ఆర్థిక మంత్రిత్వ శాఖ
తొలి ముందస్తు గణన ప్రకారం 2025లో భారత వాస్తవ.. స్థూల జిడిపిలో వృద్ధి 6.4 శాతం.. 9.7 శాతంగా ఉంటుందని అంచనా
2026లో భారత స్థూల జిడిపి పెరుగుదల 10.1 శాతంగా ఉంటుందని అంచనా;
సరఫరా-ఆధారిత ప్రభుత్వ చర్యల మద్దతుతో 2024-25 (ఏప్రిల్-డిసెంబర్)లో ద్రవ్యోల్బణం 4±2 శాతం స్థాయిలో నమోదైంది;
2026 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.6 శాతంగానూ.. రెండో త్రైమాసికంలో 4.0 శాతంగానూ ఉంటుందని రిజర్వు బ్యాంకు అంచనా;
2024-25 (సవరణ అంచనా)కుగాను ద్రవ్యలోటును జిడిపిలో 4.8 శాతానికి కట్టడి చేయాలన్నది లక్ష్యం కాగా- 2025-26లో ఇది 4.5 శాతంకన్నా తక్కువ నమోదు కావచ్చునని అంచనా;
2025-26కుగాను మూలధన వ్యయం కేటాయింపు రూ.11.21 లక్షల కోట్లు (జిడిపిలో 3.1 శాతం);
భారత వస్తు ఎగుమతులు (ఏటికేడు ప్రాతిపదికన) 1.6 శాతం పెరిగితే... సేవల ఎగుమతులలో (2024 ఏప్రిల్-డిసెంబర్) 11.6 శాతం వృద్ధి నమోదైంది;
భారత కరెంట్ ఖాతా లోటు (సిఎడి) 2025 రెండో త్రైమాసికంలో జిడిపిలో 1.2 శాతానికి తగ్గగా- 2024 రెండో త్రైమాసికంలో 1.3 శాతంగా ఉంది;
రెవెన్యూ లోటు తగ్గుముఖం పడుతుండగా 2024-25 రెండో త్రైమాసికంలో జిడిపిలో 4.8 శాతం నుంచి 2025-26 చివరికల్లా 4.4 శాతానికి తగ్గుతుందని అంచనా;
2024-25 జీడీపీలో కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తి 57.1 కాగా- 2025
Posted On:
01 FEB 2025 12:45PM by PIB Hyderabad
ప్రపంచంలో శరవేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నానాటికీ పెరుగుతున్న అస్తవ్యస్త స్థితిని చక్కదిద్దడంపై ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు దృష్టి సారిస్తోంది. ఎన్నో సవాళ్ల నడుమ అందరికీ న్యాయమైన, సముచిత, సార్వజనీన, సమాన అంతర్జాతీయ ఆర్థిక క్రమం సృష్టి దిశగా భారత్ కృషి చేస్తోంది. ఆ మేరకు విస్తృత ప్రాతిపదికన సార్వజనీన ఆర్థిక వృద్ధి సృష్టిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంస్కరణలు, పునరుత్తేజ శక్తి, సంసిద్ధతలపై ఆర్థిక విధానం ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఈ విధానం వృద్ధి వేగానికి ఊపునిచ్చేదిగా, జాతీయ-అంతర్జాతీయ భవిష్యత్ సవాళ్లపై ప్రభుత్వం సమర్థంగా స్పందించగల వెసులుబాటును కల్పించేదిగా ఉండాలి. కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో సమర్పించిన మధ్యకాలిక ద్రవ్య విధానం-ద్రవ్యవిధాన వ్యూహ నివేదిక ఈ అంశాన్ని స్పష్టం చేసింది.
జాతీయ గణాంక కార్యాలయం ప్రచురించిన తొలి ముందస్తు గణన అంచనాలను ‘స్థూల ఆర్థిక చట్రం నివేదిక-2024-25’ ప్రస్తావించింది. ఇది 2024-25లో భారత వాస్తవ, స్థూల ‘జిడిపి’ల వృద్ధిని 6.4 శాతం, 9.7 శాతంగా అంచనా వేసింది. అయితే, 2024-25 తొలి ముందస్తు అంచనాలకు భిన్నంగా స్థూల జిడిపి 10.1 శాతం పెరుగుతుందని 2025-26 బడ్జెట్ అంచనాలు పేర్కొంటున్నాయి.
‘స్థూల ఆర్థిక చట్రం నివేదిక 2024-25’ ప్రకారం ద్రవ్యోల్బణ ఒత్తిడి 2024-25లో తగ్గుముఖం పట్టింది. ఆ మేరకు 2023-24లో 5.4 శాతంగా ఉన్న సగటు చిల్లర ద్రవ్యోల్బణం 2024-25 (ఏప్రిల్-డిసెంబర్)లో 4.9 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. కీలక, స్థిర (ఆహారేతర, ఇంధనేతర) ద్రవ్యోల్బణం ధోరణి ఈ తగ్గుదలకు దోహదం చేసిందని తెలిపపింది. తదనుగుణంగా 2024-25 (ఏప్రిల్-డిసెంబర్)లో మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం 4±2 శాతం స్థాయిలో నమోదైంది. సరఫరా వైపు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆహార ద్రవ్యోల్బణం కట్టడిలో తోడ్పడ్డాయి. అందువల్ల 2025-26లో ద్రవ్యోల్బణం తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. అలాగే రిజర్వు బ్యాంకు కూడా 2025-26 తొలి, మలి త్రైమాసికాలలో ద్రవ్యోల్బణం 4.6 శాతం, 4.0 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. వస్తు ధరలలో సానుకూల ధరోణి కనిపిస్తున్నా భౌగోళిక-రాజకీయ పరిస్థితులు ధరల ఒత్తిడిని మరింత తీవ్రం చేసే అవకాశాలున్నాయి.
కోవిడ్-19 మహమ్మారి అనంతరం కేంద్ర ప్రభుత్వం చురుకైన ఆర్థిక విధాన వ్యూహాన్ని అనుసరించింది. దీంతో దేశ ప్రగతి అవసరాలు తీరడంతోపాటు ఆర్థిక విధాన పరంగా సత్ఫలితాలు లభించినట్లు స్థూల ఆర్థిక చట్రం నివేదిక 2024-25 స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వం 2024-25 (సవరించిన అంచనాల)లో ద్రవ్య లోటు లక్ష్యాన్ని ‘జిడిపి’లో 4.8 శాతానికి సవరించింది. అంతకుముందు 2021-22 నాటి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు 2025-26లో ద్రవ్యలోటును ‘జిడిపి’లో 4.5 శాతంకన్నా తక్కువకు పరిమితం చేసే దిశగా దేశం ముందడుగు వేస్తోంది.
ఇక 2024-25 జీడీపీలో కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తి 57.1 కాగా, 2025-26లో అది 56.1కి తగ్గుతుందని అంచనా. ద్రవ్య స్థిరీకరణ వ్యూహం ప్రకారం... 2026-27 నుంచి 2030-31 దాకా వెలుపలి నుంచి ఎలాంటి అనూహ్య భారీ స్థూల ఆర్థిక అంతరాయాలు లేని పక్షంలో సంభావ్య వృద్ధి ధోరణి, భవిష్యత్ అభివృద్ధి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఏటా (2026-27 నుంచి 2030-31వరకు) ద్రవ్య లోటును అదుపులో ఉంచడానికి కృషి చేస్తుంది. అంటే- ‘జిడిపి’లో కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తి తగ్గుముఖం పడుతుంది. తద్వారా 2031 మార్చి 31 నాటికి రుణ నిష్పత్తి దాదాపు 50±1 శాతం స్థాయికి చేరుతుంది. మరోవైపు ‘జిడిపి’లో రెవెన్యూ లోటు కూడా తగ్గుముఖం పడుతున్నందున 2024-25లో 4.8 శాతం స్థాయి నుంచి 2025-26లో 4.4 శాతానికి తగ్గుతుందని అంచనా.
|
సవరించిన అంచనాలు
|
బడ్జెట్ అంచనాలు
|
2024-25
|
2025-26
|
1.
|
ద్రవ్యలోటు
|
4.8
|
4.4
|
2.
|
రెవెన్యూ లోటు
|
1.9
|
1.5
|
3.
|
ప్రాథమిక లోటు
|
1.3
|
0.8
|
4.
|
పన్ను రాబడి (స్థూల)
|
11..9
|
12.0
|
5.
|
పన్నేతర రాబడి
|
1.6
|
1.6
|
6.
|
కేంద్ర ప్రభుత్వ రుణం
|
57.1
|
56.1
|
పట్టిక: ద్రవ్య సూచీలు - ‘జిడిపి’లో శాతాల రూపేణా సవరించదగిన లక్ష్యాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే- మూలధన వ్యయం కోసం రూ.11.21 లక్షల కోట్లు (జిడిపిలో 3.1 శాతం) కేటాయించడం విశేషం. ఇందులో భాగంగా రూ.1.50 లక్షల కోట్ల మేర రాష్ట్రాలకు వడ్డీరహిత దీర్ఘకాలిక రుణాల ద్వారా మూలధన మద్దతు లభిస్తుంది. ఈ బడ్జెట్‌లో పేర్కొన్న మూలధన వ్యయం 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 3.3 రెట్లు అధికం.
అలాగే 2025-26లో ద్రవ్య లోటు భర్తీ దిశగా ప్రభుత్వ బాండ్ల ద్వారా సమీకరించే నికర మార్కెట్ రుణాలు రూ.11.54 లక్షల కోట్లు కాగా, మిగిలింది చిన్న మొత్తాల పొదుపు, ఇతర వనరుల నుంచి సమీకరిస్తారని అంచనాలు పేర్కొంటున్నట్లు స్థూల ఆర్థిక చట్రం నివేదిక తెలిపింది. అదే కాలానికి స్థూల మార్కెట్ రుణాలను రూ.14.82 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.
బాహ్య రంగం సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- 2024 ఏప్రిల్-డిసెంబర్‌లో భారత వస్తు ఎగుమతులు (ఏటికేడు) 1.6 శాతం పెరిగాయని, అదే వ్యవధిలో సేవల ఎగుమతులు 11.6 శాతం దాకా సంతృప్తికర వృద్ధిని నమోదు చేశాయని నివేదిక పేర్కొంది. ఇక భారత కరెంట్ ఖాతా లోటు (సిఎడి) 2023-24 రెండో త్రైమాసికం నాటికి ‘జిడిపి’లో 1.3 శాతం కాగా, 2024-25 రెండో త్రైమాసికం నాటికి 1.2 శాతానికి తగ్గింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ప్రవాహం విషయానికొస్తే- 2024-25లో పునరుద్ధరణ ధోరణి ప్రదర్శించినట్లు నివేదిక వివరించింది. ఆ మేరకు (2023-24 ఏప్రిల్-అక్టోబర్‌లో) స్థూల ‘ఎఫ్‌డిఐ’ ప్రవాహం 42.1 బిలియన్ డాలర్లు కాగా, (2024-25 అదే కాలంలో) 48.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్‌లో నికర ‘ఎఫ్‌డిఐ’ ప్రవాహం 14.5 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇక 2024 చివరి నాటికి భారత విదేశీ మారక నిల్వలు 640.3 బిలియన్ డాలర్లని పేర్కొంటుండగా ఇది దేశం యొక్క బాహ్య రుణంలో దాదాపు 90 శాతానికి సరిపడా ఉంటుందని అంచనా. అలాగే బాహ్య రంగ స్థిరత్వ కీలక సూచిక మేరకు దిగుమతుల రీత్యా- నవంబర్ 2024 నాటికి 11 నెలలకు సరిపడా ఉన్నట్లు అంచనా.
ఉపాధి సాంద్రతతోపాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యం పెంపును ప్రధాన వ్యూహాత్మక ప్రాథమ్యాలుగా ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో భాగంగా సమాన, సుస్థిర వృద్ధిసహా ప్రభుత్వ మూలధన వ్యయం పెంపు, సామాజిక సంక్షేమం-అభివృద్ధి దిశగా ‘సంతృప్త విధానం’ అనుసరణ, కీలక సాంకేతిక పరిజ్ఞానాల కోసం పరిశోధన-ఆవిష్కరణ రంగంలో ఉత్పాదక సామర్థ్యం పెంపు, కేంద్ర-రాష్ట్రాల ప్రగతి సామర్థ్య బలోపేతం, ద్రవ్య నిర్వహణ-పారదర్శకత దిశగా దృఢ సంకల్పం తదితర ప్రాధాన్యాలను కూడా ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.
****
(Release ID: 2099003)
Visitor Counter : 247