ప్రధాన మంత్రి కార్యాలయం
ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా సాధికారిత కల్పించే జాతీయ ఓటర్ల దినోత్సవం... ఓ ప్రజాస్వామ్య వేడుక: ప్రధానమంత్రి
Posted On:
25 JAN 2025 8:45AM by PIB Hyderabad
ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. మన శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకోవడం, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సాధికారతను కల్పించడం జాతీయ ఓటర్ల దినోత్సవం ఉద్దేశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈసందర్భంగా అన్నారు.
“జాతీయ ఓటర్ల దినోత్సవం మన శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకునే రోజు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునే సాధికారతను కల్పించడం దీని ఉద్దేశం. ఇది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్య ప్రాముఖ్యతను చాటి చెబుతుంది. ఈ విషయంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం” అని ప్రధానమంత్రి ‘ఎక్స్‘ పోస్ట్ లో పేర్కొన్నారు. @ECISVEEP”
***
MJPS/SR
(Release ID: 2096130)
Visitor Counter : 53
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam