ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కువైట్‌లో కార్మికుల శిబిరాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 21 DEC 2024 7:00PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటిస్తున్న సందర్భంగా తన మొదటి కార్యక్రమంలో భాగంగా అక్కడ మీనా అబ్దుల్లా ప్రాంతంలో ఉన్న ఒక కార్మికుల శిబిరానికి వెళ్లారు. అక్కడ దాదాపు 1500 మంది భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రధాని భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కలుసుకొని వారితో మాట్లాడి, వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని కార్మికుల శిబిరానికి వెళ్లడం విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికుల సంక్షేమానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతోంది. గత కొన్నేళ్లలో, ప్రభుత్వం విదేశాల్లో భారతీయ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ-మైగ్రేట్ (E-Migrate) పోర్టల్, ఎంఏడీఏడీ (MADAD..‘మదద్’) పోర్టల్‌లను రూపొందించడం, ప్రవాసీ భారతీయ బీమా యోజనలో మెరుగైన మార్పుచేర్పులను చేయడం వంటి అనేక టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను చేపట్టింది.

 


(रिलीज़ आईडी: 2087105) आगंतुक पटल : 59
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam