సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నమామి గంగే ద్వారా మహాకుంభ మేళా-2025లో శుభ్రతను పునర్నిర్వచిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు


భక్తుల సౌకర్యార్థం పర్యావరణహిత పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా 28,000 మరుగుదొడ్లు, 20,000 మూత్రశాలల ఏర్పాటు, 37.75 లక్షల సంచులతో వ్యర్థాల సేకరణ

प्रविष्टि तिथि: 10 JAN 2025 4:41PM by PIB Hyderabad

క్లీన్ గంగా జాతీయ మిషన్‌లో భాగంగా మహాకుంభ మేళా-2025లో రూ.152.37 కోట్లతో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారుఆధునిక సాంకేతికతసంప్రదాయ పద్ధతులను మేళవించి శుభ్రమైనసుస్థిరమైన వాతావరణాన్ని ఈ ఉత్సవంలో అందిచనున్నారు.

గంగా నది పవిత్రతను కాపాడటంవ్యర్థాల సమర్థ నిర్వహణప్లాస్టిక్ రహిత జోన్లను రూపొందించడం మహాకుంభ మేళా- 2025 ఏర్పాట్లలో ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయిఈ ఉత్సవం జరుగుతున్న ప్రదేశంలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమివ్వడం ద్వారా పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించే విషయంలో ప్రామాణికంగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

సెప్టిక్ ట్యాంకులతో పాటు నిర్మించిన 12,000 ఫైబర్ రీఇన్ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ (ఎఫ్‌ఆర్‌పీటాయిలెట్లుఇంకుడు గుంతలతో నిర్మించిన 16,100 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ టాయిలెట్లతో సహా మొత్తం పాటు 28,000కు పైగా టాయిలెట్లను ఈ ఉత్సవంలో ఏర్పాటు చేశారుశుభ్రతను అందించడంతో పాటుపర్యావరణహిత విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని నిర్మించారుఅలాగే ప్రకృతిహిత పద్ధతులను ప్రోత్సహిస్తూ భక్తులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు గాను 20,000 మూత్ర శాలలు ఏర్పాటు చేశారు

కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో మెరుగైన వ్యర్థాలను నిర్వహణ నిమిత్తం ఆరంభంలోనే చెత్తను వేరు చేసి పునర్వినియోగించుకోవడానికిరీసైక్లింగ్ చేయడానికి వీలుగా 20,000 చెత్త బుట్టలను ఏర్పాటు చేశారువ్యర్థాలను సేకరించి వాటిని పారవేయడానికి 37.75 లక్షల సంచులను ఉపయోగించనున్నారుఇలా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ పకడ్బందీగా నిర్వహించడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగాపర్యావరణహితంగా ఉంచుతారుమహాకుంభ 2025 నిర్వహణ కోసం అనుసరిస్తున్న వ్యూహాలు శుభ్రతలో అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించడంతో పాటు పర్యావరణ సుస్థిరత విషయంలో దేశానికున్న అంకితభావాన్ని తెలియజేస్తాయి.

మహాకుంభ 2025 కేవలం ఆధ్యాత్మిక ఉత్సవంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణపరిశుభ్రతకు ఉదాహరణగా నిలవనుందిగంగా నది స్వచ్ఛతను కాపాడుతూసుస్థిరమైన వ్యర్థాల నిర్వహణప్లాస్టిక్ రహిత జోన్లను ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వ అంకిత భావాన్ని ఈ కార్యక్రమాలు తెలియజేస్తున్నాయిఈ పవిత్ర ఉత్సవం ద్వారా పారిశుద్ధ్యంపర్యావరణ పరిరక్షణపై సమాజంలో అవగాహన పెరుగుతుందిమహాకుంభ మేళా 2025 నిమిత్తం చేపడుతున్న ఈ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రస్తుత తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తినిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2092262) आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Assamese , Gujarati , Tamil , Malayalam