ప్రధాన మంత్రి కార్యాలయం
మహాత్మాగాంధీ వర్ధంతి... ప్రధానమంత్రి నివాళి
Posted On:
30 JAN 2025 9:06AM by PIB Hyderabad
మహాత్మాగాంధీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైన వారందరికీ కూడా శ్రీ మోదీ నివాళులను అర్పించడంతోపాటు వారు చేసిన సేవలనూ, వారి త్యాగాలనూ గుర్తు చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘పూజ్య బాపూజీకి ఆయన వర్ధంతి సందర్భంగా ఇవే నివాళులు. ఆయన ఆదర్శాలు అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి మనకు ప్రేరణనందిస్తున్నాయి. మన దేశం కోసం ప్రాణాలను అర్పించడానికైనా వెనుదీయక, అమరులైన వారందరికీ కూడా నేను నివాళులు అర్పిస్తున్నాను. వారు చేసిన సేవలతోపాటు వారి త్యాగాలను స్మరించుకొందాం’’.
**********
MJPS/ST
(Release ID: 2097547)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam