హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భువనేశ్వర్ లో 59వ డీజీపీలు/ఐజీపీల సదస్సును ప్రారంభించిన కేంద్ర హోం శాఖ, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


తూర్పు సరిహద్దులో తలెత్తుతున్న భద్రత సవాళ్లు, వలసలు, పట్టణ పోలీసు వ్యవస్థలో ధోరణులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్న హోం మంత్రి

పక్కా వ్యూహంతో కూడిన కార్యక్రమాలు, కార్యాచరణతో సహనానికి అవకాశంలేని విధానం అమలుకు శ్రీ అమిత్ షా పిలుపు

Posted On: 29 NOV 2024 9:18PM by PIB Hyderabad

ఒడిషాలోని భువనేశ్వర్ లో 59వ డీజీపీలు/ఐజీపీల సదస్సును కేంద్ర హోంశాఖసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శుక్రవారం ప్రారంభించారుసదస్సు రెండుమూడో రోజు జరిగే కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారుఈ సదస్సుకు అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు/ఐజీపీలుసీఏపీఎఫ్సీపీవోల అధిపతులు భౌతికంగానూ.. అన్ని రాష్ట్రాల నుంచి వివిధ హోదాల్లో ఉన్న అధికారులు వర్చువల్ గానూ హాజరవుతారుజాతీయ భద్రతా సలహాదారుహోం శాఖ సహాయ మంత్రికేంద్ర హోం శాఖ కార్యదర్శి కూడా చర్చల్లో పాల్గొన్నారు.

ప్రతిభావంతమైన సేవలందించిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పోలీసు పతకాలు అందించారుదాంతోపాటు ‘ర్యాంకింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ 2024’పై హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారుమూడు అత్యుత్తమ పోలీస్ స్టేషన్లకు ట్రోఫీలను కూడా శ్రీ అమిత్ షా అందించారు.

2024 సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడంతోపాటు కొత్త క్రిమినల్ చట్టాలను సజావుగా ముందుకు తీసుకుపోతున్న పోలీసు నాయకత్వాన్ని శ్రీ అమిత్ షా తన ప్రారంభోపన్యాసంలో అభినందించారు.

జమ్మూ-కాశ్మీర్ఈశాన్యవామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలలో భద్రత పరిస్థితులు గణనీయంగా మెరుగవడంపై కేంద్ర హోం శాఖసహకార శాఖ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

కొత్త క్రిమినల్ చట్టాలు దేశంలో నేర న్యాయ వ్యవస్థ స్వభావాన్ని శిక్ష ఆధారితం నుంచి న్యాయ ఆధారితంగా మార్చాయని శ్రీ అమిత్ షా అన్నారుకొత్త చట్టాల స్ఫూర్తికి మూలాలు భారతీయ సంప్రదాయంలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

2047 నాటికి ‘వికసిత భారత్’ అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాధించడంలో2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో భద్రతను నెలకొల్పడం ఎంత ఆవశ్యకమైనదో కేంద్ర హోంశాఖ మంత్రి స్పష్టంచేశారుతూర్పు సరిహద్దులో ఎదురవుతున్న భద్రత సవాళ్లువలసలుపట్టణ పోలీసు వ్యవస్థ ధోణులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని హోం శాఖ మంత్రి అన్నారుజీరో టాలరెన్స్ పాలసీని అమలు చేయాలని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారుఇందుకోసం పక్కా వ్యూహంతో కూడిన కార్యక్రమాలుకార్యాచరణ అమలు చేయాలని సూచించారు.

సదస్సులో తర్వాతి రెండు రోజుల్లో.. పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతసరికొత్త జాతీయ భద్రత సవాళ్లను ఎదుర్కోవడం కోసం ప్రణాళికను రూపొందిస్తారువామపక్ష తీవ్రవాదంతీర ప్రాంత భద్రతమత్తు పదార్థాలుసైబర్ నేరాలుఆర్థిక భద్రత సహా పలు అంశాలు ఇందులో ఉన్నాయిపోలీసు వ్యవస్థలో కొత్త నేర చట్టాలుకార్యక్రమాలుఅత్యుత్తమ విధానాల అమలులో పురోగతిని కూడా రెండు రోజుల్లో సమీక్షిస్తారు.  

 

***


(Release ID: 2079371)