ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


కార్యక్రమంలో పాల్గొన్న వారు పది ఇతివృత్తాలపై రాసిన ఉత్తమ వ్యాసాల సంకలనం ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణ

భారత్ యువ శక్తి అసాధారణ మార్పులను తెస్తోంది...

‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ ప్రేరణనిచ్చే వేదికలా పనిచేస్తుంది..

ఈ కార్యక్రమం అభివృద్ధి చెందిన భారత్‌ను తీర్చిదిద్దడానికి మన యువతలో ఉన్న శక్తినీ, నవ భావనల్నీ ఉపయోగించుకొంటుంది: ప్రధాని

మన దేశ యువ శక్తిలో ఉన్న సత్తాయే భారత్‌ను ‘అభివృద్ధి చెందిన భారత్‌’గా మారుస్తుంది: ప్రధానమంత్రి

భారత్ అనేక రంగాల్లో తన లక్ష్యాలను అనుకున్న కాలాని కన్నా ఎంతో ముందుగానే సాధిస్తోంది: ప్రధాని

మహత్వ కాంక్షల్ని సాధించాలంటే దేశంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా, కలిసికట్టుగా కృషిచేయాలి: ప్రధానమంత్రి

భారత్‌లో యువజనుల ఆలోచనల పరిధి చాలా పెద్దది: ప్రధాని

అభివృద్ధి చెందిన భారత్‌‌‌లో ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా సాధికారత ఏర్పడుతుంది: ప్రధానమంత్రి

‘వికసిత్ భారత్’ కలను భారతదేశ యువ శక్తి తప్పక నిజం చేసి చూపిస్తుంది: ప్రధాని

Posted On: 12 JAN 2025 4:53PM by PIB Hyderabad

స్వామి వివేకానంద జయంతిని స్మరించుకొంటూ పాటించే జాతీయ యువజన దినోత్సవం సందర్బంగాప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్నారుదేశవ్యాప్తంగా 3,000 మంది చురుకైన యువ నాయకులతో ఆయన మాట్లాడారుసభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూమన దేశంలో యువతలో గొప్ప హుషారైన శక్తి నిండి ఉందంటూఈ శక్తి భారత్ మండపానికి జవ జీవాలనిచ్చిందన్నారుదేశ యువతపై అపార నమ్మకం పెట్టుకొన్న స్వామి వివేకానందను యావత్తు జాతి స్మరించుకొంటూఆయనకు నివాళులు అర్పిస్తోందని ప్రధాని అన్నారుస్వామి వివేకానంద తన శిష్యులు యువతరం నుంచే వస్తారనీవారు ప్రతి ఒక్క సమస్యనూ సింహాల్లా పరిష్కరిస్తారని నమ్మారనీ శ్రీ మోదీ అన్నారుయువతపై స్వామీజీ నమ్మకాన్ని ఉంచినట్లే స్వామీజీ పట్లాఆయన విశ్వాసాల పట్లా తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ప్రధాని తెలిపారుఆయననూప్రత్యేకించి యువత విషయంలో ఆయనకున్న దృష్టి కోణాన్నీ తాను పూర్తిగా నమ్మినట్లు ప్రధానమంత్రి చెప్పారుస్వామి వివేకానంద ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే21వ శతాబ్ది యువజనంలో శక్తి జాగృతమైవారు చేస్తున్న చురుకైన ప్రయత్నాలను చూసి స్వామి వివేకానందలో ఒక కొత్త విశ్వాసం తొణికిసలాడేదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

భారత్ మండపంలో జి-20 కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేస్తూ... ప్రపంచ భవితను గురించి చర్చించడానికి ప్రపంచ నేతలు అప్పట్లో ఇదే సభాస్థలిలో సమావేశమవగారాబోయే 25 సంవత్సరాలకు దేశానికి మార్గసూచీని భారత యువత ఈ రోజు రూపొందిస్తోందనీ అభివర్ణించారుకొన్ని నెలల కిందట తన నివాసంలో యువ క్రీడాకారులతో సమావేశమైనప్పటి సంగతులను ఆయన పంచుకొంటూవారిలో ఒకరు ‘‘ప్రపంచానికిమీరు ప్రధాన మంత్రిఅయితే మాకు మాత్రం మీరు పరమ మిత్రులు’’ అని అన్నారని ప్రధానంగా ప్రస్తావించారుభారతదేశ యువతతో  తనకు స్నేహ బంధం ఉందని ప్రధాని స్పష్టంచేశారుస్నేహాన్ని బలంగా నిలిపి ఉంచేది నమ్మకమేనన్నారుయువత పట్ల తనకు అపార నమ్మకం ఉందనిఈ విషయమే మై భారత్‌‌ (MY Bharat)ను ఏర్పాటు చేయడానికి ప్రేరణనిచ్చివికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌‌కూ పునాది వేసిందన్నారుభారతదేశ యువత సామర్థ్యం త్వరలో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారుఈ లక్ష్యం గొప్పదే అయినప్పటికీ అసాధ్యమైందేం కాదు అని ఆయన అంటూ అదెలా సాధ్యమనే వ్యక్తుల ఆలోచనల్ని తోసిపుచ్చారులక్షల కొద్దీ యువజనుల ఉమ్మడి కృషి ప్రగతి రథ చక్రాలను ముందుకు నడిపిస్తూంటేదేశం తన గమ్యాన్ని చేరుకొని తీరుతుందనీఇందులో అనుమానం అక్కర్లేదన్నారు.

‘‘చరిత్ర మనకు బోధించిప్రేరణనిస్తుంద’’ని శ్రీ మోదీ అన్నారుపెద్ద కలలు కన్నసంకల్పాలు చెప్పుకొన్న దేశాలూబృందాలు వాటి లక్ష్యాల్ని సాధించిన ఉదాహరణలూ ప్రపంచంలో అనేకం ఉన్నాయని ఆయన ప్రధానంగా చెప్పారు. 1930వ దశాబ్దంలో అమెరికాలో ఆర్థిక సంక్షోభాన్ని ఆయన ఒక ఉదాహరణగా చెబుతూఅమెరికన్లు న్యూ డీల్‌ను ఎంపిక చేసుకొని సంక్షోభాన్ని అధిగమించడమే కాకుండా వారి అభివృద్ధిని పెంపొందించుకున్నారని ఆయన వివరించారుమౌలిక జీవన సంకటం తలెత్తిన సింగపూర్‌ను గురించి కూడా ఆయన ప్రస్తావించారుఅయితే సింగపూర్ క్రమశిక్షణతోనూసమష్టి కృషితోనూ ప్రపంచానికి ఆర్థికవ్యాపార కూడలి (హబ్)గా మార్పు చెందిదని చెప్పారుభారత్‌లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయంటూస్వాతంత్ర్య పోరాటంస్వాతంత్ర్యం వచ్చాక ఆహార సంక్షోభాన్ని అధిగమించడాన్ని గురించి తెలిపారుపెద్ద లక్ష్యాల్ని పెట్టుకొనివాటిని ఒక గడువు లోపల సాధించడం చేతకానిదేం కాదని ఆయన అన్నారుఒక ప్రధాన లక్ష్యమంటూ లేకపోతేదేనినీ సాధించలేంమరి ఇవాళ భారత్ ఈ మనస్తత్వంతోనే పనిచేస్తోందని ఆయన స్పష్టంచేశారు.

గత పదేళ్లలో దృఢసంకల్పంతో లక్ష్యాల్ని సాధించామనడానికి అనేక ఉదాహరణలను ప్రధాని  చెబుతూభారత్ ఆరుబయలు ప్రదేశాల్లో మలమూత్రాదుల విసర్జనకు స్వస్తి పలకాలని సంకల్పం చెప్పుకొందనీ60 నెలల్లో 60 కోట్ల మంది పౌరులు ఈ లక్ష్యాన్ని సాధించగలిగారన్నారుదేశంలో దాదాపుగా ప్రతి ఒక్క కుటుంబానికీ ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయనీపొగ చూరు వంటిళ్ల బారి నుంచి మహిళలను కాపాడడానికి 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందించామనీ ప్రధానమంత్రి చెప్పారుమన దేశం వివిధ రంగాల్లో తాను పెట్టుకొన్న లక్ష్యాలను నిర్ణీత కాలాని కన్నా ముందే సాధిస్తోందని శ్రీ మోదీ అంటూకోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రపంచం టీకామందుల కోసం సతమతం అవుతుంటే భారతదేశ శాస్త్రవేత్తలు ఒక టీకామందును అనుకొన్న కాలాని కన్నా ముందుగానే తయారు చేశారని చెప్పారుభారత్‌లో ప్రతి ఒక్కరికీ టీకామందును ఇప్పించాలంటే 3-4 సంవత్సరాలు పడుతుందని ముందస్తు అంచనాలు వెలువడ్డామన దేశం ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయి టీకామందు కార్యక్రమాన్ని రికార్డు వ్యవధిలో నిర్వహించిందని ఆయన అన్నారుగ్రీన్ ఎనర్జీ అంశంలో భారత్ చేసిన వాగ్దానాన్ని ప్రధాని ప్రధానంగా చెబుతూప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా చేసిన వాగ్దానాన్ని షెడ్యూలు కన్నా తొమ్మిది సంవత్సరాల ముందు నిలబెట్టుకొన్న మొట్టమొదటి దేశం భారతదేశమేనని వివరించారుపెట్రోలులో 20 శాతం మేరకు ఇథనాల్‌ను మిశ్రణం చేసే లక్ష్యానికి 2030కల్లా చేరుకోవాలని భారత్ సంకల్పించుకొన్న సంగతిని కూడా ఆయన చెబుతూదీనిని కూడా గడువు కంటే చాలా ముందుగా భారత్ సాధించనుందన్నారుఈ విజయాల్లో ప్రతి ఒక్క విజయమూ ఒక్కొక్క ప్రేరణగా నిలుస్తూభారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యానికి చేరువగా తీసుకుపోతుందని ఆయన అన్నారు.

‘‘పెద్ద లక్ష్యాల్ని సాధించడం ఒక్క ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతే  కాదు... దేశంలో ప్రతి ఒక్కరి ఉమ్మడి ప్రయత్నమూ దీనికి అవసరమవుతుంద’’ని శ్రీ మోదీ అన్నారుజాతీయ లక్ష్యాలను నెరవేర్చడంలో చర్చోపచర్చలుదిశయాజమాన్య భావనలు ముఖ్యమని ఆయన ప్రధానంగా చెప్పారుఈ ప్రక్రియలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ యువతకు ప్రశ్నోత్తరాలువ్యాసరచన పోటీలునివేదికల్లో పాలుపంచుకోవడానికి అవకాశం ఇచ్చివారిని నాయకత్వ స్థానంలో నిలిపి మార్గదర్శనం చేయనిస్తుందని ప్రధాని అభివర్ణించారుఅభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని యువత తమ సొంత లక్ష్యంగా మార్చుకొందనీఇప్పుడే తాను ఆవిష్కరించిన వ్యాసాల సంకలనంలోనూతాను చూసిన పది నివేదికల్లోనూ ఈ విషయం ప్రస్ఫుటమైందంటూ ఆయన ప్రశంసలు కురిపించారుయువత సూచించిన పరిష్కారాల్లో వాస్తవికతఅనుభవం ఉట్టిపడుతున్నాయనీఈ పరిష్కారాలు దేశం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వారికున్న విస్తృత అవగాహనను తెలియజేస్తున్నాయనీ ప్రధాన మంత్రి అన్నారుయువత చాలా కోణాల్లో ఆలోచనలు చేస్తోందనీనిపుణులుమంత్రులువిధాన రూపకర్తలతో చర్చల్లో యువత చురుగ్గా పాలుపంచుకొంటోందనీ ఆయన కొనియాడారుయంగ్ లీడర్స్ డైలాగ్ నుంచి లభించే ఉపాయాలుసలహాలు ఇకమీదట జాతీయ విధానాల్లో భాగమవుతాయనీదేశాభివృద్ధికి దారిని చూపుతాయనీ ప్రధాని ప్రకటించారుయువతకు ఆయన అభినందనలను తెలియజేస్తూఒక లక్ష మంది కొత్త యువ జనాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారుయువత వారు ఇచ్చిన సలహాల అమలులో క్రియాశీలంగా పాల్గొనాలంటూ వారిని ఆయన ఉత్సాహపరిచారు.

