ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ బస్సు దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల సంతాపం తెలియజేసిన ప్రధానమంత్రి : ప్రధానమంత్రి సహాయనిధి నుండి తక్షణ సహాయ ప్రకటన
प्रविष्टि तिथि:
06 DEC 2024 8:05PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ లో నేడు జరిగిన బస్సు దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయాలపాలైన వారికి రూ. 50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుండి తక్షణ సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ లో జరిగిన బస్సు దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్ను కలిచివేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి సన్నిహితులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాలుపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. స్థానిక పాలనా యంత్రాంగం బాధితులకు తగిన సహాయ సహకారాలు అందిస్తోంది.
ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి చనిపోయినవారి కుటుంబసభ్యులకు 2 లక్షల రూపాయలు, గాయాలపాలైన వారికి 50,000 రూపాయల చొప్పున తక్షణ సహాయాన్ని అందజేస్తాం: PM @narendramodi" అని పేర్కొన్నారు.
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2081788)
आगंतुक पटल : 52
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam