ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పంజాబ్ లోని బతిందాలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి

Posted On: 27 DEC 2024 7:31PM by PIB Hyderabad

పంజాబ్ లోని బతిందాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

“పంజాబ్ లోని బతిందాలో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు మృతిచెందడం బాధాకరమైన విషయం. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

మరణించిన ప్రతీ వ్యక్తి కుటుంబానికి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. గాయాల పాలైన వ్యక్తులకు రూ. 50 వేల చొప్పున అందిస్తాం: ప్రధానమంత్రి @narendramodi” 

 

 

***

MJPS/SR


(Release ID: 2088771) Visitor Counter : 12