ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాభిమాన్ గృహ సముదాయం లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ

Posted On: 03 JAN 2025 8:24PM by PIB Hyderabad

అందరికీ ఇల్లు’ అందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ గృహసముదాయంలో నిర్మించిన ఫ్లాట్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సందర్శించారుయధాస్థానంలో మురికివాడ పునరావాస ప్రాజెక్టులో భాగంగా జుగ్గీ జోప్రి (జేజేక్లస్టర్లలోని నివాసితుల కోసం వీటిని నిర్మించారుస్వాభిమాన్ అపార్ట్మెంట్ల లబ్ధిదారులతో ప్రధాని శ్రీ మోదీ ముచ్చటించారు.

స్వాభిమాన్ గృహసముదాయంలోకి మారబోతున్న లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషిస్తూప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమం తీసుకొచ్చిన మార్పుల పట్ల తన సంతోషం వ్యక్తం చేశారుగతంలో మురికివాడల్లో నివసించిన వారికి శాశ్వత గృహాలు పొందిన అనంతరం వారి జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పులు ఈ సంభాషణలో ప్రతిఫలించాయి.

లబ్ధిదారుల సంభాషణలో భాగంగా ‘‘మీరు ఇల్లు తీసుకున్నారా?’’ అని ప్రధాని ప్రశ్నించారుదానికి ‘‘అవును సార్మేం దాన్ని తీసుకున్నాంగుడిసె నుంచి రాజభవనంలోకి మమ్మల్ని తీసుకొచ్చిన మీకు కృతజ్ఞులం’’ అని ఓ లబ్ధిదారుడు జవాబిచ్చారు.  దీనికి ప్రధాని ప్రతిస్పందిస్తూ తనకంటూ ఒక ఇల్లు లేదనిమీ అందరికీ ఇల్లు ఉందని వినయంగా తెలిపారు.

మరో లబ్ధిదారుడు తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ.. ‘‘అవును సార్మీ జెండా ఎల్లప్పుడూ మరింత ఎత్తులో ఎగురుతూనే ఉండాలిమీరు గెలుస్తూనే ఉండాలి’’ అని అన్నారుదీనికి ప్రతిగా ప్రజల బాధ్యతను గుర్తు చేస్తూ ‘‘మా జెండా ఎగురుతూ ఉండాలి అంటేఅది మీ చేతుల్లోనే ఉంది’’ అని ప్రధానమంత్రి జవాబిచ్చారుకష్టమైన జీవన పరిస్థితుల నుంచి సొంత ఇంటిలోకి మారుతున్నామనే ఆనందాన్ని పంచుకుంటూ ఆ లబ్ధిదారుడు ‘‘చాలా ఏళ్ల పాటు శ్రీ రాముని కోసం ఎదురుచూశాంఅలాగే మీ కోసం కూడా ఎదురుచూస్తూ ఉన్నాంమీరు చేసిన కృషి వల్లే మురికివాడల నుంచి ఈ భవనానికి మారుతున్నాంమీరు మాకు ఇలా చాలా దగ్గరగా ఉండటం మా అదృష్టం’’ అని అన్నారు.

ఐక్యతప్రగతి గురించి ప్రస్తావిస్తూ, ‘‘మనమంతా సమష్టిగా ఈ దేశంలో చాలా సాధించగలమని మనల్ని చూసి ఇతరులు స్ఫూర్తి పొందాలి’’ అని ప్రధాని శ్రీ మోదీ వివరించారు.

అట్టడుగు స్థాయి నుంచి ప్రయాణం ప్రారంభించిన పేద కుటుంబాలకు చెందిన పిల్లలు వివిధ రంగాల్లో ముఖ్యంగా క్రీడల్లో రాణిస్తూ దేశం గర్వించేలా ఎలా విజయాలు సాధిస్తున్నారో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారువారు తమ కలల్ని కొనసాగించాలని ప్రదానమంత్రి వారిని ప్రోత్సహించారుతాను సైన్యంలో చేరాలనుకుంటున్నానని ఓ లబ్ధిదారుడు చెప్పగా ప్రధాని సానుకూలంగా స్పందించారు.

అలాగేనూతన గృహాల విషయంలో వారి ఆకాంక్షల గురించి లబ్ధిదారులను ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారుఓ యువతి తన చదువుపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపిందిఏమవ్వాలనుకుంటున్నావని ఆమెను ప్రశ్నించినప్పుడు ‘టీచర్’ అని ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చింది.

మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా స్పృశిస్తూ ప్రధానమంత్రి తన సంభాషణను కొనసాగించారుకార్మికులుగా లేదా ఆటో రిక్షా డ్రైవర్లుగా పనిచేసేవారి కుటుంబాలు ఇప్పుడు తమ కోసం మంచి భవిష్యత్తును సృష్టించుకునే అవకాశం దొరికిందని ప్రధాని అన్నారురాబోతున్న పండగలను కొత్త ఇళ్లలో ఎలా జరుపుకొంటారని ప్రధాని అడిగారుసమాజంలో ఐక్యతఆనందం వెల్లివెరిసేలా సామూహికంగా జరుపుకుంటామని లబ్ధిదారులు పంచుకున్నారు.

లబ్ధిదారులకుదేశానికి భరోసా ఇస్తూ ప్రధానమంత్రి తన సంభాషణను ముగించారుఇంకా శాశ్వత గృహాలు పొందని వారికి కూడా ఇల్లు వస్తుందనేది తన హామీ అన్నారుఈ దేశంలోని ప్రతి పేదవాడికీ శాశ్వత నివాసం ఉండేలా ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలియజేశారు.

 

 

***

MJPS/VJ


(Release ID: 2090388) Visitor Counter : 27