అభివృద్ది చెందిన భారతదేశం ఎలా ఉండాలో తన దృష్టి కోణాన్ని ప్రధాని వెల్లడిస్తూఈ సందర్బంగా వికసిత్ భారత్ ఆర్థికవ్యూహాత్మకసామాజికసాంస్కృతిక శక్తిని చాటిచెప్పారుఅభివృద్ది చెందిన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థతోపాటు జీవావరణం (ఇకాలజీకూడా వర్ధిల్లాలనీమంచి విద్యార్జనకూమంచి ఆదాయార్జనకూ లెక్కపెట్టలేనన్ని అవకాశాలు అందుబాటులోకి రావాలనీ ఆయన వ్యాఖ్యానించారు.  ప్రపంచంలోకెల్లా నైపుణ్యవంతులైన యువ శ్రామిక శక్తి భారత్‌లో ఉంటుందనీవారి కలల  పరిధి ఆకాశమంత విస్తారంగా ఉంటుందనీ ఆయన అభివర్ణించారుఈ లక్ష్యాన్ని సాధించాలంటే తీసుకొన్న ప్రతి ఒక్క నిర్ణయాన్నీవేసే ప్రతి అడుగునూరూపొందించే ప్రతి విధానాన్నీ అభివృద్ది చెందిన భారతదేశం దార్శనికతకు అనుగుణంగా ఉండేటట్లు చూడాలన్నారుభారత్ ప్రగతిపథంలోకి ఒక భారీ అడుగును వేయాల్సిన తరుణం ఇదేననీఎందుకంటే మన దేశం రాబోయే కొన్ని దశాబ్దుల పాటు యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా అలరారనుందనీ ఆయన స్పష్టంచేశారు. ‘‘మన దేశ యువతకు భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)ని గణనీయంగా పెంచే సామర్థ్యం ఉందని ప్రపంచ ఏజెన్సీలు గుర్తించాయ’’ని శ్రీ మోదీ అన్నారుమహర్షి అరబిందోగురుదేవులు టాగూర్హోమీ జెభాభా ల వంటి గొప్ప ఆలోచనపరులు యువ శక్తి సత్తాను నమ్మారని శ్రీ మోదీ చెబుతూభారత యువత ప్రపంచంలో ప్రధాన కంపెనీలకు సారథులుగా ఉండివారి యోగ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నారన్నారువచ్చే 25 సంవత్సరాలు అమృత కాలం.. ఇది చాలా కీలక కాలమని  ప్రధానమంత్రి ఉద్ఘాటించారుఈ కాలంలో యువత అభివృద్ధి చెందిన భారతదేశం స్వప్నాన్ని సాకారం చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.  అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్జగతిలో భారతదేశాన్ని ప్రపంచంలో మూడు అగ్రదేశాల సరసన నిలబెట్టడంతయారీలో ముందంజ వేయడండిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో విస్తరించడంతోపాటు క్రీడల్లో రాణించడం వంటి యువత సాధిస్తున్న ఘనకార్యాలను ఒక్కటొక్కటిగా ఆయన ప్రధానంగా ప్రస్తావించారుమన దేశంలోని యువతీయువకులు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ ఉన్నప్పుడుఅభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించడం అనుమానం అక్కర్లేకుండా సాధించదగ్గదేనని ఆయన తేల్చి చెప్పారు.

నేటి యువతకు సాధికారత కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారుప్రతి వారంలో భారతదేశంలో ఒక కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారనీప్రతి రోజూ ఒక కొత్త ఐటీఐని కూడా స్థాపిస్తున్నారనీ ఆయన ప్రస్తావించారుదీనికి అదనంగాప్రతి మూడో రోజునాఒక అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్నారనీనిత్యం రెండు నూతన కళాశాలల్ని సైతం ఏర్పాటు చేస్తున్నారన్నారుమన దేశంలో ఇప్పుడు 23 ఐఐటీలు (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీఉన్నాయనీగత పదేళ్లలో ఐఐఐటీల (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీసంఖ్య నుంచి 25కు పెరిగిందనీఐఐఎమ్‌ల (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్సంఖ్య 13 నుంచి 21కి చేరిందనీ ఆయన వివరించారుఏఐఐఎంఎస్‌ల (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్సంఖ్య కూడా గడచిన పది సంవత్సరాల్లో మూడు రెట్లు అయిందనీవైద్య కళాశాలలు సుమారుగా రెట్టింపయ్యాయన్నారుదేశంలో విద్యాసంస్థలు రాశి పరంగానూవాసి పరంగానూ శ్రేష్ఠ ఫలితాలను సాధిస్తున్నాయనీక్యూఎస్ ర్యాంకింగులు తెచ్చుకొన్న ఉన్నత విద్య సంస్థల సంఖ్య 2014లో 9గా ఉన్నవి కాస్తా ప్రస్తుతం 46గా వృద్ధి చెందాయని ప్రధాని చెప్పారుభారత్‌లో విద్యా సంస్థల బలం పెరుగుతూ ఉండడం అభివృద్ధి చెందిన భారతదేశానికి ఒక చక్కని పునాది అని చెప్పవచ్చని ఆయన స్పష్టంచేశారు.

భారత్ 2047 కల్లా అభివృద్ది చెందిన దేశంగా తయారు కావాలన్న లక్ష్యం నెరవేరడానికి రోజువారీ లక్ష్యాలను పెట్టుకొనినిరంతరం కృషి చేస్తుండాలి’’ అని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారుభారతదేశం త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారుగత పదేళ్లలో25 కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటకు తీసుకువచ్చినట్లు శ్రీ మోదీ తెలిపారుత్వరలో పూర్తి దేశం పేదరికానికి చోటుండని దేశంగా మారుతుందని నమ్ముతున్నానన్నారుఈ దశాబ్దం చివరికల్లా అంటే 2030కల్లా 500 గిగావాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడంతోపాటు రైల్వేల్లో కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి చేర్చాలన్న భారత్ లక్ష్యాలను గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

వచ్చే దశాబ్దంలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వాలన్న మహత్వాకాంక్షను ప్రధాని ప్రధానంగా చెబుతూదీనిని సాధించడానికి దేశం అంకితభావాన్ని కనబరుస్తుందని స్పష్టంచేశారుభారత్ ఒక అంతరిక్ష శక్తిగానూ వేగంగా అడుగులు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 2035కల్లా అంతరిక్షంలో ఒక కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్)ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉందన్నారు. ‘చంద్రయాన్’ సఫలం కావడాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ‘గగన్‌యాన్’ కోసం ప్రస్తుతం సన్నాహాలు సాగుతున్నాయన్నారు.  భారతదేశం నుంచి ఒకరు చంద్రునిపై అడుగు పెట్టాలన్నదే అంతిమ ధ్యేయమని తెలిపారుఈ తరహా లక్ష్యాలను నెరవేర్చుకోవడం 2047కల్లా అభివృద్ధి చెందిన భారతదేశానికి బాటను పరచగలుగుతుందని ఆయన అన్నారు.

ఆర్థిక వృద్ధి ప్రభావం దైనందిన జీవనంపై ఉంటుందని ప్రధాని అంటూఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన కొద్దీఅది మనిషి జీవనంలో అన్ని అంశాలపైనా సానుకూల ఫలితాలను ప్రసరిస్తుందన్నారుఈ శతాబ్దం మొదటి పదేళ్లలోభారత్ ట్రిలియన్ (ఒక లక్ష కోట్లడాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా మారిందనీఅయితే వ్యవసాయ బడ్జెట్ మాత్రం చిన్న ఆర్థిక వ్యవస్థ మాదిరిగా కొన్ని వేల కోట్ల రూపాయల లోనే ఉందనీమౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన బడ్జెట్ రూ.1 లక్ష కోట్ల కన్నా తక్కువే ఉందని ఆయన గుర్తుకు తెచ్చారుఆ కాలంలోచాలా వరకు గ్రామాలకు సరైన రహదారులు లేవనీజాతీయ రహదారులతోపాటు రైలుమార్గాల స్థితి అధ్వానంగా ఉందనీవిద్యుత్తునీరుల వంటి ప్రాథమిక సదుపాయాలు దేశంలో చాలా పెద్ద ప్రాంతానికి అందుబాటులో లేవనీ ఆయన అన్నారు. 2 ట్రిలియన్ (2 లక్షల కోట్లడాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా మారిన తరువాతా మన దేశంలో మౌలిక సదుపాయాలకు కేటాయించిన బడ్జెట్ రూ.2 లక్షల కోట్ల లోపే ఉందని ఆయన చెప్పారుఏమైనాదేశం రోడ్లురైలు మార్గాలువిమానాశ్రయాలుకాలవలుపేదలకు ఇళ్ల నిర్మాణంపాఠశాలలతోపాటు ఆసుపత్రుల పరంగా చూసినప్పుడు మంచి మెరుగుదలను సాధించిందన్నారుభారత్ ట్రిలియన్ (3 లక్షల కోట్లడాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా శరవేగంగా ఎదిగిందనీవిమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందనీ, ‘వందే భారత్’ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టుకొన్నామనీబులెట్ రైలు కలను నెరవేర్చే దిశగా కృషి మొదలైందనీ ఆయన వ్యాఖ్యానించారుప్రపంచవ్యాప్తంగా చూస్తే 5జి సేవలను ప్రారంభించే విషయంలో మన దేశం అత్యంత వేగవంతంగా ఆ స్థాయిని అందుకొందనీబ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్‌ సేవల్ని వేల కొద్దీ గ్రామ పంచాయతీలకు విస్తరించడంతోపాటు 3,00,000 కన్నా ఎక్కువ పల్లెలకు రహదారుల్ని నిర్మించిందని కూడా ఆయన అన్నారుయువజనులకు పూచీకత్తు అక్కర్లేని తరహా ‘ముద్ర’ రుణాల రూపంలో రూ.23 లక్షల కోట్లను అందించారనీఅంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్దదైన ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను కూడా ప్రారంభించుకొన్నామన్నారుఅలాగేరైతుల బ్యాంకు ఖాతాలలో ఏటా వేల కోట్ల రూపాయల డబ్బును నేరుగా జమచేసే పథకాన్ని ప్రారంభించుకొనిపేదలకు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించుకొన్నామని ఆయన తెలిపారు.  ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న క్రమంలోఇది అభివృద్ధి కార్యకలాపాల్ని జోరందుకొనేలా చేసిందనీమరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తూ దేశంలోని ప్రతి రంగంలోనూసమాజంలోని ప్రతి వర్గంలోనూ ఖర్చు పెట్టే తాహతును పెంచిందనీ ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

 

భారత్ ప్రస్తుతం సుమారు ట్రిలియన్ (4 లక్షల కోట్లడాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా మారిందనీఫలితంగా దేశ సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయనీ ప్రధాని చెప్పారుప్రస్తుతం మౌలిక సదుపాయాల కల్పన బడ్జెట్ రూ.11 లక్షల కోట్లకు పైబడిందనీఇది ఒక దశాబ్దం కిందటి కాలం కన్నా దాదాపు రెట్లు అధికమనీ2014 సంవత్సరంలో పూర్తి మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన బడ్జెట్ కన్నా ఎక్కువ సొమ్మును ఇప్పుడు ఒక్క రైల్వేల రంగంలో ఖర్చు చేస్తున్నారనీ ఆయన తెలిపారు.  ఈ పెంచిన బడ్జెట్ ప్రభావం రూపురేఖలు మారిపోతున్న భారత్ ముఖచిత్రంలో సుస్పష్టంగా తెలియవస్తోందనీదీనికి ‘భారత్ మండపం’ ఒక సుందర ఉదాహరణనీ ఆయన వివరించారు.

 

‘‘భారత్ ట్రిలియన్ (5 లక్షల కోట్లడాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా మారే దిశలో దూసుకుపోతోందిదీంతో అభివృద్ధితోపాటు సౌకర్యాల పరిధి కూడా ఘనంగా విస్తరిస్తుంది’’ అని శ్రీ మోదీ సంతోషంగా చెప్పారువచ్చే దశాబ్ది చివరికల్లా భారత్ 10 ట్రిలియన్ (10 లక్షల కోట్లడాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థ స్థాయిని కూడా మించిపోతుందని అంచనాగా చెబుతూఇది సంభవమేనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారుఆర్థిక వ్యవస్థ ఎదిగే కొద్దీ అసంఖ్యాక అవకాశాలు లభిస్తాయంటూ యువతను ఆయన ఉత్సాహపరిచారువారి తరం దేశ చరిత్రలో అత్యంత ఘనమైన మార్పునకు చోదకశక్తిగా ఉండడం ఒక్కటే కాకుండాఆ మార్పు వల్ల లభించే ప్రయోజనాలను అందుకొనే తరంగా కూడా నిలుస్తుందని ఆయన స్పష్టంచేశారు.  యువత నిక్షేపంగా ఉండే వాతావరణం కోసం ఎదురుచూడ్డం మానుకోవాలనీరిస్కులు తీసుకోవడానికి సిద్ధపడాలనీయంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న వారు చాటినట్లుగా తమ లోపలి తపనను చాటాలంటూ ప్రధానమంత్రి సలహా ఇచ్చారుజీవనంలో ఈ మంత్రాన్ని అనుసరిస్తే వారిని అది విజయంలో కొత్త శిఖరాలకు తీసుకుపోతుందని ఆయన చెప్పారు.

భారత్ అనుసరించాల్సిన భావి మార్గసూచీ (రోడ్‌మ్యాప్)ని సిద్ధం చేయడంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమానిది ప్రముఖ పాత్ర అని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారుయువత ఈ సంకల్పాన్ని అక్కున చేర్చుకోవడంలో చూపిన శక్తినీఉత్సాహాన్నీఅంకితభావాన్నీ ఆయన మెచ్చుకొన్నారుఅభివృద్ధి చెందిన భారతదేశం ఆవిష్కరణ కోసం అందించిన ఉపాయాలు అమూల్యమైనవీశ్రేష్ఠమైనవీఅత్యుత్తమమైనవీ అని ఆయన అభివర్ణించారుఈ ఆలోచనలను దేశంలో మూలమూలకూ చేరవేసిఅభివృద్ధి చెందిన భారత్‌ను రూపొందించే విషయాలపై ప్రతి జిల్లాలోనూప్రతి గ్రామంలోనూఇరుగుపొరుగు ప్రాంతాల్లోనూ ఇతర యువతీ యువకులకు చెప్పాల్సిందిగా యువతను ప్రధాని కోరారు. 2047కల్లా అభివృ‌ద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న నిబద్ధతను ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అందరూ తమను తాము అంకితం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తూ ప్రసంగాన్ని ముగించారుజాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశంలో యువతీయువకులందరికీ ఆయన మనసారా తన  శుభాభినందనలను మరోసారి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియాకేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్కేంద్ర సహాయ మంత్రులు శ్రీ జయంత్ చౌదరిశ్రీమతి రక్ష ఖడ్‌సేఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నేపధ్యం

జాతీయ యువజనోత్సవాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తూ వచ్చిన 25 సంవత్సరాల పాత పద్ధతికి బదులు విభిన్నంగా ఉండాలనేదే ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమం లక్ష్యంఎలాంటి రాజకీయ అనుబంధాలూ లేని లక్షమంది యువతను ప్రోత్సహిస్తూ ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం)ను ఆవిష్కరించాలన్న ఆశయాన్ని నెరవేర్చేలా వారి ఆలోచనలను వెల్లడి చేయడానికి వారికి ఒక రాజకీయ వేదికను అందించాలంటూ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఈ ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమాన్ని రూపొందించారుఇదే మార్గంలోఈ జాతీయ యువజన దినోత్సవం నాడుదేశ భావి నేతలకు ప్రేరణనివ్వడానికీవారిలో స్ఫూర్తిని నింపడానికీవారికి సాధికారతను కల్పించడానికీ రూపొందించిన అనేక కార్యక్రమాల్లో ప్రధాని స్వయంగా పాలుపంచుకొన్నారుసరికొత్త ఆలోచనలున్న యువ నేతలు మన దేశం అభివృద్ధికి ముఖ్య రంగాలైన పది రంగాలకు ప్రాతినిధ్యం వహించే పది ఇతివృత్తాలపై 10 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ప్రధానమంత్రి సమక్షంలో ప్రదర్శిస్తారుఈ ప్రజెంటేషన్లు మన దేశం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన సవాళ్లలో కొన్ని సవాళ్లను పరిష్కరించడానికి యువ నేతలు ప్రతిపాదించిన సరికొత్త ఆలోచనలను తెలియజేస్తాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు పది ఇతివృత్తాలపై రాసిన అత్యుత్తమ వ్యాసాలతో కూర్చిన ఒక పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారుఈ పది ఇతివృత్తాల్లో.. టెక్నాలజీసుస్థిరతమహిళలకు సాధికారత కల్పనతయారీవ్యవసాయం వంటి విభిన్న రంగాలకు చెందిన ఇతివృత్తాలున్నాయి.

