ప్రధాన మంత్రి కార్యాలయం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు స్వాగతం పలికిన శ్రీ మోదీ
‘ఐఎంఈఈసీ’ కారిడార్ సహా భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం దిశగా తీసుకోవలసిన చర్యల గురించి చర్చించిన నేతలు
పశ్చిమాసియా, పరిసర ప్రాంతాల్లో సుస్థిర శాంతి స్థాపన, భద్రతా చర్యలకు భారత్ మద్దతు కొనసాగిస్తుందని పునరుద్ఘాటించిన ప్రధాని
యూఏఈ లో నివసించే భారతీయుల సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకున్న యూఏఈ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
12 DEC 2024 8:43PM by PIB Hyderabad
ఈ రోజు భారత్ కు విచ్చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.
భారత్-యూఏఈ దేశాధినేతలు, ఉన్నతాధికారులు తరుచూ ద్వైపాక్షిక పర్యటనలు చేపట్టడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయెద్ అల్ నహ్యాన్ కు ప్రధాని శుభాకాంక్షలు అందజేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాల కొనసాగింపునకు ప్రతీకగా, నూతన తరానికి చెందిన అబు ధాబీ యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ బిన్ జయెద్ అల్ నహ్యాన్ సెప్టెంబర్ మాసంలో భారత్ ను సందర్శించారని శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.
(Release ID: 2084287)
Visitor Counter : 20
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam