ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కెనడాలో హిందూ ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

అలాంటి చర్యలు భారత్ స్థైర్యాన్ని దెబ్బ తీయలేవు

కెనడా ప్రభుత్వం న్యాయ బద్ధంగా వ్యవహరిస్తుందని, చట్టాలను సక్రమంగా అమలు చేస్తుందని ఆశిస్తున్నాం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 04 NOV 2024 8:33PM by PIB Hyderabad

కెనడాలోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దానితోపాటు భారత దౌత్యవేత్తలు ఎదుర్కొంటున్న బెదిరింపులనూ ఆయన తీవ్రంగా పరిగణించారు. కెనడా ప్రభుత్వం చట్టాలను సక్రమంగా అమలు చేసి న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరిన ప్రధాని, ఈ విషయంలో దేశ దృఢ సంకల్పాన్ని స్పష్టం చేశారు.

‘‘కెనడాలోని హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మన దౌత్యవేత్తలను బెదిరించే పిరికి చర్యలూ అంతే హేయమైనవి. అలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ స్థైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవు. కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని, చట్టాలను సక్రమంగా అమలు చేస్తుందని ఆశిస్తున్నాం’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

 

***

MJPS/SS


(रिलीज़ आईडी: 2070738) आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam