ప్రధాన మంత్రి కార్యాలయం
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ పూర్తి పాఠం
Posted On:
23 JAN 2025 4:26PM by PIB Hyderabad
ప్రధానమంత్రి: 2047కల్లా దేశం సాధించాలనుకుంటున్న లక్ష్యం ఏమిటి?
విద్యార్థి : మనం మన దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం.
ప్రధాని : అది సాధ్యమనుకుంటున్నావా?
విద్యార్థి : అవును సర్.
ప్రధాని: 2047నే ఎందుకు ఖరారు చేశారు?
విద్యార్థి : అప్పటికంతా మా తరం సిద్ధంగా ఉంటుంది.
ప్రధాని: ఒకటి, రెండా?
విద్యార్థి : అప్పటికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది.
ప్రధాని : శభాష్.
ప్రధాని : సాధారణంగా ఇంటి నుంచి ఎన్ని గంటలకు బయలుదేర్తావు?
విద్యార్థి : 7 గంటలకు.
ప్రధాని : అలాగా, లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్తావా?
విద్యార్థి : లేదు సర్, లేదు సర్.
ప్రధాని: అరె, దానిని నేనేం తినేయనులే, నాతో చెప్పు మరీ.
విద్యార్థి : నేను తినే ఇక్కడికి వచ్చాను.
ప్రధానమంత్రి: నువ్వు తినే ఇక్కడికి వచ్చావా, దానిని నీ వెంట తీసుకు రాలేదా? మంచిది, దాన్లో ఉన్నది ప్రధానమంత్రి తినేస్తారని నువ్వు అనుకున్నట్టున్నావ్.
విద్యార్థి : కాదు సర్.
ప్రధాని: సరే, ఈ రోజు ప్రత్యేకత ఏమిటి?
విద్యార్థి : సర్, ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పుట్టిన రోజు.
ప్రధాని : అవును.
ప్రధాని: ఆయన ఎక్కడ పుట్టారు?
విద్యార్థి : ఒడిశాలో.
ప్రధానమంత్రి: ఒడిశాలో ఎక్కడ?
విద్యార్థి : కటక్‌లో.
ప్రధాని : అందుకే ఈ రోజు కటక్‌లో పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధాని : నేతాజీ నినాదాల్లో నీకు ప్రేరణనిచ్చే నినాదమేది?
విద్యార్థి : ‘నేను మీకు స్వాతంత్య్యాన్ని ఇస్తాను.’
ప్రధాని : చూడు, మనకు స్వాతంత్య్రం లభించింది. ఇప్పుడు రక్తాన్ని ఇవ్వాలనుకోవట్లేదంటే, అప్పుడు మనం ఏమిస్తాం?
విద్యార్థి : సర్, ఆయన ఎలాంటి నాయకుడు అనేది ఆ విషయం తెలియజేస్తోంది, ఇంకా.. తన దేశానికి.. తన కన్నా, అన్నింటి కన్నా మిన్నగా.. ఆయన ప్రాముఖ్యాన్నిచ్చారు, అందుకే దీని నుంచి ఎంతో ప్రేరణ మాకు లభిస్తుంటుంది.
***
(Release ID: 2095877)
Visitor Counter : 9