యువ నాయకులతో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో కూడా ప్రధాని పాలుపంచుకొన్నారుఈ సందర్భంగా తన సమక్షంలో వారి ఆలోచనలనుఅనుభవాలనుఆకాంక్షలను వెల్లడి చేసేందుకు వారికి ప్రధాని అవకాశాన్ని ఇచ్చినట్లయిందిపరిపాలనకూయువత ఆకాంక్షలకూ మధ్య అంతరాన్ని తొలగించడానికీకార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒక విధమైన యాజమాన్య భావననూబాధ్యతాయుత ప్రవర్తననూ పెంపొందించడానికీ ఈ మాటామంతీ తోడ్పడనుంది.  

 

జనవరి 11న మొదలుపెట్టిన ఈ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా పోటీల్లోనూవివిధ కార్యకలాపాల్లోనూసాంస్కృతిక నివేదికల్నిఇతివృత్త ప్రధాన నివేదికల్ని (థీమాటిక్ ప్రజెంటేషన్స్రూపొందించడంలోనూ యువ నేతలు నిమగ్నం  కానున్నారుసలహాదారులు (మెంటర్స్), ఆయా రంగాలకు చెందిన నిపుణుల నాయకత్వంలో చర్చోపచర్చలుంటాయిమన దేశ కళాత్మక వారసత్వాన్ని కళ్లకు కట్టే సాంస్కృతిక ప్రదర్శనలనూమన దేశం సాధించిన ఆధునిక విజయాలనూ ఈ కార్యక్రమంలో చాటిచెప్పనున్నారు.

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి హుషారైనప్రేరణశక్తిని కలిగి ఉన్న 3,000 మందిని ఎంపిక చేశారుదీనికోసం ‘‘వికసిత్ భారత్ ఛాలెంజ్’’ అనే ఒక పోటీని నిర్వహించారుఈ పోటీకి ఎంతో శ్రద్ధగా రూపకల్పన చేశారుదేశవ్యాప్తంగా అత్యంత స్ఫూర్తివంతుల్నీచురుకైన యువతనూ గుర్తించి వారిలోని ప్రతిభను వెలికితీయడానికి అనేక స్థాయిలలో వడపోసి మరీ ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారుదీనిలో భాగంగా 15 - 29 ఏళ్ల మధ్య వయస్సు గల వారిని మూడు దశల్లో పరీక్షించారుమొదటి దశలో, ‘వికసిత్ భారత్ క్విజ్’ (అభివృద్ధి చెందిన భారతదేశం అంశంపై ప్రశ్న-జవాబుల పోటీ)ని 12 భాషలలో నిర్వహించారుదీనిలో అన్ని రాష్ట్రాలకు చెందిన యువత సుమారు 30 లక్షల మంది పాల్గొన్నారుక్విజ్‌లో పాల్గొని అర్హత సాధించిన వారు రెండో దశలోకి ముందడుగు వేశారురెండో దశలో వ్యాసరచన పోటీ నిర్వహించారుదీనిలో పాల్గొన్న వారు ‘‘వికసిత్ భారత్’’ దార్శనికతను సాకారం చేయడంలో కీలక పది అంశాలపై తమ భావాలను వ్యాసాల రూపంలో వ్యక్తంచేశారుఈ పోటీలో లక్షలకు పైగా వ్యాసాల్ని దాఖలుచేశారుమూడో దశ రాష్ట్ర స్థాయి పోటీలుఒక్కొక్క ఇతివృత్తానికీ 25 మంది అభ్యర్థుల చొప్పున  ఈ పోటీకి అర్హతను సాధించారుప్రతి ఒక్క రాష్ట్రం తన ముగ్గురు అగ్రగామి అభ్యర్థుల్ని గుర్తించివారిని ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి ఈవెంట్‌లో పాల్గొనాల్సిన డైనమిక్ టీములుగా పంపించింది.

ఈ డైలాగ్‌ కార్యక్రమానికి రావాల్సిందిగా వికసిత్ భారత్ చాలెంజ్ ట్రాక్‌లో పాల్గొన్న 500 జట్లకు చెందిన 1500 మందినీ ట్రెడిషనల్ ట్రాక్ లో పాల్గొన్న 1,000 మందినీ (వీరిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలుసాంస్కృతిక కార్యక్రమాలుసైన్స్టెక్నాలజీ రంగంలో నవకల్పన అంశంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనల ప్రాతిపదికలపై ఎంపిక చేశారు), 500 మంది వినూత్న ఆలోచనలను అందించిన వారినీ ఆహ్వానించారు


(Release ID: 2092890) Visitor Counter : 6