ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2024-జూనియర్ ఆసియా కప్ విజేతలుగా నిలిచిన భారత పురుషుల జూనియర్ హాకీ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 05 DEC 2024 10:44AM by PIB Hyderabad

2024-జూనియర్ ఆసియా కప్ విజేతలుగా నిలిచిన భారత పురుషుల జూనియర్ హాకీ బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధాని శుభాకాంక్షలు అందజేశారు:
“మన హాకీ చాంపియన్ల ఘనత గర్వించదగ్గది!

భారత పురుషుల జూనియర్ టీం 2024-జూనియర్ ఆసియా కప్ టైటిల్ ని సొంతం చేసుకోవడం భారతీయ హాకీ చరిత్రలో గొప్ప క్షణాలుసాటిలేని నైపుణ్యం, అకుంఠిత దీక్ష, అసాధారణమైన టీమ్ వర్క్ తో క్రీడాకారులు సాధించిన ఈ విజయం.. క్రీడా చరిత్ర పుటల్లో లిఖించదగ్గది.

యువ బృందానికి హార్దిక అభినందనలు.. భవిష్యత్తు పోటీల్లో వీరు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను”.


 

******


MJPS/TS


(Release ID: 2081057) Visitor Counter : 30