ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 08 NOV 2024 8:50PM by PIB Hyderabad

శ్రీ ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశం ఆరాధించదగిన రాజనీతిజ్ఞుడు శ్రీ ఎల్‌కే అద్వానీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు అద్వానీ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.
శ్రీ ఎల్‌కే అద్వానీ నివాసానికి కూడా వెళ్లి ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్రమోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

‘‘జన్మదినం సందర్భంగా శ్రీ ఎల్ కే అద్వానీ గారికి శుభాకాంక్షలు. దేశానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు భారతరత్న పురస్కారం పొందిన ఈ సంవత్సరం మరింత ప్రత్యేకమైనది. భారత్ ఆరాధించదగిన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు అద్వానీ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మేధ, దార్శనికత ఎల్లప్పుడూ ఆయనను గౌరవనీయుడిగా నిలిపాయి. ఎన్నో ఏళ్లుగా ఆయన మార్గదర్శకత్వం పొందడం నా అదృష్టం. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

 

 

‘‘అద్వానీ గారి నివాసానికి వెళ్లి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను.’’

 

 

***

MJPS/VJ


(Release ID: 2071946) Visitor Counter : 26