ప్రధాన మంత్రి కార్యాలయం
చిరకాల అనుభవం కలిగిన పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం మృతికి ప్రధానమంత్రి సంతాపం
Posted On:
04 JAN 2025 12:46PM by PIB Hyderabad
సుదీర్ఘ అనుభవం కలిగిన పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ పరమాణు కార్యక్రమ కీలక రూపశిల్పుల్లో డాక్టర్ రాజగోపాల చిందంబరం ఒకరనీ, విజ్ఞానశాస్త్ర రంగంలో భారత్‌కున్న సామర్థ్యాలతోపాటు వ్యూహాత్మకంగా కూడా భారత్‌కున్న సామర్థ్యాలను బలపరచడంలో ఆయన కొత్త పుంతలు తొక్కారా అన్న మాదిరిగా సేవల్ని అందించారంటూ శ్రీ మోదీ ప్రశంసించారు.
సామాజిక ప్రసార మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి నమోదు చేస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘డాక్టర్ రాజగోపాల చిదంబరం మనను వీడివెళ్లారన్న సంగతి తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యాను. భారత్ పరమాణు కార్యక్రమం కీలక రూపశిల్పుల్లో ఆయన ఒకరు. మన దేశ విజ్ఞానశాస్త్ర శక్తియుక్తులను, వ్యూహాత్మక సామర్థ్యాలనూ బలపరచడంలో మార్గదర్శకంగా నిలచే అనేక సేవల్ని ఆయన అందించారు. ఆయనను యావత్తు దేశ ప్రజలు కృతజ్ఞతపూర్వకంగా స్మరించుకొంటారు, ఆయన చేసిన కృషి భావి తరాల వారికి సైతం ప్రేరణనిస్తూ ఉంటుంది.’’
(Release ID: 2090383)
Visitor Counter : 18
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam