రైల్వే మంత్రిత్వ శాఖ
మహా కుంభమేళా ఉచిత ప్రయాణంపై వివరణ
प्रविष्टि तिथि:
18 DEC 2024 1:14PM by PIB Hyderabad
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్టు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్న విషయం భారతీయ రైల్వే దృష్టికి వచ్చింది. ఈ నివేదికలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారతీయ రైల్వే నిర్ద్వంద్వంగా ఖండించింది.
చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ప్రయాణించడం భారతీయ రైల్వే నియమ నిబంధనల ప్రకారం నిషిద్ధం, అది శిక్షార్హమైన నేరం కూడా. మహా కుంభమేళా లేదా మరే ఇతర సందర్భంలోగానీ.. ఉచిత ప్రయాణానికి సంబంధించి ఎలాంటి వెసులుబాటూ లేదు.
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాణికులకు నిరంతరాయంగా ప్రయాణ సేవలందించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉంది. ప్రయాణికుల రద్దీ దృష్యా.. వారు వేచి ఉండేందుకు అదనంగా ప్రత్యేక ప్రాంతాలు, అదనపు టికెట్ కౌంటర్లు సహా అవసరమైన ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు.
(रिलीज़ आईडी: 2085574)
आगंतुक पटल : 113