ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్ లోని శి యోమీ జిల్లాలో 240 ఎమ్‌డబ్ల్యూ సామర్థ్యం గల హియో జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం;


పెట్టుబడి ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర;

రూ. 1939 కోట్ల ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 50 నెలల గడువు

Posted On: 25 NOV 2024 8:49PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్‌లోని శి యోమీ జిల్లాలో హియో జల విద్యుత్తు ప్రాజెక్టు (హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు..హెచ్‌ఈపీ)ని నిర్మించడానికి రూ. 1939 కోట్లు పెట్టుబడిని పెట్టడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదాన్ని తెలిపింది.  ఈ ప్రాజెక్టు 50 నెలల్లో పూర్తి కాగలదని భావిస్తున్నారు.    

ఒక్కొక్కటీ 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్ల (3 x 80 ఎమ్ డబ్ల్యూ)తో కూడి ఉండే ఈ ప్రాజెక్టు 1000 మిలియన్ యూనిట్ల (ఎమ్‌యూ) విద్యుత్ ఉత్పత్తి చేయనుంది.  ఈ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా స్థితిని మెరుగుపరచడానికి తోడ్పాటు ను అందించడమే కాకుండా జాతీయ గ్రిడ్‌ నిలవకు కూడా సాయపడనుంది.

 

ఈ ప్రాజెక్టును అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ఈఈపీసీఓ) లు కలిసి ఏర్పాటు చేసే సంయుక్త సంస్థ (జాయింట్ వెంచర్.. జేవీ) అమలు చేయనుంది.  దీనిలో భాగంగా రహదారులను, వంతెనలను, విద్యుత్తు ప్రసార మార్గానికి కావలసిన ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడానికి రూ.127.28 కోట్ల నిధులను బడ్జెటు నుంచి కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది.  అంతేకాకుండా రాష్ట్ర వాటా మూలధనం రూపంలో రూ.130.43 కోట్ల కేంద్రీయ ఆర్థిక సహాయాన్ని కూడా అందించనుంది.

 

రాష్ట్రానికి 12 శాతం ఉచిత విద్యుత్తు లభించడమే కాక, లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ (ఎల్ఏడీఎఫ్)కు మరో 1 శాతం లాభం కూడా సమకూరనుంది.  దీనికి అదనంగా, ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించనుంది.

 

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లక్ష్యాలకు, ఉద్దేశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు స్థానిక సరఫరా సంస్థలకు, వ్యాపార సంస్థలకు, సూక్ష్మ,లఘు, మధ్యతరహా వాణిజ్య వ్యవస్థల (ఎమ్ఎస్ఎమ్ఈ స్)కు అనేక ప్రయోజనాలను అందించనుంది.  ఎన్ఈఈపీసీఓ నుంచి సుమారు 200  మంది సిబ్బంది, కాంట్రాక్టరు వైపు నుంచి దాదాపుగా 400 మంది శ్రామికులు ప్రాజెక్టు నిర్మాణ దశలో పాలుపంచుకోనున్నారు.  దీనికి తోడు, ఈ ప్రాజెక్టు వేరు వేరు చిన్న కాంట్రాక్టులు, సేవల రూపంలో స్థానికులకు పరోక్ష ఉపాధి అవకాశాలను చెప్పుకోదగిన స్థాయిలో కల్పించనుంది. ప్రాజెక్టు కార్యాచరణ, నిర్వహణ (ఓ అండ్ ఎమ్) కాలంలోనూ ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.  ఈ ప్రాజెక్టును అభివృద్ధి పరచడంవల్ల రవాణా, పర్యటన, చిన్నతరహా వ్యాపారాల వంటి రంగాల్లో బతుకుతెరువు అవకాశాలు అంది రానున్నాయి.

 

****


(Release ID: 2077400) Visitor Counter : 3