ప్రధాన మంత్రి కార్యాలయం
మన సాయుధ దళాల మాజీ సైనికులు... హీరోలు, దేశభక్తికి ప్రతీకలు: ప్రధాని
प्रविष्टि तिथि:
14 JAN 2025 1:21PM by PIB Hyderabad
సాయుధ దళాల సీనియర్ జవాన్ల దినోత్సవం (వెటరన్స్ డే) సందర్భంగా ప్రధానమంత్రి ఈ రోజు మన దేశరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ధైర్యవంతులైన మాజీ సైనికులకు కృతజ్ఞతలు తెలియచేశారు. వెటరన్ జవాన్లను వీరులుగా, దేశభక్తికి శాశ్వత ప్రతీకలుగా ప్రధాని అభివర్ణించారు.
'సాయుధ దళాల సీనియర్ జవాన్ల (వెటరన్స్ డే) దినోత్సవం సందర్భంగా, దేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన ధైర్యవంతులైన మహిళలు, పురుషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి త్యాగాలు, ధైర్యసాహసాలు, విధి నిర్వహణలో వారి అచంచలమైన నిబద్ధత ఆదర్శనీయం. మన సీనియర్ జవాన్లు వీరులు, దేశభక్తికి చిరస్మరణీయ చిహ్నాలు. మాది ఎల్లప్పుడూ అనుభవజ్ఞుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఇకముందు కూడా ఇలాగే పనిచేస్తాం” అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2092882)
आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam