ప్రధాన మంత్రి కార్యాలయం
హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సు అనేది సుస్థిరతను పెంపొందించటానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు దోహదపడే మా ప్రయత్నంలో ఒక భాగం : ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
21 OCT 2024 8:07PM by PIB Hyderabad
హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సులో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే ప్రయాణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుస్థిరతను పెంపొందించడానికి, రాబోయే తరాలకు హరిత భవిష్యత్తు అందించేందుకు దోహదపడేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలో హరిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు ఒక భాగమని ఆయన అన్నారు.
పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్ట్‌కు మోదీ ఈ విధంగా స్పందించారు:
“ హరిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సులో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ప్రయాణించటం సంతోషంగా ఉంది. సుస్థిరతను పెంపొందించడానికి, రాబోయే తరాలకు హరిత భవిష్యత్తు అందించేందుకు దోహదపడే చర్యలో ఇటువంటి బస్సు ఒక భాగం. @tsheringtobgay"
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2066909)
आगंतुक पटल : 129
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
English
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam