తమ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన సందర్భంలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ అంటూ లేదన్నారు. ఏ రాజకీయ పార్టీకీ అందుకు తగినన్ని స్థానాలు దక్కలేదని గుర్తుచేశారు. పరిపాలనలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు అనేక చట్టాలు వీలు కల్పిస్తున్నా విపక్షమనేదే లేనందువల్ల తమ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు లభించిందని ప్రధాని చెప్పారు. అయినప్పటికీ తాము రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నడచుకున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన ప్రతిపక్షం లేకపోయినా, అతిపెద్ద పార్టీ నాయకుడికి ఆహ్వానం ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య ఆవశ్యకతపై తమ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. దేశ ప్రధానమంత్రులు లోగడ స్వతంత్రంగా ఫైళ్లను నిర్వహించేవారని, తన పాలన ప్రక్రియలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకూ అవకాశం కల్పించామని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. తదనుగుణంగా వారి భాగస్వామ్యానికి వీలు కల్పిస్తూ చట్టాలను కూడా రూపొందించామని తెలిపారు. ఎన్నికల సంఘం ఏర్పాటు నిర్ణయ ప్రక్రియలోనూ ప్రతిపక్ష నాయకుడు భాగస్వామిగా ఉంటారని, రాజ్యాంగానుసారం నడచుకోవడంలో తమ నిబద్ధతకు ఇది తార్కాణమని చెప్పారు.

ఢిల్లీలోని అనేక ప్రదేశాలలో కుటుంబాలు సృష్టించిన ప్రైవేట్ మ్యూజియంలు ఉన్నాయని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ- ప్రభుత్వ నిధుల వినియోగంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ అనుసరణకు కట్టుబాటు చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తనకు ముందున్న వారు సహా అందరు ప్రధానమంత్రుల జీవిత విశేషాలను, దేశం కోసం వారి కృషిని ప్రదర్శించే ప్రధానమంత్రుల మ్యూజియం ఏర్పాటు చేశామని వివరించారు. ఈ మ్యూజియంలో ప్రదర్శితమవుతున్న గొప్ప నాయకులకు చెందిన కుటుంబాలు దీన్ని సందర్శించాలని కోరారు. ఈ ప్రదర్శనశాలను యువతరానికి స్ఫూర్తినిచ్చేలా మరింత చక్కగా తీర్చిదిద్దడానికి సూచనలు, సలహాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి జీవితం వారు జీవించడం సర్వసాధారణమైనా, రాజ్యాంగబద్ధంగా నడచుకోవడం అత్యున్నత ఆదర్శమని స్పష్టం చేశారు.
   “అధికారాన్ని సేవ కోసం వినియోగిస్తే అది దేశ ప్రగతికి తోడ్పడుతుంది. కానీ, అధికారం వారసత్వంగా మారితే అది ప్రజలపాలిట విధ్వంసకారిగా మారుతుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి తాము రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటామని, విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడబోమని స్పష్టం చేశారు. జాతీయ సమైక్యత ప్రాధాన్యాన్ని వివరిస్తూ- రాజ్యాంగ స్ఫూర్తిపై నిబద్ధత తమ కార్యాచరణకు మూలమని చెప్పారు. అందుకే ‘సమైక్యతా ప్రతిమ’ (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) పేరిట ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ విగ్రహాన్ని రూపొందించామని ప్రధాని గుర్తుచేశారు.

దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే అర్బన్ నక్సల్స్ భాషను కొందరు బాహాటంగా ఉపయోగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ మోదీ... ఈ భాషను మాట్లాడేవారుభారత దేశాన్ని సవాలు చేసేవారు రాజ్యాంగాన్ని గానీదేశ సమైక్యతను గానీ అర్థం చేసుకోలేరని అన్నారు.

ఏడు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లడఖ్ రాజ్యాంగ హక్కులను కోల్పోయాయనిఇది రాజ్యాంగానికిజమ్మూ కాశ్మీర్లద్దాఖ్ ప్రజలకు జరిగిన అన్యాయమని ప్రధాని పేర్కొన్నారుఆర్టికల్ 370ని రద్దు చేయడంతోఈ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు దేశంలోని ఇతర పౌరులతో సమానమైన హక్కులను పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారురాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని జీవిస్తున్నారనిఅందుకే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

రాజ్యాంగం ఏ విధంగానూ వివక్షను అనుమతించదని స్పష్టం చేస్తూపక్షపాత మనస్తత్వంతో జీవించే వారిని శ్రీ మోదీ విమర్శించారుముస్లిం మహిళలపై విధించిన ఆంక్షలను ప్రస్తావిస్తూట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ముస్లిం ఆడపిల్లలకు సరైన సమానత్వం కల్పించామని ప్రధానమంత్రి తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా ముందుచూపుతో పనిచేసినట్లు ఆయన చెప్పారునిరాశనిస్పృహలతో కొందరు ఉపయోగిస్తున్న ద్రోహపూరిత భాషపై ఆందోళన వ్యక్తం చేశారుమహాత్మాగాంధీ కలలుగన్న విధంగా తమ దృష్టి ఎప్పుడూ వెనుకబడిన వారిపైనే ఉందని ఆయన పేర్కొన్నారుఅటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలకుగిరిజన వ్యవహారాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయడం సమ్మిళిత అభివృద్ధి పట్ల వారి నిబద్ధతను చాటిచెప్పిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

భారతదేశ దక్షిణ, తూర్పు తీర రాష్ట్రాలలో మత్స్యకార జనాభా అధికంగా ఉందనిసమాజాలను కలిగి ఉన్నాయనిచిన్న నీటి వనరుల ప్రాంతాలతో ఉన్న వారితో సహా ఈ వర్గాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన ప్రాముఖ్యతను గుర్తించి మత్స్యకారుల అవసరాలను తీర్చేందుకువారి జీవనోపాధి కోసం ప్రత్యేకంగా మత్స్యకారుల మంత్రిత్వ శాఖను సృష్టించిన ప్రభుత్వం తమదేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సమాజంలోని అట్టడుగు వర్గాల్లో ఉన్న సామర్ధ్యాలను ప్రస్తావిస్తూ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారాకొత్త అవకాశాలను సృష్టించవచ్చనిఇది వారి ఆకాంక్షలకు జీవం పోస్తుందని ప్రధాని అన్నారుఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారుఅత్యంత సాధారణ పౌరులకు కూడా అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్య ప్రాథమిక కర్తవ్యమని స్పష్టం చేశారుకోట్లాది మంది ప్రజలను కలిపే భారతదేశ సహకార రంగాన్ని ప్రోత్సహించడానికిబలోపేతం చేయడానికి ప్రభుత్వం సహకార సంఘాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందనిఇది తమ దార్శనికతకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.

కులం గురించి చర్చించడం కొందరికి ఒక ఫ్యాషన్ గా మారిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత 30-35 ఏళ్లుగా వివిధ పార్టీలకు చెందిన ఓబీసీ ఎంపీలు ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారనిఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చిన ప్రభుత్వం తమదేనని ఆయన వెల్లడించారుప్రస్తుతం వెనుకబడిన తరగతుల కమిషన్ ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలో భాగమైందని ఆయన పేర్కొన్నారుప్రతి రంగంలోనూ ఎస్సీఎస్టీఓబీసీ వర్గాలకు గరిష్ఠ అవకాశాలు కల్పించేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారుఒకే ఎస్సీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఒకేసారి పార్లమెంటులో పనిచేసిన సందర్భం లేదా ఒకే ఎస్టీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఒకేసారి పనిచేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారుకొంతమంది వ్యక్తుల మాటలకుచేతలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. , ఇది వారి వాగ్దానాలకువాస్తవానికి మధ్య చాలా అంతరాన్ని సూచిస్తుందని అన్నారు.

ఎస్సీఎస్టీ వర్గాల సాధికారత అవసరమనిసామాజిక ఉద్రిక్తతలు సృష్టించకుండా ఐక్యతను కాపాడుకోవడం ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు. 2014కు ముందు దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉండేవనిప్రస్తుతం ఆ సంఖ్య 780కి పెరగడంతో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 2014కు ముందు ఎస్సీ విద్యార్థులకు 7,700 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవన్నారుపది సంవత్సరాల శ్రమ ఫలితంగాఆ సంఖ్య 17,000కి పెరిగిందిఇది దళిత సమాజం నుంచి వైద్యులు కావడానికి భారీగా అవకాశాలను పెంచిందిఎలాంటి సామాజిక ఉద్రిక్తతలను సృష్టించకుండాపరస్పర గౌరవాన్ని కాపాడుతూ దీనిని సాధించినట్టు చెప్పారు. 2014కు ముందు ఎస్టీ విద్యార్థులకు 3,800 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవనిప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు వేలకు పెరిగిందని చెప్పారు. 2014కు ముందు ఓబీసీ విద్యార్థులకు 14 వేల కంటే తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉండేవనినేడుఈ సంఖ్య సుమారుగా పెరిగి, 32,000 మంది ఒబిసి విద్యార్థులు డాక్టర్లు కావడానికి వీలు కల్పించిందని చెప్పారుగత పదేళ్లుగా ప్రతి వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామనిప్రతిరోజూ ఒక కొత్త ఐటీఐని ప్రారంభించామనిప్రతి రెండు రోజులకు ఒక కొత్త కళాశాలను ప్రారంభించామని ప్రధాని వివరించారుఇప్పుడు ఎస్సీఎస్టీఓబీసీ యువతకు అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు.

ఏ ఒక్క లబ్దిదారునీ కూడా విడవకుండా అన్ని పథకాల ప్రయోజనాలను నూటికి నూరు మందికీ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రయోజనాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని పొందాలనిఅవి కొందరికే పరిమతమనే కాలం చెల్లిపోయిందని ఆయన పేర్కొన్నారు.

బుజ్జగింపు రాజకీయాలను ప్రధాన మంత్రి దుయ్యబట్టారుఅభివృద్ధి చెందిన భారతదేశం కోసంబుజ్జగింపు నుండి సంతృప్తి మార్గంలోకి వెళ్లాలని పేర్కొన్నారుసమాజంలోని ప్రతి వర్గానికి ఎలాంటి వివక్ష లేకుండా న్యాయం జరగాలని ఆయన ఉద్ఘాటించారు. 100 శాతం సంతృప్తతను సాధించడం అంటే నిజమైన సామాజిక న్యాయంలౌకికవాదంరాజ్యాంగం పట్ల గౌరవం అని స్పష్టం చేశారు.

అందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే రాజ్యాంగ స్ఫూర్తి అని అంటూఈ రోజు క్యాన్సర్ దినోత్సవం గురించి ప్రస్తావించారుఆరోగ్యం గురించి దేశవ్యాప్తంగాప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోందని అన్నారురాజకీయ స్వార్థంతో కొందరు వ్యక్తులు పేదలువృద్ధులకు వైద్య సేవలు అందించేందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారుప్రత్యేక ప్రైవేటు ఆసుపత్రులతో సహా 30,000 ఆసుపత్రులను ఆయుష్మాన్ భారత్ పథకానికి అనుసంధానమై ఆయుష్మాన్ భారత్ కార్డుదారులకు ఉచిత చికిత్సను అందిస్తున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారుఅయితేకొన్ని రాజకీయ పార్టీలు తమ సంకుచిత దృక్పథంతప్పుడు విధానాల కారణంగా ఈ ఆసుపత్రుల ద్వారాలను పేదలకు మూసివేయడంతో క్యాన్సర్ రోగులు ప్రభావితులయ్యారని పేర్కొన్నారుఆయుష్మాన్ పథకం కింద సకాలంలో క్యాన్సర్ చికిత్స ప్రారంభమైందని పబ్లిక్ హెల్త్ జర్నల్ ‘లాన్సెట్’ ఇటీవల చేసిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. క్యాన్సర్ స్క్రీనింగ్ చికిత్సలో ప్రభుత్వ నిబద్ధతను శ్రీ మోదీ పేర్కొన్నారుప్రారంభ రోగ నిర్ధారణచికిత్స క్యాన్సర్ రోగులను రక్షించగలదని అన్నారుఆయుష్మాన్ పథకాన్ని లాన్సెట్ ప్రశంసించిందిభారతదేశంలో ఈ దిశలో గణనీయమైన పురోగతిని గుర్తించింది.

క్యాన్సర్ మందులను మరింత చౌకగా అందించడానికి ఈ బడ్జెట్ లో తీసుకున్న ముఖ్యమైన చర్యను ప్రముఖంగా పేర్కొన్న శ్రీ మోదీ... ముఖ్యంగా క్యాన్సర్ దినోత్సవం రోజున ఇది క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూర్చే ఒక ముఖ్యమైన నిర్ణయం అని పేర్కొన్నారుగౌరవ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లోని రోగులు ఈ ప్రయోజనాన్ని వినియోగించుకునేలా చూడాలని ఆయన కోరారుపరిమిత సంఖ్యలో ఆస్పత్రులు ఉండటం వల్ల రోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి 200 డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారుఈ కేంద్రాలు రోగులకువారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.

రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా విదేశాంగ విధానంపై జరిగిన చర్చలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, కొందరు వ్యక్తులు విదేశాంగ విధానంపై పరిణతి ఉన్నట్టు అవి దేశ ప్రయోజనాలకు హాని కలిగించేవైనా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు కనబడిందని ప్రధాని వ్యాఖ్యానించారువిదేశీ విధానంపై నిజంగా ఆసక్తి ఉన్నవారు ప్రఖ్యాత విదేశాంగ విధాన పండితుడు రాసిన "జెఎఫ్ కె ఫర్గాటెన్ క్రైసిస్పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారుభారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూఅప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీల మధ్య క్లిష్ట సమయాల్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలుచర్చలను ఈ పుస్తకంలో వివరించారు.

నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అయిన రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆమె పట్ల చూపిన అగౌరవం పట్ల ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ నైరాశ్యం అర్థమవుతుందనిఅయితే రాష్ట్రపతి పట్ల ఇంత అగౌరవం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారుతిరోగమన మనస్తత్వాలను వదిలి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మంత్రాన్ని స్వీకరించడం ద్వారా భారతదేశం ముందుకు వెళ్తోందని పేర్కొన్న శ్రీ మోదీజనాభాలో సగం ఉన్న మహిళలకు పూర్తి అవకాశాలు కల్పిస్తేభారతదేశం రెట్టింపు వేగంతో పురోగతి సాధిస్తుందని స్పష్టం చేశారుఈ రంగంలో 25 ఏళ్లు పనిచేసిన తర్వాతనే తన ఆత్మవిశ్వాసం మరింత దృఢపడిందని అన్నారుగడచిన పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలుప్రధానంగా అట్టడుగుగ్రామీణ నేపథ్యం నుంచి స్వయం సహాయక సంఘాల్లో చేరారని ప్రధాని చెప్పారుఈ మహిళల సామర్థ్యాలు పెరిగాయివారి సామాజిక స్థితి మెరుగుపడిందివారి పనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం వారి సహాయాన్ని రూ.20 లక్షల వరకు పెంచిందిఈ ప్రయత్నాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారురాష్ట్రపతి ప్రసంగంలో లక్‌పతి దీదీ పథకం ప్రస్తావనపై ప్రధానమంత్రి మాట్లాడుతూ.. మూడోసారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 50 లక్షలకు పైగా లక్‌పతి దీదీలు నమోదయ్యారని పేర్కొన్నారుఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.25 కోట్ల మంది మహిళలు లక్‌పతి దీదీలుగా మారారనిఆర్థిక అంశాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల ద్వారా మూడు కోట్ల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా తయారు చేయడమే లక్ష్యమని అన్నారునమో డ్రోన్ దీదీలుగా పిలిచే మహిళలు డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారుఆయా గ్రామాల్లో వచ్చిన గణనీయమైన మానసిక మార్పును ఆయన ప్రస్తావించారుఈ డ్రోన్ దీదీలు పొలాల్లో పనిచేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారుమహిళా సాధికారతలో ముద్రా యోజన పాత్రను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారుదీని ద్వారా కోట్లాది మంది మహిళలు మొదటిసారిగా పారిశ్రామిక రంగంలోకి వెళ్లి పారిశ్రామికవేత్తల పాత్రలను పోషిస్తున్నారు.

 భారత్‌లో పారిశుధ్యం-మరుగుదొడ్ల సౌలభ్యంగల కుటుంబాలకు ఏటా సుమారు ₹70,000 దాకా ఆదా చేస్తున్నట్లు ‘యునిసెఫ్‌’ అంచనాలు పేర్కొనడాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్, మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్ర తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలతో సామాన్య కుటుంబాలకు ఒనగూడిన ప్రయోజనాలను విశదీకరించారు.
   ముఖ్యంగా ‘కొళాయి ద్వారా నీరు’ (నల్‌ సే జల్‌) పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్ర నీటి లభ్యత వల్ల ఇతరత్రా వైద్య ఖర్చుల రూపేణా సామాన్య కుటుంబీకులకు ఏటా సగటున ₹40,000 వరకూ ఆదా అయినట్లు తన నివేదికలో పేర్కొన్నదని ప్రధానమంత్రి తెలిపారు. సాధారణ పౌరుల ఖర్చులు తగ్గించడంలో ఇలాంటి అనేక పథకాలు దోహదం చేశాయని చెప్పారు.
   దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులకు ఉచిత ధాన్యం పంపిణీతో పేద కుటుంబాల్లో గణనీయ పొదుపు సాధ్యమైందని శ్రీ మోదీ తెలిపారు. అలాగే ‘ప్రధానమంత్రి సూర్య ఉచిత గృహవిద్యుత్ పథకం’ ద్వారా ఏటా సగటున ₹25,000 నుంచి ₹30,000 వరకు విద్యుత్‌ బిల్లు రూపేణా ఆదా అయిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం తోడ్పాటుతో తమ ఇళ్లపై ఉత్పత్తయిన అదనపు విద్యుత్తు విక్రయం ద్వారా సామాన్య కుటుంబాలకు ఆదాయం కూడా సమకూరుతుందని వివరించారు. ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో సామాన్య కుటుంబాలకు ఖర్చులు తగ్గి, గణనీయ పొదుపు సాధ్యమవుతున్నదని ప్రధాని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ‘ఎల్‌ఈడీ’ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ- తాము అధికారంలోకి రాకముందు వాటి ధర ₹400 దాకా ఉండేదని, ఆ తర్వాత ₹40 స్థాయికి దిగివచ్చిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు పేదల జీవితాలు మరింత కాంతిమంతం అయ్యాయని అభివర్ణించారు. ఈ విధంగా ప్రజలకు ₹20,000 కోట్ల మేర ఆదా అయిందన్నారు. వ్యవసాయం విషయానికొస్తే- భూసార కార్డుల శాస్త్రీయ వినియోగంతో రైతులు కూడా గణనీయ ప్రయోజనం పొందారని, ఎకరాకు సగటును ₹30,000 ఆదా అయిందని వివరించారు.
   మధ్య తరగతికి ఆదాయపు పన్ను భారం తగ్గడాన్ని ప్రస్తావిస్తూ- గత పదేళ్లలో ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించడంవల్ల పొదుపు కూడా పెరిగిందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు 2013-14నాటికి పన్ను మినహాయింపు కేవలం ₹2 లక్షలకు పరిమితం కాగా, నేడు ₹12 లక్షల వార్షికాదాయంపై పూర్తి మినహాయింపు లభిస్తున్నదని వివరించారు. అలాగే 2014, 2017, 2019, 2023 సంవత్సరాల్లో వేతన జీవులకు పన్ను ఉపశమనం దిశగా ప్రభుత్వం తన కృషిని కొనసాగించిందని చెప్పారు. తదనుగుణంగా ఇప్పుడు ప్రామాణిక మినహాయింపు పరిమితిని ₹75,000కు పెంచడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వారికి ₹12.75 లక్షల దాకా ఆదాయంపై ఎలాంటి పన్ను భారం ఉండదని ప్రధాని పేర్కొన్నారు.
   గత ప్రభుత్వాల హయాంలో చర్చలు వాస్తవాలకు దూరంగా వాగాడంబరానికి పరిమితంగా ఉండేవని ప్రధానమంత్రి విమర్శించారు. ఆనాడు దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్తామని ఊదరగొట్టిన నాయకులు చివరకు 20వ శతాబ్దపు అవసరాలను కూడా తీర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. దేశంలో దశాబ్దాల కిందటే వినియోగంలోకి రావాల్సిన అనేక ప్రాజెక్టులు విపరీత జాప్యం ఫలితంగా 40-50 ఏళ్లు ఆలస్యం కావడంపై ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ప్రజలు 2014లో తమకు సేవచేసే అవకాశం ఇచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం యువతపై నిశితంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. యువతరం ఆకాంక్షలకు ప్రాధాన్యమిస్తూ వారికి అనేక అవకాశాలను చేరువ చేసిందని శ్రీ మోదీ అన్నారు. అందుకే వారిప్పుడు తమ ప్రతిభాపాటవాలను సగర్వంగా ప్రదర్శిస్తూ విజయపథంలో సాగుతున్నారని తెలిపారు. అంతరిక్ష, రక్షణ రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం సహా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభం గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహం లక్ష్యంగా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ‘స్టార్టప్ ఇండియా’ వ్యవస్థను సంపూర్ణంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో ₹12 లక్షల దాకా వార్షికాదాయంపై పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించడం ఓ కీలక నిర్ణయమని, దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వెల్లువెత్తిందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. దేశంపై సానుకూల ప్రభావం, దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా అణుశక్తి రంగంలోనూ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.
   కృత్రిమ మేధ (ఎఐ), త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతల ప్రాధాన్యాన్ని ప్రధాని స్పష్టం చేశారు. ముఖ్యంగా గేమింగ్ రంగంలో ప్రభుత్వ కృషిని వివరిస్తూ- ఈ రంగంలో ఇప్పటికే ఎంతో ముందంజ వేసిన నేపథ్యంలో భారత్‌ను ప్రపంచ సృజనాత్మక గేమింగ్‌ రాజధానిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని శ్రీ మోదీ యువతకు పిలుపునిచ్చారు. తన దృష్టిలో ‘ఎఐ’ అంటే కేవలం కృత్రిమ మేధ కాదని, ‘ఆకాంక్షాత్మక భారత్‌’ కూడా అని ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 10,000 అటల్ టింకరింగ్ లేబొరేటరీలను ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ- విద్యార్థులు ఇక్కడ రోబోటిక్స్ లో తమ సృజనాత్మకతను చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో మరో 50,000 లేబొరేటరీల ఏర్పాటుకు ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు. భారత ‘ఎఐ’ మిషన్ ప్రపంచవ్యాప్తంగా ఆశావాహ వాతావరణం సృష్టించడంతోపాటు అంతర్జాతీయ ‘ఎఐ’ వేదికపై భారత్‌ గణనీయ స్థానంలో నిలిచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
   ఈ నేపథ్యంలో ‘డీప్ టెక్’ రంగంలోనూ పెట్టుబడులను ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ 21వ శతాబ్దం సాంకేతిక పరిజ్ఞానాధారితం కాబట్టి, ప్రగతిపథంలో వేగం పుంజుకోవాలంటే ‘డీప్ టెక్’ రంగంలో త్వరగా ముందంజ వేయడం అత్యావశ్యకమని స్పష్టం చేశారు. దేశ యువతరం భవిష్యత్తు లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుండగా, కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికల వేళ నిరుద్యోగ భత్యం వంటి హామీలు ఇస్తున్నాయని ఆరోపించారు. చివరకు ఆ హామీలను నెరవేర్చకుండా యువతను మోసగిస్తూ వారి భవితకు ముప్పుగా మారాయని విమర్శించారు.
   ఈ నేపథ్యంలో హర్యానాలో ఇటీవలి పరిణామాలను ప్రధాని ప్రస్తావించారు. ఎలాంటి ఖర్చులు దళారీల బెడద లేకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని యువతకు తామిచ్చిన హామీని గుర్తుచేశారు. తదనుగుణంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడగానే ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని, తమ నిబద్ధతకు ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. హర్యానాలో వరుసగా మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించడంపై హర్షం వెలిబుచ్చుతూ, ఇది రాష్ట్ర చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.  అదేవిధంగా మహారాష్ట్రలోనూ  చారిత్రక ఫలితాలు రావడాన్ని ప్రధాని ప్రస్తావించారు. అధికార పార్టీ అత్యధిక శాసనసభ స్థానాలను గెలుచుకున్నదని, ఇది ప్రజల ఆశీర్వాద ఫలితమేనని పేర్కొన్నారు.
   రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగం ఈ అంశాన్ని విస్తృతంగా ప్రస్తావించిందని ప్రధాని ఉటంకించారు. రాజ్యాంగ నిర్దేశాలకు కట్టుబాటుతోపాటు దాని స్ఫూర్తిని కొనసాగించడం అవశ్యమని, దీన్ని తాము ఆచరించి చూపామని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలను గవర్నర్లు తమ ప్రసంగంలో ప్రస్తావించే రీతిలోనే రాష్ట్రపతి కూడా గత సంవత్సర ప్రభుత్వ కార్యకలాపాలను వివరించడం ఒక సంప్రదాయమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్యాంగ స్వర్ణోత్సవం (50వ వార్షికోత్సవం) సందర్భంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యాల వాస్తవ స్ఫూర్తిని చాటుతూ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. అందులో భాగంగా గత 50 ఏళ్లుగా శాసనసభల్లో గవర్నర్ల ప్రసంగాలన్నింటినీ ఓ పుస్తకంగా రూపొందించాలని తాను కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అది నేడు అన్ని గ్రంథాలయాలలో అందుబాటులో ఉందని వెల్లడించారు. ఈ ప్రసంగాల ప్రచురణను ఆనాటి తమ ప్రభుత్వ యంత్రాంగం గర్వకారణంగా భావించిందని పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడం, దానికి అనుగుణంగా నడచుకోవడం, అంకిత భావం ప్రదర్శించడంలోని ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టం చేశారు.
   తమ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన సందర్భంలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ అంటూ లేదన్నారు. ఏ రాజకీయ పార్టీకీ అందుకు తగినన్ని స్థానాలు దక్కలేదని గుర్తుచేశారు. పరిపాలనలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు అనేక చట్టాలు వీలు కల్పిస్తున్నా విపక్షమనేదే లేనందువల్ల తమ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు లభించిందని ప్రధాని చెప్పారు. అయినప్పటికీ తాము రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నడచుకున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన ప్రతిపక్షం లేకపోయినా, అతిపెద్ద పార్టీ నాయకుడికి ఆహ్వానం ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య ఆవశ్యకతపై తమ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. దేశ ప్రధానమంత్రులు లోగడ స్వతంత్రంగా ఫైళ్లను నిర్వహించేవారని, తన పాలన ప్రక్రియలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకూ అవకాశం కల్పించామని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. తదనుగుణంగా వారి భాగస్వామ్యానికి వీలు కల్పిస్తూ చట్టాలను కూడా రూపొందించామని తెలిపారు. ఎన్నికల సంఘం ఏర్పాటు నిర్ణయ ప్రక్రియలోనూ ప్రతిపక్ష నాయకుడు భాగస్వామిగా ఉంటారని, రాజ్యాంగానుసారం నడచుకోవడంలో తమ నిబద్ధతకు ఇది తార్కాణమని చెప్పారు.
   ఢిల్లీలోని అనేక ప్రదేశాలలో కుటుంబాలు సృష్టించిన ప్రైవేట్ మ్యూజియంలు ఉన్నాయని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ- ప్రభుత్వ నిధుల వినియోగంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ అనుసరణకు కట్టుబాటు చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తనకు ముందున్న వారు సహా అందరు ప్రధానమంత్రుల జీవిత విశేషాలను, దేశం కోసం వారి కృషిని ప్రదర్శించే ప్రధానమంత్రుల మ్యూజియం ఏర్పాటు చేశామని వివరించారు. ఈ మ్యూజియంలో ప్రదర్శితమవుతున్న గొప్ప నాయకులకు చెందిన కుటుంబాలు దీన్ని సందర్శించాలని కోరారు. ఈ ప్రదర్శనశాలను యువతరానికి స్ఫూర్తినిచ్చేలా మరింత చక్కగా తీర్చిదిద్దడానికి సూచనలు, సలహాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి జీవితం వారు జీవించడం సర్వసాధారణమైనా, రాజ్యాంగబద్ధంగా నడచుకోవడం అత్యున్నత ఆదర్శమని స్పష్టం చేశారు.
   “అధికారాన్ని సేవ కోసం వినియోగిస్తే అది దేశ ప్రగతికి తోడ్పడుతుంది. కానీ, అధికారం వారసత్వంగా మారితే అది ప్రజలపాలిట విధ్వంసకారిగా మారుతుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి తాము రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటామని, విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడబోమని స్పష్టం చేశారు. జాతీయ సమైక్యత ప్రాధాన్యాన్ని వివరిస్తూ- రాజ్యాంగ స్ఫూర్తిపై నిబద్ధత తమ కార్యాచరణకు మూలమని చెప్పారు. అందుకే ‘సమైక్యతా ప్రతిమ’ (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) పేరిట ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ విగ్రహాన్ని రూపొందించామని ప్రధాని గుర్తుచేశారు.

దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే అర్బన్ నక్సల్స్ భాషను కొందరు బాహాటంగా ఉపయోగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ మోదీ... ఈ భాషను మాట్లాడేవారుభారత దేశాన్ని సవాలు చేసేవారు రాజ్యాంగాన్ని గానీదేశ సమైక్యతను గానీ అర్థం చేసుకోలేరని అన్నారు.

ఏడు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లడఖ్ రాజ్యాంగ హక్కులను కోల్పోయాయనిఇది రాజ్యాంగానికిజమ్మూ కాశ్మీర్లద్దాఖ్ ప్రజలకు జరిగిన అన్యాయమని ప్రధాని పేర్కొన్నారుఆర్టికల్ 370ని రద్దు చేయడంతోఈ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు దేశంలోని ఇతర పౌరులతో సమానమైన హక్కులను పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారురాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని జీవిస్తున్నారనిఅందుకే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

రాజ్యాంగం ఏ విధంగానూ వివక్షను అనుమతించదని స్పష్టం చేస్తూపక్షపాత మనస్తత్వంతో జీవించే వారిని శ్రీ మోదీ విమర్శించారుముస్లిం మహిళలపై విధించిన ఆంక్షలను ప్రస్తావిస్తూట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ముస్లిం ఆడపిల్లలకు సరైన సమానత్వం కల్పించామని ప్రధానమంత్రి తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా ముందుచూపుతో పనిచేసినట్లు ఆయన చెప్పారునిరాశనిస్పృహలతో కొందరు ఉపయోగిస్తున్న ద్రోహపూరిత భాషపై ఆందోళన వ్యక్తం చేశారుమహాత్మాగాంధీ కలలుగన్న విధంగా తమ దృష్టి ఎప్పుడూ వెనుకబడిన వారిపైనే ఉందని ఆయన పేర్కొన్నారుఅటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలకుగిరిజన వ్యవహారాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయడం సమ్మిళిత అభివృద్ధి పట్ల వారి నిబద్ధతను చాటిచెప్పిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

భారతదేశ దక్షిణతూర్పు తీర రాష్ట్రాలలో మత్స్యకార జనాభా అధికంగా ఉందనిసమాజాలను కలిగి ఉన్నాయనిచిన్న నీటి వనరుల ప్రాంతాలతో ఉన్న వారితో సహా ఈ వర్గాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన ప్రాముఖ్యతను గుర్తించి మత్స్యకారుల అవసరాలను తీర్చేందుకువారి జీవనోపాధి కోసం ప్రత్యేకంగా మత్స్యకారుల మంత్రిత్వ శాఖను సృష్టించిన ప్రభుత్వం తమదేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సమాజంలోని అట్టడుగు వర్గాల్లో ఉన్న సామర్ధ్యాలను ప్రస్తావిస్తూ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారాకొత్త అవకాశాలను సృష్టించవచ్చనిఇది వారి ఆకాంక్షలకు జీవం పోస్తుందని ప్రధాని అన్నారుఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారుఅత్యంత సాధారణ పౌరులకు కూడా అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్య ప్రాథమిక కర్తవ్యమని స్పష్టం చేశారుకోట్లాది మంది ప్రజలను కలిపే భారతదేశ సహకార రంగాన్ని ప్రోత్సహించడానికిబలోపేతం చేయడానికి ప్రభుత్వం సహకార సంఘాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని, ఇది తమ దార్శనికతకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.

కులం గురించి చర్చించడం కొందరికి ఒక ఫ్యాషన్ గా మారిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత 30-35 ఏళ్లుగా వివిధ పార్టీలకు చెందిన ఓబీసీ ఎంపీలు ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారనిఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చిన ప్రభుత్వం తమదేనని ఆయన వెల్లడించారుప్రస్తుతం వెనుకబడిన తరగతుల కమిషన్ ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలో భాగమైందని ఆయన పేర్కొన్నారుప్రతి రంగంలోనూ ఎస్సీఎస్టీఓబీసీ వర్గాలకు గరిష్ఠ అవకాశాలు కల్పించేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారుఒకే ఎస్సీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఒకేసారి పార్లమెంటులో పనిచేసిన సందర్భం లేదా ఒకే ఎస్టీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఒకేసారి పనిచేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారుకొంతమంది వ్యక్తుల మాటలకుచేతలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. , ఇది వారి వాగ్దానాలకు, వాస్తవానికి మధ్య చాలా అంతరాన్ని సూచిస్తుందని అన్నారు.

ఎస్సీఎస్టీ వర్గాల సాధికారత అవసరమనిసామాజిక ఉద్రిక్తతలు సృష్టించకుండా ఐక్యతను కాపాడుకోవడం ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు. 2014కు ముందు దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉండేవనిప్రస్తుతం ఆ సంఖ్య 780కి పెరగడంతో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 2014కు ముందు ఎస్సీ విద్యార్థులకు 7,700 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవన్నారుపది సంవత్సరాల శ్రమ ఫలితంగాఆ సంఖ్య 17,000కి పెరిగిందిఇది దళిత సమాజం నుంచి వైద్యులు కావడానికి భారీగా అవకాశాలను పెంచిందిఎలాంటి సామాజిక ఉద్రిక్తతలను సృష్టించకుండాపరస్పర గౌరవాన్ని కాపాడుతూ దీనిని సాధించినట్టు చెప్పారు. 2014కు ముందు ఎస్టీ విద్యార్థులకు 3,800 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవనిప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు వేలకు పెరిగిందని చెప్పారు. 2014కు ముందు ఓబీసీ విద్యార్థులకు 14 వేల కంటే తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉండేవనినేడుఈ సంఖ్య సుమారుగా పెరిగి, 32,000 మంది ఒబిసి విద్యార్థులు డాక్టర్లు కావడానికి వీలు కల్పించిందని చెప్పారుగత పదేళ్లుగా ప్రతి వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామనిప్రతిరోజూ ఒక కొత్త ఐటీఐని ప్రారంభించామనిప్రతి రెండు రోజులకు ఒక కొత్త కళాశాలను ప్రారంభించామని ప్రధాని వివరించారుఇప్పుడు ఎస్సీఎస్టీఓబీసీ యువతకు అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు.

ఏ ఒక్క లబ్దిదారునీ కూడా విడవకుండా అన్ని పథకాల ప్రయోజనాలను నూటికి నూరు మందికీ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని శ్రీ మోదీ పేర్కొన్నారుప్రయోజనాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని పొందాలనిఅవి కొందరికే పరిమతమనే కాలం చెల్లిపోయిందని ఆయన పేర్కొన్నారు.

బుజ్జగింపు రాజకీయాలను ప్రధాన మంత్రి దుయ్యబట్టారుఅభివృద్ధి చెందిన భారతదేశం కోసంబుజ్జగింపు నుండి సంతృప్తి మార్గంలోకి వెళ్లాలని పేర్కొన్నారుసమాజంలోని ప్రతి వర్గానికి ఎలాంటి వివక్ష లేకుండా న్యాయం జరగాలని ఆయన ఉద్ఘాటించారు. 100 శాతం సంతృప్తతను సాధించడం అంటే నిజమైన సామాజిక న్యాయంలౌకికవాదంరాజ్యాంగం పట్ల గౌరవం అని స్పష్టం చేశారు.

అందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే రాజ్యాంగ స్ఫూర్తి అని అంటూఈ రోజు క్యాన్సర్ దినోత్సవం గురించి ప్రస్తావించారుఆరోగ్యం గురించి దేశవ్యాప్తంగాప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోందని అన్నారురాజకీయ స్వార్థంతో కొందరు వ్యక్తులు పేదలువృద్ధులకు వైద్య సేవలు అందించేందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారుప్రత్యేక ప్రైవేటు ఆసుపత్రులతో సహా 30,000 ఆసుపత్రులను ఆయుష్మాన్ భారత్ పథకానికి అనుసంధానమై ఆయుష్మాన్ భారత్ కార్డుదారులకు ఉచిత చికిత్సను అందిస్తున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారుఅయితేకొన్ని రాజకీయ పార్టీలు తమ సంకుచిత దృక్పథంతప్పుడు విధానాల కారణంగా ఈ ఆసుపత్రుల ద్వారాలను పేదలకు మూసివేయడంతో క్యాన్సర్ రోగులు ప్రభావితులయ్యారని పేర్కొన్నారుఆయుష్మాన్ పథకం కింద సకాలంలో క్యాన్సర్ చికిత్స ప్రారంభమైందని పబ్లిక్ హెల్త్ జర్నల్ ‘లాన్సెట్’ ఇటీవల చేసిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. క్యాన్సర్ స్క్రీనింగ్ చికిత్సలో ప్రభుత్వ నిబద్ధతను శ్రీ మోదీ పేర్కొన్నారుప్రారంభ రోగ నిర్ధారణచికిత్స క్యాన్సర్ రోగులను రక్షించగలదని అన్నారుఆయుష్మాన్ పథకాన్ని లాన్సెట్ ప్రశంసించిందిభారతదేశంలో ఈ దిశలో గణనీయమైన పురోగతిని గుర్తించింది.

క్యాన్సర్ మందులను మరింత చౌకగా అందించడానికి ఈ బడ్జెట్ లో తీసుకున్న ముఖ్యమైన చర్యను ప్రముఖంగా పేర్కొన్న శ్రీ మోదీ... ముఖ్యంగా క్యాన్సర్ దినోత్సవం రోజున ఇది క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూర్చే ఒక ముఖ్యమైన నిర్ణయం అని పేర్కొన్నారుగౌరవ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లోని రోగులు ఈ ప్రయోజనాన్ని వినియోగించుకునేలా చూడాలని ఆయన కోరారుపరిమిత సంఖ్యలో ఆస్పత్రులు ఉండటం వల్ల రోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి 200 డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారుఈ కేంద్రాలు రోగులకువారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.

రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా విదేశాంగ విధానంపై జరిగిన చర్చలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూకొందరు వ్యక్తులు విదేశాంగ విధానంపై పరిణతి ఉన్నట్టు అవి దేశ ప్రయోజనాలకు హాని కలిగించేవైనా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు కనబడిందని ప్రధాని వ్యాఖ్యానించారువిదేశీ విధానంపై నిజంగా ఆసక్తి ఉన్నవారు ప్రఖ్యాత విదేశాంగ విధాన పండితుడు రాసిన "జెఎఫ్ కె ఫర్గాటెన్ క్రైసిస్పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారుభారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూఅప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీల మధ్య క్లిష్ట సమయాల్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలుచర్చలను ఈ పుస్తకంలో వివరించారు.

నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అయిన రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆమె పట్ల చూపిన అగౌరవం పట్ల ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ నైరాశ్యం అర్థమవుతుందనిఅయితే రాష్ట్రపతి పట్ల ఇంత అగౌరవం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారుతిరోగమన మనస్తత్వాలను వదిలి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మంత్రాన్ని స్వీకరించడం ద్వారా భారతదేశం ముందుకు వెళ్తోందని పేర్కొన్న శ్రీ మోదీజనాభాలో సగం ఉన్న మహిళలకు పూర్తి అవకాశాలు కల్పిస్తేభారతదేశం రెట్టింపు వేగంతో పురోగతి సాధిస్తుందని స్పష్టం చేశారుఈ రంగంలో 25 ఏళ్లు పనిచేసిన తర్వాతనే తన ఆత్మవిశ్వాసం మరింత దృఢపడిందని అన్నారుగడచిన పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలుప్రధానంగా అట్టడుగుగ్రామీణ నేపథ్యం నుంచి స్వయం సహాయక సంఘాల్లో చేరారని ప్రధాని చెప్పారుఈ మహిళల సామర్థ్యాలు పెరిగాయివారి సామాజిక స్థితి మెరుగుపడిందివారి పనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం వారి సహాయాన్ని రూ.20 లక్షల వరకు పెంచింది. ఈ ప్రయత్నాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలో లక్‌పతి దీదీ పథకం ప్రస్తావనపై ప్రధానమంత్రి మాట్లాడుతూ.. మూడోసారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 50 లక్షలకు పైగా లక్‌పతి దీదీలు నమోదయ్యారని పేర్కొన్నారుఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.25 కోట్ల మంది మహిళలు లక్‌పతి దీదీలుగా మారారనిఆర్థిక అంశాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల ద్వారా మూడు కోట్ల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా తయారు చేయడమే లక్ష్యమని అన్నారునమో డ్రోన్ దీదీలుగా పిలిచే మహిళలు డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారుఆయా గ్రామాల్లో వచ్చిన గణనీయమైన మానసిక మార్పును ఆయన ప్రస్తావించారుఈ డ్రోన్ దీదీలు పొలాల్లో పనిచేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారుమహిళా సాధికారతలో ముద్రా యోజన పాత్రను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారుదీని ద్వారా కోట్లాది మంది మహిళలు మొదటిసారిగా పారిశ్రామిక రంగంలోకి వెళ్లి పారిశ్రామికవేత్తల పాత్రలను పోషిస్తున్నారు.

ప్రజలకు అందించిన కోట్ల గృహాల్లో సుమారు 75 శాతం మహిళల పేరిటే నమోదయ్యాయని.. “ఈ మార్పు 21వ శతాబ్దపు బలమైనసాధికారిక భారత్‌కు పునాది వేస్తోంది” అని ప్రధాని ఉద్ఘాటించారు. "గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యాన్ని సాధించలేంఅని ఆయన వ్యాఖ్యానించారుగ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారుఅభివృద్ధి చెందిన భారత్‌కు రైతులు బలమైన మూలస్తంభమని పేర్కొన్నారుగత దశాబ్ద కాలంలో, 2014 నుంచి వ్యవసాయ బడ్జెట్ పది రెట్లు పెరగటంతో ఈ విషయంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది

2014కు ముందు యూరియా విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారనిడిమాండ్ చేసిన ప్రాంతాల్లో రైతులు పోలీసు చర్యలను కూడా ఎదుర్కొన్నారని గుర్తు చేశారురాత్రంతా క్యూలైన్లలో నిల్చునేవాళ్లనిరైతులకు అందాల్సిన ఎరువులు తరచూ బ్లాక్ మార్కెట్లలో విక్రయం అయ్యేవని అన్నారునేడు రైతులకు పుష్కలంగా ఎరువులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారుకోవిడ్-19 సంక్షోభ సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయనిప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయని అన్నారుదిగుమతి చేసుకుంటున్న యూరియాపై దేశం ఆధారపడి ఉన్నప్పటికీప్రభుత్వం ఆ ఖర్చును భరించగలిగిందని తెలిపారుప్రభుత్వం రూవేల విలువైన యూరియా బస్తాను రూ.300 కంటే తక్కువకే రైతులకు అందిస్తోందన్నారునిరంతరం ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు రైతులకు గరిష్ట ప్రయోజనాలను చేకూరుస్తాయని పేర్కొన్నారు

గత పదేళ్లలో రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులను అందించడానికి రూ .12 లక్షల కోట్లు ఖర్చు చేశామనిపీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సుమారు రూ. 3.5 లక్షల కోట్లను నేరుగా రైతు ఖాతాలకు బదిలీ చేశామని  తెలిపారుఎంఎస్‌పీ రికార్డు స్థాయిలో పెరిగిందనిగత దశాబ్ద కాలంలో కొనుగోళ్లు మూడు రెట్లు పెరిగాయని పేర్కొన్నారురైతు రుణాలను మరింత అందుబాటులోకి తెచ్చామని.. ఇచ్చే రుణ మొత్తాన్ని మూడింతలు పెంచామని పేర్కొన్నారుప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గతంలో రైతులు స్వంతంగా నష్టాన్ని భరించేవారనికానీ పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు రూ.2 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారుగత దశాబ్ద కాలంలో నీటిపారుదల రంగంలో మునపెన్నడూ లేనంతగా తీసుకున్న చర్యల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారునీటి నిర్వహణ విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ సమగ్రసమ్మిళిత దార్శనికతను ఈ సందర్భంగా ప్రస్తావించారుదశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 100కు పైగా భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి పొలాలకు నీరందించామన్నారుడాక్టర్ అంబేద్కర్ నదులు అనుసంధానం చెయ్యాలని చెప్పేవారనిఇది ఏళ్ల తరబడి నెరవేర లేదని  ప్రధాని గుర్తు చేశారునేడు కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్పార్వతి-కాళిసింధ్-చంబల్ లింక్ ప్రాజెక్ట్ వంటివి ప్రారంభమయ్యాయినదుల అనుసంధానం విషయంలో గుజరాత్‌లో విజయవంతంగా చేపట్టిన పనులకు సంబంధించిన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు.

"ప్రపంచవ్యాప్తంగా తినేందుకు కూర్చునే టేబుళ్లపై భారత్‌తో తయారైన ఆహార ప్యాకెట్లను చూడాలని ప్రతి భారతీయుడు కలలు కనాలిఅని మోదీ పేర్కొన్నారుభారతీయ టీకాఫీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని.. కోవిడ్ తర్వాత పసుపుకు డిమాండ్ పెగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారురాబోయే కాలంలో శుద్ధి చేసిన భారత సముద్ర ఆహారంబిహార్ మఖానా కూడా ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారుశ్రీ అన్న అని పిలుచుకునే భారత చిరుధాన్యాలు అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఖ్యాతిని పెంచుతాయని ప్రధానంగా చెప్పారు

అభివృద్ధి చెందిన భారతదేశం కోసం భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న నగరాల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన మోదీ.. దేశం వేగంగా పట్టణీకరణ చెందుతోందనిదీనిని ఒక సవాలుగా కాకుండా ఒక అవకాశంగా చూడాలన్నారుమౌలిక సదుపాయాలను పెంచటం అనేది అవకాశాలను సృష్టించేందుకు దారితీస్తుందని.. అనుసంధానం పెరగడం వల్ల అవకాశాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారుదిల్లీఉత్తర్‌ప్రదేశ్‌లను కలిపే తొలి నమో రైలు ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ.. అందులో ప్రయాణించిన అనుభవాన్ని పంచుకున్నారుభారత భవిష్యత్‌ దిశను నిర్దేశించేలా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇటువంటి అనుసంధానమౌలిక సదుపాయాలు చేరాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారుఢిల్లీ మెట్రో రైల్ మార్గం రెట్టింపు అయిందనిఇప్పుడు మెట్రో మార్గాలు ద్వితీయతృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయని అన్నారుభారత మెట్రో నెట్‌వ‌ర్క్ 1,000 కిలోమీట‌ర్ల‌ను దాటిందని..  ప్రస్తుతం మరో 1,000 కిలోమీటర్ల మెట్రో నిర్మాణంలో ఉందనిఇది శరవేగంగా పురోగతి సాధిస్తోందని ప్రధాని సగర్వంగా తెలియజేశారుకాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను ఆయన వివరించారుదేశవ్యాప్తంగా 12,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడండిల్లీకి అందిన పలు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి

ప్రధాన నగరాల్లో గిగ్ ఎకానమీ విస్తరణ గురించి ప్రస్తావిస్తూ.. లక్షలాది మంది యువత ఇందులో చేరుతున్నారని-శ్రమ్ పోర్టల్‌లో గిగ్ వర్కర్లను నమోదు చేస్తామనితనిఖీ తర్వాత ఐడీ కార్డును కూడా అందించనున్నట్లు ప్రకటించారుఆయుష్మాన్ పథకం ద్వారా గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలుగుతుందనిఆరోగ్య సంరక్షణ వారికి అందుబాటులో ఉండేలా చూస్తామని పేర్కొన్నారుప్రస్తుతం దేశంలో కోటి మంది గిగ్ వర్కర్లు ఉన్నారనిఈ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు

ఎంఎస్‌ఎంఈ రంగం కల్పిస్తోన్న గణనీయమైన ఉద్యోగావకాశాలను గురించి ప్రధాని ప్రధానంగా మాట్లాడారు. చిన్న పరిశ్రమలు స్వావలంబన భారత్‌కు ప్రతీక అని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎనలేని దోహదం చేస్తాయని అన్నారుసరళతసౌలభ్యంఎంఎస్ఎంఈలకు మద్దతుతయారీ రంగాన్ని ప్రోత్సహించడానికినైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు మిషన్ మాన్యుఫాక్చరింగ్‌పై ప్రభుత్వ విధాం దృష్టి పెడుతుందని తెలియజేశారు.

ఎంఎస్ఎంఈ రంగాన్ని మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించామని అన్న ఆయన.. 2006‌లో తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని గత దశాబ్దంలో రెండుసార్లు నవీకరించామని తెలిపారు. 2020‌లోప్రస్తుత బడ్జెట్‌లో ఈ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయని మోదీ అన్నారుఎంఎస్ఎంఈలకు అందించిన ఆర్థిక మద్దతువ్యవస్థీకృత ఆర్థిక సహాయం అందటంలో సవాళ్లను పరిష్కరించడంకోవిడ్ సంక్షోభ సమయంలో ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చిన ప్రత్యేక సహాయాన్ని వివరించారుబొమ్మలువస్త్రాలు వంటి పరిశ్రమలపై దృష్టి సారించటంనగదు ప్రవాహం ఉండేలా చూసుకోవటంపూచీకత్తు లేకుండా రుణాలు అందించడం వల్ల ఉద్యోగ కల్పనఉద్యోగ భద్రత లభిస్తుందని వ్యాఖ్యానించారుచిన్న పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులుక్రెడిట్ గ్యారంటీ కవరేజీని ప్రవేశపెట్టడాన్ని కూడా ప్రస్తావించారు. 2014కు ముందు దేశం బొమ్మలను దిగుమతి చేసుకునేదని.. కానీ నేడు భారతీయ బొమ్మల తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా బొమ్మలను ఎగుమతి చేస్తున్నారనిదిగుమతులు గణనీయంగా తగ్గాయనిఎగుమతులు 239% పెరిగాయని తెలిపారుఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వివిధ రంగాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని.. దుస్తులుఎలక్ట్రానిక్స్ఎలక్ట్రికల్ వస్తువులు వంటి భారత్‌లో తయారైన ఉత్పత్తులు ఇతర దేశాల్లో దైనందిన జీవితంలో భాగమవుతున్నాయని ప్రధాని వివరించారు.

అభివృద్ధి చెందిన భారతదేశం కల కేవలం ప్రభుత్వానిది కాదని, 140 కోట్ల మంది భారతీయులదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారుదేశం ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందనిఈ కలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ శక్తియుక్తులను అందించాలని కోరారు. 20-25 ఏళ్లలో ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అనటానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉదాహరణలు ఉన్నాయన్నారుజనాభా విషయంలో ప్రయోజనాలుప్రజాస్వామ్యండిమాండ్ ఉన్న భారత్‌ 2047 నాటికి.. 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే నాటికి ఇది సాధించగలదని ధీమా వ్యక్తం చేశారు. 

గొప్ప లక్ష్యాలను సాధించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా తెలియజేశారు. ఆధునికసమర్థవంతమైనఅభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడానికి రాబోయే అనేక సంవత్సరాల పాటు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని గట్టిగా తెలిపారుఅన్ని రాజకీయ పార్టీలునాయకులుపౌరులు అన్నింటికీ మించి దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. అభివృద్ధి చెందిన భారత్‌ కల కోసం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారుతన ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి.. రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపిసభలోని సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

***

(Release ID: 2099924) Visitor Counter : 16