ప్రధాన మంత్రి కార్యాలయం
మన యువశక్తి కలలు.. నైపుణ్యాలు.. ఆకాంక్షలను ‘వికసిత భారత్ యువ నాయక చర్చాగోష్ఠి’ నెరవేరుస్తుంది: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 JAN 2025 7:24PM by PIB Hyderabad
దేశ యువతరం కలలు, నైపుణ్యాలు, ఆకాంక్షలను ‘వికసిత భారత్ యువ నాయక చర్చాగోష్ఠి’ నెరవేరుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. తదనుగుణంగా యువ మిత్రులు అధిక సంఖ్యలో దేశ పునర్నిర్మాణానికి నాయకత్వం వహించేలా నిబద్ధతతో శ్రద్ధ చూపుతామని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రస్తుత చర్చాగోష్ఠి ఓ కీలక కార్యక్రమమని, ఈ సందర్భంగా యువతరం ఉత్సాహాన్ని చూసి తీరాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
వికసిత భారత్ యువ నాయక చర్చాగోష్ఠిపై కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా చేసిన సందేశానికి ప్రతిస్పందిస్తూ:-
“దేశ యువతరం కలలు, నైపుణ్యాలు, ఆకాంక్షలను ‘వికసిత భారత్ యువ నాయక చర్చాగోష్ఠి’ నెరవేరుస్తుంది. ఈ నేపథ్యంలో 12వ తేదీన వారితో సంభాషించేందుకు నేనెంతగానో ఎదురుచూస్తున్నాను!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2092257)
आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam