ప్రధాన మంత్రి కార్యాలయం
రణ్ ఉత్సవ్ సందర్భంగా రణ్ సహజ ధవళ సౌందర్యాన్నీ.. కచ్ అద్భుత సంస్కృతిని, ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని ప్రధానిపిలుపు
Posted On:
21 DEC 2024 10:08AM by PIB Hyderabad
2025 మార్చి వరకు కొనసాగనున్న రణ్ ఉత్సవ్ ను అందరూ సందర్శించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఈ పర్వం మరపురాని అనుభూతిని కలిగిస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ హామీ ఇచ్చారు.
"కచ్ మీ అందరి కోసం ఎదురుచూస్తోంది! రండి, రణ్ ఉత్సవ్ సందర్భంగా సహజ ధవళ శోభితమైన రణ్ ను, కచ్ అద్భుతమైన సంస్కృతిని, ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించండి. 2025 మార్చి వరకు జరిగే ఈ పండుగ మీకు, మీ కుటుంబానికి మరపురాని అనుభూతిని కలిగిస్తుంది" అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన పేర్కొన్నారు.
‘‘కచ్ పరంపర, సంస్కృతి, వారసత్వాలకు ప్రతీక అయిన రణ్ ఉత్సవ్ ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నచ్చుతుందనడంలో సందేహం లేదు. అద్భుతమైన హస్తకళల మార్కెట్ అయినా, సాంస్కృతిక కార్యక్రమాలైనా, ఆహార సంప్రదాయాలైనా.. ఇక్కడ మీరు మరపు రాని అనుభవాలను పొందుతారు. ఈ రణ్ ఉత్సవ్ కు మీరంతా ఒకసారి మీ కుటుంబ సమేతంగా రావాలని కోరుతున్నాను’’
"कच्छ की परंपरा, संस्कृति और विरासत का प्रतीक रण उत्सव हर किसी का मन मोह लेने वाला है। अद्भुत क्राफ्ट बाजार हो, सांस्कृतिक कार्यक्रम या फिर खान-पान की परंपरा, यहां का आपका हर अनुभव अविस्मरणीय बन जाएगा। आप सभी से मेरा आग्रह है कि एक बार अपने परिवार के साथ इस रण उत्सव में जरूर आएं।"
***
MJPS/VJ
(Release ID: 2086969)
Visitor Counter : 50
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam