ప్రధాన మంత్రి కార్యాలయం
ఆరంభ్ 6.0 సందర్భంగా యువ సివిల్ సర్వీసు ఉద్యోగులతో ప్రధానమంత్రి ముఖాముఖి
పౌరుల సులభతర జీవనాన్ని మెరుగుపరచాలని యువ ఉద్యోగులకు ప్రధానమంత్రి విజ్ఞప్తి
Posted On:
30 OCT 2024 9:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరంభ్ 6.0 కార్యక్రమంలో భాగంగా సివిల్ సర్వీసు ఉద్యోగులతో సంభాషించారు. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో పరిపాలనను మెరుగుపరచడంపై యువ ప్రభుత్వోద్యోగులతో ప్రధాని విస్తృతంగా చర్చించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు బలమైన యంత్రాంగాలను కలిగి ఉండటం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను మెరుగుపరచడం వంటి అంశాల ప్రాముఖ్యతను కూడా ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. పౌరులకు 'ఈజ్ ఆఫ్ లివింగ్ (సులభతర జీవనం)'ను మెరుగుపర్చాలని యువ ప్రభుత్వోద్యోగులను ప్రధాని కోరారు.
ప్రధాన మంత్రి 'ఎక్స్' మాధ్యమంలో ఇలా పోస్ట్ చేశారు:
‘‘ఆరంభ్ 6.0 లో భాగంగా యువ సివిల్ సర్వీస్ ఉద్యోగులతో సంభాషించాను. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో పరిపాలనను ఎలా మెరుగుపరచాలనే అంశంపై విస్తృతంగా చర్చించాం. బలమైన అభిప్రాయాలు పంచుకునే యంత్రాంగాలను కలిగి ఉండటం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను మెరుగుపర్చాల్సిన అవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించాం. పౌరులకు సులభతర జీవినాన్ని మెరుగుపర్చాలని యువ ప్రభుత్వోద్యోగులను కోరాను’’.
***
MJPS/VJ
(Release ID: 2069799)
Visitor Counter : 47
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam