హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్రెజిల్ లో జరిగిన జి-20 డీఆర్ఆర్ డబ్ల్యూజీ మంత్రుల సమావేశంలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందం

Posted On: 02 NOV 2024 10:00AM by PIB Hyderabad

ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం 2024, అక్టోబరు 30వ తేదీ నుంచి నవంబరు ఒకటో తేదీ వరకూ బ్రెజిల్ దేశంలోని బెలెంలో జరిగిన జి-20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గ్రూపు (డీఆర్ఆర్ డబ్ల్యూజీమంత్రుల సమావేశంలో పాల్గొన్నది.

భారత ప్రతినిధి బృందం చురుగ్గా నిర్వహించిన చర్చల కారణంగా విపత్తు ప్రమాదాన్ని తగ్గించుకోవడం (డీఆర్ఆర్)పై మంత్రుల సమావేశపు తొలి ప్రకటనపై ఏకాభిప్రాయం సుసాధ్యం అయిందివిపత్తు ప్రమాదాల తీవ్రతను తగ్గించుకోవడంలో భారత ప్రభుత్వం సాధించిన పురోగతినీవిపత్తు పరంగా పెట్టుబడులను పెంపుదల అంశాలనీ డాక్టర్ పీకే మిశ్రా... మంత్రులు నిర్వహించిన వివిధ చర్చల్లో వివరించారుజి-20 ఆతిధ్య దేశంగా డీఆర్ఆర్ డబ్ల్యూజీ పరంగా గుర్తించినముందస్తు హెచ్చరిక వ్యవస్థలువిపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాలుడీఆర్ఆర్ పెట్టుబడులువిపత్తు అనంతర పునర్నిర్మాణంప్రకృతి పరిష్కారాలుఅన్న అయిదు ప్రాధాన్యాంశాలను దృష్టిలో ఉంచుకుని విపత్తు ప్రమాదాల నివారణ దిశగా భారతదేశం తీసుకుంటున్న క్రియాశీలక చర్యలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారువిపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల విషయంలోకొయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెజిలియన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐపేరుతో అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి చేపట్టిన కార్యక్రమాన్ని వివరించారుప్రస్తుతం ఈ సంఘంలో 40 దేశాలూ, 7 అంతర్జాతీయ సంస్థలూ సభ్యత్వం తీసుకున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా విపత్తుల నివారణ కోసం సెండాయ్ ప్రణాళికకు కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి వెల్లడించారువిపత్తులను తట్టుకునేట్లు ప్రపంచాన్ని తయారు చేసేందుకు అవసరమైన విజ్ఞానాన్ని పంచుకోవడంసాంకేతిక బదిలీసుస్ధిరమైన అభివృద్ధి అంశాల్లో అంతర్జాతీయ సహకారం మరింత విస్తృతం కావాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

బ్రెజిల్దక్షిణాఫ్రికా మంత్రులు నిర్వహించిన ట్రోయికా సమావేశంలో కూడా భారతీయ ప్రతినిధి బృందం పాలుపంచుకున్నదిఆతిధ్య దేశం బ్రెజిల్ తోపాటుజపాన్నార్వేదక్షిణాఫ్రికాజర్మనీ దేశాల మంత్రులతోనూఅలాగే అక్కడకు విచ్చేసిన అంతర్జాతీయ సంస్థలతోనూ ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించిందిపెరుగుతున్న ఉష్ణోగ్రతలపై యూఎన్ఎస్జీ ఇచ్చిన పిలుపుపై స్పందిస్తూ...స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సంప్రదాయ విధానాలను ప్రముఖంగా ప్రోత్సహిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి తెలిపారు.

భారతదేశం అధ్యక్షతన 2023లో నిర్వహించిన జీ-20 సమావేశాల సందర్భంగా భారతదేశం తీసుకున్న చొరవ కారణంగానే తొలి డీఆర్ఆర్ డబ్ల్యూజీ ఏర్పడిందిడీఆర్ఆర్ డబ్ల్యూజీని కొనసాగిస్తూదీనిని మంత్రుల స్థాయికి చేర్చినందుకు జీ-20 సమావేశాలకు ప్రస్తుతం ఆతిధ్యం ఇస్తున్న బ్రెజిల్ దేశాన్ని డాక్టర్ మిశ్రా అభినందించారురానున్న జీ-20 సమావేశాలకు అతిధ్యమిస్తున్న దక్షిణాఫ్రికా సమావేశాల్లో కూడా డీఆర్ఆర్ డబ్ల్యూజీ కి మద్దతు పలుకుతామని భారతదేశం హామీ ఇచ్చింది.

ప్రపంచ డీఆర్ఆర్ ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడంలోనూవిపత్తుల నివారణ ప్రపంచానికి రూపకల్పన చేయడంలోనూభారతదేశపు ప్రాధాన్యం మరింత పెరుగుతోందని చెప్పడానికి భారతదేశం ఈ సమావేశాల్లో పాల్గొనడమే నిదర్శనం.

 

***


(Release ID: 2070372) Visitor Counter : 51